Idli Kottu Censor Report: ఇడ్లీ కొట్టు సెన్సార్ రిపోర్ట్... నిత్యా మీనన్‌తో ధనుష్ మరో హిట్ కొడతాడా? పల్లెటూరి కథ టాక్ ఏమిటంటే?
Dhanush's Idly Kadai Censor Talk: ధనుష్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా 'ఇడ్లీ కొట్టు'. అక్టోబర్ 1న రిలీజ్ అవుతోంది. మరి, ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకోండి.

ధనుష్ వెర్సటైల్ యాక్టర్ మాత్రమే కాదు... డైరెక్టర్ కూడా! మెగాఫోన్ పట్టి 2017లో 'పా పాండి' తీశాడు. అది హిట్టు. లాస్ట్
ఇయర్ (2024లో) ఎమోషనల్ యాక్షన్ డ్రామా 'రాయన్'తో తెలుగు, తమిళ భాషల్లో విజయం అందుకున్నాడు. మేనల్లుడు పవిష్ నారాయణ్ హీరోగా తీసిన న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ 'జాబిలమ్మ నీకు అంత కోపమా' యువతను మెప్పించింది. ధనుష్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా 'ఇడ్లీ కొట్టు'. ధనుష్, నిత్యా మీనన్ జంటగా నటించిన చిత్రమిది. అక్టోబర్ 1న రిలీజ్ అవుతోంది. ఈ మూవీ సెన్సార్ పూర్తి అయ్యింది. టాక్ ఎలా ఉందో తెలుసుకోండి.
క్లీన్ యు... ఫ్యామిలీ అంతా చూడొచ్చు!
Idli Kottu Censor Certificate: ధనుష్ కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన తాజా సినిమా 'ఇడ్లీ కొట్టు' (తమిళంలో 'ఇడ్లీ కడై')కు సెన్సార్ బోర్డు క్లీన్ 'యు' సర్టిఫికెట్ ఇచ్చింది. ఎటువంటి అసభ్యతకు ఈ సినిమాలో తావు లేదని, అసలు ఎలాంటి హింస లేదా రక్తపాతం లేదని చెప్పవచ్చు! చిన్నారులతో పాటు కుటుంబం అంతా హ్యాపీగా ఈ మూవీకి వెళ్లొచ్చు.
Idli Kottu Runtime: 'ఇడ్లీ కొట్టు' రన్ టైమ్ 147 నిమిషాలు. రెండున్నర గంటల్లో ఈ సినిమా పూర్తి అవుతుంది. పండక్కి ఫ్యామిలీతో కలిసి థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
పల్లెటూరి నేపథ్యంలో సెంటిమెంట్...
ఎమోషన్స్ మెయిన్ సీట్ తీసుకున్న సినిమా!
Idli Kottu Censor Talk: 'ఇడ్లీ కొట్టు' ట్రైలర్ చూస్తే కథ ఏమిటి? అనేది సులభంగా అర్థం అవుతుంది. ఓ పల్లెటూరిలో ధనుష్ తండ్రి (రాజ్ కిరణ్)కు ఇడ్లీ కొట్టు ఉంటుంది. తొలుత ఆ కొట్టులో హీరో కూడా పని చేస్తాడు. తర్వాత ఉద్యోగం కోసం సిటీకి వెళతాడు. హోటల్ మేనేజ్మెంట్ చేస్తాడు. మల్టీ చైన్ రెస్టారెంట్ బిజినెస్ ఉన్న ఫ్యామిలీ దగ్గర పనికి చేరతాడు. అయితే మానసిక సంతృప్తి లేక మళ్ళీ ఊరు వస్తాడు. తమ కంపెనీని వదిలి వచ్చిన హీరో కోసం అరుణ్ విజయ్ వస్తాడు. ఇడ్లీ కొట్టు మూసి వేయాలని ట్రై చేస్తాడు. తర్వాత ఏమైంది? అనేది కథ.
Also Read: 'కాంతార చాప్టర్ 1' సెన్సార్ రిపోర్ట్... రిషబ్ శెట్టి, రుక్మిణీ వసంత్ సినిమా టాక్ ఎలా ఉందంటే?
పల్లెటూరి నేపథ్యంలో తీసిన సినిమా 'ఇడ్లీ కొట్టు'. కథలో ఫ్యామిలీ ఎమోషన్స్, ఫాదర్ & సన్ సెంటిమెంట్ ఎక్కువ హైలైట్ అవుతుందట. ప్రేక్షకులకు ఆ ఎమోషన్ ఎంత కనెక్ట్ అయితే సినిమా అంత హిట్. తమిళ స్టైల్ సీన్స్ & ఎమోషన్స్ తెలుగు ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అవుతాయో చూడాలి.
తెలుగులో 'ఇడ్లీ కొట్టు' సినిమాను శ్రీ వేదాక్షర మూవీస్ (SVM) ప్రొడక్షన్స్ పతాకం మీద రామారావు చింతలపల్లి విడుదల చేస్తున్నారు. తెలుగు వెర్షన్ ట్రైలర్, పాటలు డీసెంట్ రెస్పాన్స్ అందుకున్నాయి. 'తిరు' తర్వాత ధనుష్, నిత్యా మీనన్ కాంబినేషన్ సినిమా కావడంతో ఇంకొంచెం క్రేజ్ ఉంది.
Also Read: మళ్ళీ మెగా పవర్ స్టారే... గ్లోబల్ స్టార్ ట్యాగ్ తీసేసిన రామ్ చరణ్!





















