విజయ్ దేవరకొండ మార్కెట్ ఎలా ఉంది? థియేట్రికల్ పరంగా ఆయన సినిమాల ప్రీ రిలీజ్ ఎలా జరుగుతుంది? అనేది చూడండి.

ఏప్రిల్ 5న 'ఫ్యామిలీ స్టార్'తో విజయ్ థియేటర్లలోకి వస్తున్నారు. దీంతో పాటు లాస్ట్ ఫైవ్ ఫిలిమ్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్...

'ఫ్యామిలీ స్టార్' వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కుల్ని రూ. 43 కోట్లకు అమ్మారు. 'ఖుషి', 'లైగర్' కంటే ఈ అమౌంట్ తక్కువ.

'ఫ్యామిలీ స్టార్'కు ముందు విజయ్ దేవరకొండ సినిమా 'ఖుషి' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 53 కోట్లు. 

విజయ్ దేవరకొండ కెరీర్‌లో హయ్యస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే 'లైగర్'. రూ. 88.50 కోట్లకు ఆ చిత్రాన్ని అమ్మారు.

'వరల్డ్ ఫేమస్ లవర్' రూ. 30.50 కోట్లు... 'డియర్ కామ్రేడ్' రూ. 34.60 కోట్లు... ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాయి.

'టాక్సీవాలా' రూ. 18 కోట్లు.... తెలుగు - తమిళ్ బైలింగ్వల్ ఫిల్మ్ 'నోటా' రూ. 26 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాయి.

'ఫ్యామిలీ స్టార్' భారీ సక్సెస్ కొట్టి విజయ్ దేవరకొండను 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే హీరోను చేస్తుందో? లేదో? చూడాలి.