By: ABP Desam | Updated at : 04 Jun 2023 10:29 AM (IST)
శివ బాలాజీ, మధుమిత(Photo Credit: etvteluguindia/YouTube)
గత కొంతకాలంగా వెన్నెల కిషోర్ హోస్ట్ గా ఒక కపుల్ షో చేస్తున్నారు. ‘అలా మొదలయ్యింది’ అంటూ సెలబ్రిటీ కపుల్స్ ను పిలిచి వారి గురించి ఆసక్తికర విషయాలు రాబడుతున్నారు. ఫుల్ ఫన్ గా సాగే ఈ షో తాజా ఎపిసోడ్ కు నటీనటులు శివబాలాజీ, అతని భార్య మధుమిత గెస్ట్ లుగా వచ్చారు. ఈ సందర్భంగా పలు ఫన్నీ విషయాలను గుర్తు చేసుకున్నారు. తమ ప్రేమ కథ గురించి చెప్పి అందరినీ నవ్వించారు. పెళ్లికి ముందు ఎలా పరిచయం ఏర్పడింది? ఎలా ప్రేమ మొదలయ్యింది? పెళ్లికి ఎదురైన ఇబ్బందులేంటి? అనే విషయాల గురించి మాట్లాడారు.
ఇక షో చివరలో శివబాలాజీ మా ప్రెసిడెంట్ మంచు విష్ణుకు కాల్ చేశారు. తాను వెన్నెల కిషోర్ షోకు వచ్చినట్లు చెప్పారు. వెంటనే మంచు విష్ణు వెన్నెల కిషోరు గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. వెన్నెల కిషోర్ అంటే ఆయన నివాసం ఉండే వీధిలో అమ్మాయిలంతా భయపడుతారని చెప్పుకొచ్చారు. “వెన్నెల కిషోర్ కాలనీలో అమ్మాయిలు.. ఆయన షూటింగ్ వెళ్లిపోయాడు అని తెలిసిన తర్వాతే బయటికి వస్తారు” అని చెప్పారు. వెంటనే ఫోన్ అందుకుని వెన్నెల కిషోర్ “మీ గురించి కాదిక్కడ నా గురించి మాట్లాడుతున్నారు” అంటూ పంచ్ వేస్తాడు. వెంటనే విష్ణు కలుగజేసుకుని “నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావ్” అనగానే షోలో అందరూ నవ్వేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఇక ఈ షోలో తమ ప్రేమ గురించి మధుమిత పలు విషాయాలు చెప్పారు. ప్రేమ అనే ప్రపోజల్ తొలుత శివ బాలాజీ నుంచే మొదలైందని చెప్పారు. అంతేకాదు, తాను ఓసారి లిప్ స్టిక్ వేసుకుని పెదాలను అద్దిన టిష్యూ పేపర్ శివ బాలాజీ తీసుకుని దాచి పెట్టుకున్నాడని చెప్పడంతో షోలో నవ్వులు విరబూశాయి. అంతేకాదు, తమ జీవితంలోని పలు ఫన్నీ ఇన్సిడెంట్స్ గురించి ఈ షోలో చెప్పారు.
వాస్తవానికి 2004లో తమిళనాడులోని గోపిచెట్టిపాలెంలో ‘ఇంగ్లీస్ కారన్’అనే సినిమా షూటింగ్ లో శివ బాలాజీతో పరిచయం ఏర్పడిందని గతంలోనే మధుమిత చెప్పారు. తనకంటే రెండు సంవత్సరాలు ఇండస్ట్రీలో సీనియర్ అని వివరించారు. ‘ ఇంగ్లీష్ కారన్’ దర్శకుడు శక్తి సిదంబరన్ కారణంగానే తమ మధ్య ప్రేమ ఏర్పడిందన్నారు. ఆయన క్రియేట్ చేసిన ఓ రూమర్ తోనే తమ మధ్య ఏదో ఉందనే ప్రచారం జరిగిందన్నారు. అయితే, తమ మధ్య లవ్ ప్రపోజల్స్ ఏమీ లేదన్నారు. డైరెక్ట్ గా పెళ్లి గురించే మాట్లాడినట్లు చెప్పారు. తనకు ఎలాంటి అమ్మాయి కావాలి అనుకుంటున్నానో మధుమిత అచ్చం అలాగే ఉందని శివ బాలాజీ చెప్పారు. ఈ పెళ్లికి శివబాలాజీ వాళ్లింట్లో వాళ్లు ఒప్పుకున్నా, తమ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని మధుమిత చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీ వాళ్లు వద్దు అనే ఆలోచచనలో తమ కుటుంబ సభ్యులు ఉండేవారని చెప్పారు. కానీ, చివరకు అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు నా కంటే, అల్లుడినే మా అమ్మానాన్నలు గొప్పగా చూసుకుంటున్నారని మధుమిత వెల్లడించారు. ఇక లేటెస్ట్ ‘అలా మొదలయ్యింది’ ఎపిసోడ్ జూన్ 6న టెలీకాస్ట్ కానుంది.
Read Also: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న కెవ్వు కార్తిక్, అమ్మాయి ఎవరంటే?
Pawan Kalyan: జనసేనకు విరాళం, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో స్టంట్ మ్యాన్ సాయం
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్‌లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!
Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా
అప్పట్లో చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఇంతేనా? ఆసక్తికర విషయాలు చెప్పిన యండమూరి
Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్
Crocodile: హైదరాబాద్ లో నాలాలో కొట్టుకువచ్చిన మొసలి, స్థానికుల భయాందోళన
ఏపీ సెక్రటేరియట్ లో 50 మంది పదోన్నతులు వెనక్కి, ప్రభుత్వం ఉత్తర్వులు
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
/body>