అన్వేషించండి

Akshaye Khanna - MAHAKALI: శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా... PVCU 'మహాకాళి'లో ఫస్ట్ లుక్ రిలీజ్ - చూశారా?

Akshaye Khanna As Shukracharya: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న సినిమా 'మహాకాళి'. ఇందులో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ లుక్ రివీల్ చేశారు.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) రోజు రోజుకూ మరింత క్రేజీగా మారుతోంది. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన 'హను - మాన్'తో ఈ సినిమాటిక్ యూనివర్స్ మొదలైంది. తర్వాత 'జై హనుమాన్' అనౌన్స్ చేశారు. ఇప్పుడు 'పీవీసీయూ'లో తెరకెక్కుతున్న మూడో సినిమా 'మహాకాళి' (PVCU Mahakali Movie). అందులో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా!
Akshaye Khanna First Look From Mahakali Released: విక్కీ కౌశల్ హీరోగా ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన 'ఛావా'లో ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా యాక్ట్ చేశారు. అందులో ఆయన లుక్, నటనకు మంచి పేరు వచ్చింది. ఆయన లుక్ చూసి చాలా మంది సర్‌ప్రైజ్ అయ్యారు. ఇప్పుడు మరోసారి 'మహాకాళి'లో లుక్ ద్వారా సర్‌ప్రైజ్ చేశారు.

'మహాకాళి' సినిమాలో శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా కనిపించనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ''భగవంతుని నీడలో కాంతివంతమైన తిరుగుబాటు జ్వాలగా మారిన శుక్రాచార్యుడు'' అంటూ అక్షయ్ ఖన్నా లుక్ విడుదల చేశారు. తెలుగులో ఆయనకు తొలి చిత్రమిది. ఈ చిత్రాన్ని ఆర్కేడీ స్టూడియోస్ పతాకం మీద ఆర్కే దుగ్గల్ సమర్పణలో రివాజ్ రమేష్ దుగ్గల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Also Read'కాంతార చాప్టర్ 1' సెన్సార్ రిపోర్ట్... రిషబ్ శెట్టి, రుక్మిణీ వసంత్ సినిమా టాక్ ఎలా ఉందంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial)

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో మొదటి ఫిమేల్ సూపర్ హీరో సినిమాగా 'మహాకాళి' తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్నారు. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహించనున్నారు. 'అధీర' సైతం PVCUలో సినిమా. అందులో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కళ్యాణ్ దాసరి హీరోగా, ప్రధాన పాత్రలో ఎస్‌జే సూర్య నటిస్తున్నారు. ఈ సినిమాకు శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు.

Also Read: ఇడ్లీ కొట్టు సెన్సార్ రిపోర్ట్... నిత్యా మీనన్‌తో ధనుష్ మరో హిట్ కొడతాడా? పల్లెటూరి కథ టాక్ ఏమిటంటే?

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget