Allu Arjun: అట్లీతో అల్లు అర్జున్ సినిమా - కన్ఫర్మ్ అయినట్లేనా?
‘పుష్ప 2’ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత అసలు అల్లు అర్జున్.. ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తికర విషయంగా మారింది. ఇక అట్లీ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉండబోతుందని దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది.
ఈరోజుల్లో ఒక భాషలోని నటుడు మరోభాషలోని దర్శకుడితో కలిసి పనిచేయడం కామన్ అయిపోయింది. అలా చేసిన ప్రాజెక్ట్సే బ్లాక్‌బస్టర్ హిట్స్ అవుతున్నాయి. అందుకే చాలావరకు తెలుగు హీరోలు కూడా అదే ఫార్ములాను ఫాలో అయిపోతున్నారు. ఇప్పటికే ఆ ఫార్ములాను ఫాలో అయ్యి ‘సలార్’తో హిట్ కొట్టాడు ప్రభాస్. తరువాత రామ్ చరణ్ లైన్‌లో ఉన్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే చేయబోతున్నాడని టాలీవుడ్‌లో రూమర్స్ వైరల్ అయ్యాయి. ఇప్పటికే ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ సినిమాల పరిస్థితి ఏంటి అని ఫ్యాన్స్ సందేహంలో ఉండగా.. వారికి ఒక అదిరిపోయే అప్డేట్ ఎదురయ్యింది.
అట్లీతో అల్లు అర్జున్..
ఇప్పటికే పలుమార్లు.. పలువురు తమిళ దర్శకులతో అల్లు అర్జున్ సినిమాను ఫైనల్ చేశాడు. కానీ అనుకోని కారణాల వల్ల అందులో ఏ సినిమా కూడా వర్కవుట్ అవ్వలేకపోయింది. ఇప్పుడు మరోసారి కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీతో బన్నీ సినిమా చేయనున్నాడని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. కొన్ని నెలలుగా ఈ రూమర్స్.. టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నా.. ఫైనల్‌గా ఈ రూమర్స్ నిజమే అని సమాచారం అందింది. అంతే కాకుండా దీనికి మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ వ్యవహరిస్తాడని తెలుస్తోంది. అట్లీ తెరకెక్కించిన ‘జవాన్’ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి అల్లు అర్జున్, అట్లీ కలిసి పనిచేస్తారని రూమర్స్ మొదలయ్యాయి.
ఆ ట్వీట్‌తోనే రూమర్స్ మొదలు..
కోలీవుడ్‌లో పలు సినిమాలు చేసి.. ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకుడిగా నిలిచాడు అట్లీ. అందుకే చేసింది తక్కువ సినిమాలే అయినా వెంటనే బాలీవుడ్‌లో డెబ్యూ చేయాలనుకున్నాడు. దానికోసం షారుఖ్ ఖాన్‌లాంటి సీనియర్ హీరోను ఎంచుకున్నాడు. సౌత్ ఫ్లేవర్ కథతో ‘జవాన్’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాకు మ్యూజికే ప్రాణంగా నిలిచింది. అందుకే అనిరుధ్‌ను ప్రశంసిస్తూ అల్లు అర్జున్.. ఒక ట్వీట్ చేశాడు. అందులో ‘నా సినిమాకు కూడా ఇలాగే అందించాలి’ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీంతో అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనుందని, దానికి అనిరుధ్ మ్యూజిక్ అని రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా ఆ రూమర్స్ నిజమే అని కన్ఫర్మ్ అయ్యింది.
2024 చివర్లో..
‘గత కొన్నిరోజులుగా అల్లు అర్జున్, అట్లీ మధ్య డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు అన్ని సక్రమంగా వెళ్తున్నాయి. 2024 చివర్లో ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని అట్లీ అనుకుంటున్నాడు. అల్లు అర్జున్ కూడా అప్పుడే తన డేట్స్‌ను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదొక కమర్షియల్ ఎంటర్‌టైనర్. ఇందులో మునుపెన్నడూ లేనివిధంగా అల్లు అర్జున్‌ను కొత్తగా చూపించాలని అట్లీ అనుకుంటున్నాడు. అనౌన్స్‌మెంట్ ఇవ్వడంకంటే ముందు పలు విషయాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు’ అని టీమ్ మెంబర్ సమాచారం అందించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అసలు ఈ సినిమా ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయాలను సీక్రెట్‌గా ఉంచుతున్నారు మేకర్స్. ఇది పూర్తయిన తర్వాత అట్లీ ప్రాజెక్ట్‌లో అడుగుపెట్టనున్నాడు బన్నీ.
Also Read: సలార్ థియేటర్లలో వారికి నో ఎంట్రీ, నెల్లూరులో ప్రభాస్ అభిమానుల ఆందోళన