Alia Bhatt: మీ ఇల్లు కాదు... ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్లండి - ఫోటోగ్రాఫర్లపై ఆలియా భట్ ఆగ్రహం
Alia Bhatt Angry: బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ఫోటోగ్రాఫర్లపై తీవ్ర అసహనానికి గురయ్యారు. తన ఇంటి ఆవరణలోకి వచ్చిన వారిని బయటకు వెళ్లాలంటూ విజ్ఞప్తి చేశారు.

Alia Bhatt Angry On Photographers: సెలబ్రిటీలు బయటకు వెళ్లినప్పుడు, ఎయిర్ పోర్టుల్లో కనిపించినప్పుడు ఉండే హడావుడి మామూలుగా ఉండదు. సెల్ఫీల కోసం ఫ్యాన్స్, ఫోటోగ్రాఫర్లు కవరేజీ కోసం ఎగబడుతుంటారు. హీరోయిన్ల విషయంలో అయితే ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ హడావుడి వారిని మరింత ఇబ్బందుల్లోకి నెడుతుంది.
ఇటీవల సమంత జిమ్ అనంతరం బయటకు రాగా ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తుంటే తీవ్ర అసహనానికి గురయ్యారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ సైతం ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేశారు. తన ఇంటి ఆవరణలోకి వచ్చిన ఫోటోగ్రాఫర్లపై తీవ్ర అసహనానికి గురైన ఆమె... అక్కడి నుంచి బయటకు వెళ్లాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్లీజ్... బయటకు వెళ్లండి
గురువారం పికిల్ బాల్ గేమ్ ఆడి ఇంటికి వచ్చిన ఆలియా భట్ తన ఇంటి దగ్గర ఫోటోగ్రాఫర్లను చూసి తీవ్ర అసహనానికి గురయ్యారు. కారు దిగుతున్న ఆమెను ఇంటి కాంపౌండ్‌లోకి ప్రవేశించి ఫోటోలు తీయడం ప్రారంభించారు. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆలియా... 'ఇంటి లోపలికి రాకండి... ఇదేం మీ ఇల్లు కాదు... దయచేసి బయటకు వెళ్లండి.' అని కోరారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీలకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుందని... దాన్ని దాటి వారి పర్మిషన్ లేకుండా ఫోటోలు తీయడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. మితిమీరిన స్వేచ్ఛ ఎప్పటికే ప్రమాదమేనంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఎయిర్ పోర్టులు, బహిరంగ ప్రదేశాల్లోనూ సమయం సందర్భం లేకుండా సెలబ్రిటీలను ఫోటోలు తీయడం మానుకోవాలంటూ హితవు పలుకుతున్నారు.
View this post on Instagram
లేటెస్ట్ మూవీ 'ఆల్ఫా'
ఇక సినిమాల విషయానికొస్తే... ఆలియా భట్ (Alia Bhatt) ఇటీవల 'వార్ 2'లో కనిపించారు. బాబీ డియోల్‌తో ఓ సీన్‌లో కనిపించి సర్ ప్రైజ్ చేశారు. గతేడాది 'జిగ్రా' మూవీతో పలకరించగా ఆ మూవీ నిరాశపరిచింది. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నారు. ఈ ఏడాది 'ఆల్ఫా' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో నిర్మిస్తుండగా శివ్ రావేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 25న సినిమా థియేటర్లలోకి రిలీజ్ కానుంది. స్పై యూనివర్స్‌లో భాగంగా రాబోతోన్న ఫస్ట్ మహిళా గూఢచారి చిత్రంగా ఈ మూవీ నిలవనుంది. దీంతో పాటే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'లవ్ అండ్ వార్' చిత్రంలోనూ నటించనున్నారు.





















