Allu Arjun Birthday Special: బన్నీ బర్త్ డే స్పెషల్ - టీవీల్లో హిట్ సినిమాల జాతర
Allu Arjun Birthday Special: అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా బుల్లితెర ఛానెల్స్ ఓ నిర్ణయానికి వచ్చాయి. ఫ్యాన్స్ కోసం తన హిట్ సినిమాలు అన్నీ బ్యాక్ టు బ్యాక్ టెలికాస్ట్ చేస్తున్నాయి.
Allu Arjun Birthday Special Movies On TV: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే అంటే సెలబ్రేషన్స్ మామూలుగా ఉండదు. ముఖ్యంగా ‘పుష్ప’ తర్వాత బన్నీ క్రేజ్ మరింత పెరిగిపోవడంతో ఇప్పటి నుండి తగ్గేదే లే అంటున్నారు ఫ్యాన్స్. అందుకే బుల్లితెరపై కూడా అల్లు అర్జున్ పుట్టినరోజు హంగామా కనిపిస్తోంది. ఈ రోజు దాదాపు ప్రతీ తెలుగు ఛానల్‌లో బన్నీ సినిమాలే టెలికాస్ట్ అవ్వనున్నాయి. అల్లు అర్జున్ కెరీర్‌లోని హిట్ సినిమాలన్నీ నేడు బుల్లితెరపై సందడి చేయనున్నాయి. కానీ ఆ లిస్ట్‌లో ‘పుష్ప’ మాత్రం లేకపోవడంతో విశేషం. ఇంతకీ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏ ఛానల్‌లో ఏయే సినిమాలు ప్రసారం అవుతున్నాయో మీరూ చూసేయండి.
బ్యాక్ టు బ్యాక్... టోటల్ ఎనిమిది సినిమాలు!
బన్నీ బర్త్ డే స్పెషల్‌గా ఈరోజు మొత్తం తన సినిమాలు తప్పా వేరే చిత్రాలకు చోటు లేదు అంటోంది ‘స్టార్ మా మూవీస్’. వరుసగా అతను నటించిన నాలుగు హిట్ చిత్రాలను బ్యాక్ టు బ్యాక్ ప్రసారం చేయనుంది. ముందుగా ఉదయం 9 గంటలకు... ‘జులాయి’ టెలికాస్ట్ అవుతుంది. ఆ తర్వాత చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పర్సనల్ ఫేవరెట్ అయిన ‘పరుగు’ మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది. ఆ వెంటనే అతని కెరీర్‌లోనే అత్యంత స్టైలిష్ లుక్‌తో తెరకెక్కిన ‘బద్రీనాథ్’ మధ్యాహ్నం 3 గంటలకు బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సాయంత్రం 6 గంటలకు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలోని రెండో సూపర్ హిట్ సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ టెలికాస్ట్ కానుంది.
సినిమా ఫ్లాప్ అయినా...
స్టార్ మా మూవీస్‌లో మాత్రమే కాదు... జీలో కూడా అల్లు అర్జున్ బర్త్ డే సందడి కనిపిస్తోంది. ముందుగా ఉదయం 9 గంటలకు ‘జీ తెలుగు’లో ‘డీజే’ టెలికాస్ట్ కానుంది. కెరీర్‌లోనే మొదటిసారి ఒక బ్రాహ్మణ కుర్రాడి పాత్రలో నటించడం మాత్రమే కాకుండా తన వేషానికి తగిన డైలాగ్ డెలివరీతో అందరినీ ఆకట్టుకున్నాడు బన్నీ. ఇక ‘జీ సినిమాలు’లో సాయంత్రం 6 గంటలకు ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ప్రసారం కానుంది. రైటర్ వక్కంతం వంశీ దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రమిది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచినా కూడా అప్పటివరకు కెరీర్‌లో చూడని అల్లు అర్జున్‌ను ఈ సినిమాలో చూశారు ప్రేక్షకులు.
Brthday special movies in All channels 🔥
— Allu Arjun FC (@AlluArjunHCF) April 8, 2024
It's ALLU ARJUN DAY 🛐@alluarjun #HappyBirthdayAlluArjun pic.twitter.com/zG0k8cLeLy
గోన గన్నారెడ్డి వచ్చేస్తున్నాడు...
ఎప్పుడూ ఎవర్‌గ్రీన్ క్లాసిక్ చిత్రాలనే ఎక్కువగా ప్రసారం చేసే ‘ఈటీవీ సినిమా’ సైతం అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్‌గా అతను కీలక పాత్ర పోషించిన ‘రుద్రమదేవి’ని టెలికాస్ట్ చేస్తోంది. ఈ మూవీలో అల్లు అర్జున్ హీరో కాకపోయినా గోన గన్నారెడ్డి పాత్రలో అందరినీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఈ మూవీ సక్సెస్‌కు ఎక్కువశాతం క్రెడిట్ బన్నీకే దక్కుతుంది. ‘జెమిని’ కూడా ‘వేదం’ మూవీని ప్రసారం చేసి అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా బుల్లితెర ప్రేక్షకులను అలరించనుంది. ‘వేదం’లో ఈ హీరో పర్ఫార్మెన్స్ గురించి ప్రేక్షకులు ఇప్పటికీ మాట్లాడుకుంటారు. ఈ మూవీ క్లైమాక్స్‌లో తన నటనతో అందరూ కంటతడి పెట్టేలా చేశాడు బన్నీ.