Happy Birthday Allu Arjun : బర్త్‌డే బాయ్ బన్నీ ఫిట్నెస్ టిప్స్ ఇవే.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అలా చేయడం వల్లే ఫిట్‌గా ఉన్నానంటున్న ఐకాన్ స్టార్
Icon Star Allu Arjun :అలు అర్జున్ స్టైలిష్ స్టార్‌గానే కాదు.. ఫిట్నెస్ విషయంలో కూడా అభిమానులకు రోల్‌మోడల్‌గా నిలుస్తాడు. అలా ఉన్నాడు కాబట్టే 20 ఏళ్లుగా హీరోగా సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతున్నాడు.
Allu Arjun Diet and Fitness Tips : అల్లు అర్జున్ బర్త్‌డే (ఏప్రిల్ 8వ తేదీన) (Allu Arjun Birthday 2024)సందర్భంగా.. అల్లు అర్జున్ గురించి.. అతని ఫిట్నెస్, డైట్, కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలపై ఓ లుక్కేద్దాం. గంగోత్రి సినిమాతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు బన్నీ. రెండు దశాబ్ధాలుగా సినిమాలు చేస్తూ అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. హీరోగా రెండు దశాబ్ధాలు చేస్తూ.. స్టైలిష్ స్టార్‌గా ఉండడం అంటే అంత సులభమైన విషయం కాదు. 2003లో గంగ్రోతితో కెరీర్‌ను ప్రారంభించినా.. ఆర్య సినిమాతోనే బన్నీకి సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చింది. అప్పటి ఆర్య సినిమాతో డైరక్టర్ సుకుమార్ బన్నీకి స్టైలిష్ స్టార్ అనే పేరును తీసుకువచ్చాడు. ఇప్పుడు బన్నీ పాన్ ఇండియాలో ఐకాన్ స్టార్‌గా మారడం వెనుక కూడా సుకుమార్ ఉన్నాడు.
ఐకాన్ స్టార్‌గా ఎదిగి..
ఏది ఏమైనా 20 ఏళ్లుగా స్టైలిష్ స్టార్‌గా ఉంటూ.. ఫిట్‌నెస్‌ని కాపాడుకుంటూ.. ఫ్యాన్ బేస్‌ని పెంచుకోవడం అంటే అంత సులభమేమి కాదు. అల్లు రామలింగయ్య మనవడిగా.. ప్రొడ్యూసర్ కొడుకుగా.. సినిమాలో కెరీర్ ప్రారంభించడం సులభమే కానీ.. దానిని 20 ఏళ్లుగా నిలబెట్టుకోవడం అంటే కచ్చితంగా అభినందిచాల్సిన విషయమే. కేవలం తెలుగులో సినిమాలు చేస్తూ.. మలయాళంలో కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడంటే అది కచ్చితంగా బన్నీ మ్యాజిక్కే. పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారి.. ఇండియా మొత్తం పుష్ప మానియా క్రియేట్ చేశాడు. అలాంటి బన్నీ కేవలం నటుడిగానే కాకుండా.. ఫిట్నెస్ విషయంలో కూడా తన అభిమానులకు రోల్ మోడల్‌గా నిలుస్తున్నాడు.
బన్నీ ఫిట్నెస్ టిప్స్
నాలుగు పదుల వయసులో కూడా కుర్రాడిలా కనిపించడమంటే ఫిట్నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. బన్నీ కూడా ఫిట్నెస్ విషయంలో ఎలాంటి రాజీపడడు. ఆ మధ్య ఓ సినిమా ప్రమోషన్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన డైట్, వ్యాయామం వంటి విషయాలపై ఆసక్తికర విషయాలు తెలిపాడు బన్నీ. ఈ రోజు బన్నీ బర్త్‌డే సందర్భంగా.. ఫిట్నెస్ విషయంలో బన్నీ తీసుకునే జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం. బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. హెల్తీగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా దీనిని ఫాలో అవ్వొచ్చు.
బన్నీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో 45 నుంచి గంట వరకు రన్ చేస్తాడట. ఇలా చేయడం వల్లే తను ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నానని చెప్తున్నాడు బన్నీ. పైగా తన మెటబాలీజం పెరగడంలో ఇదే బాగా హెల్ప్ చేసిందని అంటున్నాడు. లంచ్, డిన్నర్ డైట్‌ని బట్టి మారుతుంది కానీ.. బ్రేక్‌ఫాస్ట్ మాత్రం ఎప్పుడూ ఒకటే తీసుకుంటాడట. అవే ఎగ్స్. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినప్పటి నుంచి బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపాడు. అలాగే పోస్ట్ వర్క్ అవుట్‌కి ముందు ప్రోటీన్ షేక్స్, డ్రింక్స్ తీసుకుంటానని వెల్లడించాడు.
ఆ పదార్థాలకు దూరంగా ఉంటాడట..
సినిమాకు తగ్గట్లు తన డైట్ ఉంటుందని తెలిపాడు. వారంలో ఓ రెండు సార్లు ఫుడ్ విషయంలో చీట్ చేస్తూ ఉంటానని.. సినిమాకు పర్లేదు అనుకున్నప్పుడు మాత్రమే చీట్ డే ఫాలో అవతానని చెప్పాడు. డెయిరీ ప్రొడెక్ట్స్కి మాత్రం బన్నీ దూరంగా ఉంటాడట. వాటి వల్ల తనకి అలెర్జీ ఉందని.. అందుకే వాటిని తీసుకోనని తెలిపాడు. కాస్త లేజీగా ఉంటే వారానికి మూడుసార్లు వర్క్ అవుట్ చేస్తానని.. యాక్టివ్‌గా ఉన్నప్పుడు.. సినిమాకు అవసరమనుకున్నప్పుడు వారంలో ఏడు రోజులు వర్క్ అవుట్ చేస్తానని తెలిపాడు బన్నీ. అల్లు అర్జున్‌లాగా మీరు కూడా ఫిట్‌గా ఉండాలంటే.. బన్నీ వర్క్ అవుట్ రోటీన్ని ఫాలో అయిపోవచ్చు.
Also Read : ఉగాది పచ్చడిని ట్రెడీషనల్గా ఇలాగే చేయాలి.. మామిడి కాయలను అస్సలు వేయకూడదట