అన్వేషించండి

No entry for children at Salaar Theatres: సలార్ థియేటర్లలో వారికి నో ఎంట్రీ, నెల్లూరులో ప్రభాస్ అభిమానుల ఆందోళన

Salaar Movie News updates: సలార్ విడుదలైన తరువాత తొలి మూడురోజులపాటు అందర్నీ అనుమతించిన థియేటర్ల యాజమాన్యాలు.. సడన్ గా క్రిస్మస్ రోజున బోర్డులెందుకు పెట్టాయని ప్రశ్నిస్తున్నారు తల్లిదండ్రులు.

ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ (Salaar Movie) ఈనెల 22న ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ రావడంతో థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. సలార్ మూవీకి చిన్న పిల్లలు కూడా వస్తున్నారు. మూడు రోజులుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమా ప్రదర్శిస్తున్నారు. అయితే ఇది ఎ-సర్టిఫికెట్ కావడంతో 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే దీన్ని చూడాలనే నిబంధన సడన్ గా తెరపైకి తెచ్చారు. నెల్లూరులో 18 ఏళ్లు దాటిన వారికి మాత్రమే ప్రవేశం అనే బోర్డులు థియేటర్ల ముందు ఉంచారు. దీంతో ముందుగానే టికెట్ తీసుకున్న వారు థియేటర్ల వరకు వచ్చి అవాక్కయ్యారు. పిల్లలతో కలసి థియేటర్లకు వచ్చిన పేరెంట్స్.. యాజమాన్యంతో గొడవ పెట్టుకున్నారు. నెల్లూరు (Nellore)లోని పలు థియేటర్ల ముందు గొడవ జరిగింది. అటు తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి గొడవలు జరిగినట్టు సమాచారం. 

సలార్ ఎ-సర్టిఫికెట్ సినిమా, 18 ఏళ్లు పైబడినవారు మాత్రమే థియేటర్లలో సలార్ చూడొచ్చు. సెన్సార్ నిబంధనలను ఎవరూ కాదనలేరు కానీ.. ఇటీవల కాలంలో ఈ నిబంధనలు ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. ఎ-సర్టిఫికెట్ సినిమాలను కూడా పిల్లలతో కలసి తల్లిదండ్రులు చూస్తున్న సందర్భం ఇది. అయితే యానిమల్ విషయంలో మాత్రం తల్లిదండ్రులు ఆ సాహసం చేయలేదు. తొలిరోజు పొరపాటున పిల్లల్ని తీసుకెళ్లినవారు షాకయ్యారు. ఆ తర్వాత ఆ సినిమా వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రెండో రోజు నుంచి పిల్లల్ని ఎవరూ తీసుకెళ్లడం లేదు. అయితే సలార్ ది మరో కథ. ఈ సినిమాలో అశ్లీల సన్నివేశాలు లేవు, కేవలం వయొలెన్స్ ఎక్కువ. దీనికి కూడా సెన్సార్ బోర్డ్ ఎ-సర్టిఫికెట్ ఇచ్చింది. ఆ మాత్రం ఫైటింగ్ సీన్లు ఇప్పుడు అన్ని సినిమాల్లోనూ ఉన్నాయి కదా, మాకెందుకు పర్మిషన్ ఇవ్వరంటూ పిల్లలు నెల్లూరులోని థియేటర్ల వద్ద గొడవ చేస్తున్నారు. 

అందులోనూ సలార్ విడుదలై నాలుగు రోజులు కావస్తోంది. తొలి మూడురోజులపాటు అందర్నీ అనుమతించిన థియేటర్ల యాజమాన్యాలు.. సడన్ గా క్రిస్మస్ రోజున బోర్డులెందుకు పెట్టాయని ప్రశ్నిస్తున్నారు తల్లిదండ్రులు. సలార్ మూవీని థియేటర్లలో చూసేందుకు అనుమతివ్వాలని యాజమాన్యాలతో గొడవ పెట్టుకుంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేశామని, థియేటర్ల యాజమాన్యాలు టికెట్ డబ్బులు కూడా తిరిగివ్వడం లేదని అంటున్నారు. ఇంటర్వెల్ తర్వాత లోపలికి అనుమతిస్తామని చెబుతున్నారని, ఇదెక్కడి న్యాయం అంటున్నారు. 

పరిష్కారం ఏంటి..?
సెన్సార్ నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత థియేటర్ల యాజమాన్యాలపై ఉంది. ఒకవేళ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆ సినిమా చూపించాలనుకున్నా నిబంధనలు అడ్డొస్తున్నాయి. దీంతో చేసేదేం లేక వారు వెనుదిరుగుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఇబ్బందులు రాలేదని, తొలిసారిగా ఇలాంటి బోర్డులు పెట్టి ప్రభాస్ సినిమాని చూడనీయకుండా చేస్తున్నారని అభిమానులు గొడవ చేస్తున్నారు. 

హైదరాబాద్ లోనూ ఆందోళన.. 
హైదరాబాద్ లోని పలు మల్టీప్లెక్స్ ల వద్ద కూడా ఇలాంటి పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. ఉప్పల్ లోని డీఎస్ఎల్ వర్చువల్ మాల్ లోని సినీ పోలీస్ థియేటర్లలో యానిమల్, సలార్ సినిమాలు ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాలకు 18 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే అనుమతి అని యాజమాన్యం బోర్డులు పెట్టింది. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని థియేటర్ కి వచ్చిన కుటుంబ సభ్యులు.. ఈ బోర్డులు చూసి షాకవుతున్నారు. పిల్లలకు అనుమతి లేదు, పెద్దల్ని మాత్రమే లోపలికి పంపిస్తామని థియేటర్ సిబ్బంది చెప్పేసరికి వారు ఆందోళనకు దిగారు. సెన్సార్ బోర్డు నిబంధన మేరకే పిల్లలని అనుమతించడం లేదని థియేటర్ సిబ్బంది చెబుతున్నా... ఎప్పుడూ లేని నిబంధనలు ఇప్పుడే ఎందుకని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇంతకంటే ఘోరమైన సినిమాలకు కూడా చిన్న పిల్లల్ని అనుమతిచ్చారు కదా అప్పుడు నిబంధనలు ఏమైపోయాయని అడుగుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget