Mix Up Teaser: డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో నిండిపోయిన 'మిక్స్ అప్' టీజర్ - 'ఆహా'లో వచ్చేది అప్పుడే!
Mix Up Teaser : తెలుగు ఓటీటీ 'ఆహా' తెరకెక్కించిన బోల్డ్ వెబ్ ఫిల్మ్ 'మిక్స్ అప్'టీజర్ ని తాజాగా రిలీజ్ చేశారు.
Mix Up Web Film Teaser : ఓటీటీ మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాక బోల్డ్ కంటెంట్ తో వెబ్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లను తెరకెక్కించడం కామన్ అయిపోయింది. కంటెంట్ ఉన్న కథలకి బోల్డ్ నెస్ ని జత చేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. అలా ఇప్పటికే ఓటీటీలో కొన్ని బోల్డ్ కంటెంట్ తో వచ్చిన సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు తెలుగు ఓటీటీ 'ఆహా' కూడా ఇలాంటి ఓ ప్రయత్నం చేసింది. ఆహాలో త్వరలోనే ఓ బోల్డ్ వెబ్ ఫిల్మ్ రాబోతోంది. దాని పేరే 'మిక్స్ అప్'. కమల్ కామరాజు, ఆదర్శ్ బాలకృష్ణ, పూజా జవేరి, అక్షర గౌడ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ ఆడియన్స్ లో ఆసక్తి పెంచగా... తాజాగా టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్.
డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో నిండిపోయిన టీజర్
పెళ్ళైన రెండు కొత్త జంటల మధ్య 'మిక్స్ అప్' కథ సాగుతుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ఒక జంటలోని భార్యకి, మరో జంటలోని భర్తకి సుఖవంతమైన జీవితంపై ఎక్కువ ఆసక్తి ఉండడం, మిగిలిన ఇద్దరికి లవ్ మేకింగ్ పై ఆసక్తి ఉండడం టీజర్ లో చూపించారు. నలుగురిలో ఒకే రకమైన ఆసక్తితో ఉన్న ఇద్దరు మరో ఇద్దర్ని కలుసుకుంటే... ఆ తరువాత ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే 'మిక్స్ అప్' వెబ్ ఫిల్మ్ చూడాల్సిందే. టీజర్ విషయానికొస్తే... టీజర్ మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఇంటిమేట్ సీన్స్‌తో నింపేశారు. వీటితోనే యూత్‌ను అట్రాక్ట్ చేసేలా టీజర్ కట్ చేశారు. "నాకు మూడ్ రావాలంటే ఎక్సైట్‌మెంట్ కావాలి. ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి" అనే డైలాగ్‌తోనే టీజర్ ప్రారంభమైంది. ఆ తర్వాత కొన్ని బోల్డ్ సీన్స్ తో ఆసక్తి పెంచారు. "దేవుడు మనుషులకు చేతులు ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు అర్థమైంది" అంటూ ఆదర్శ్ చెప్పే డైలాగ్ తో టీజర్ ఎండ్ అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'మిక్స్ అప్' టీజర్ వైరల్ గా మారింది
Get ready to dive into the world of love, lust, and unexpected twists! 🔥🙌#MixUpOnAha from March 15, coming to spice up your love life!#MixUp #AksharaGowda @AadarshBKrishna @kamalkamaraju @IamPoojaJhave pic.twitter.com/thRUFdrxn1
— ahavideoin (@ahavideoIN) February 24, 2024
మార్చ్ 15 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్
మిక్స్ అప్ వెబ్ ఫిల్మ్ రిలీజ్ డేట్ డేట్ ని టీజర్ తో అనౌన్స్ చేశారు. మార్చ్ 15న 'ఆహా' ఓటీటీ లో ఈ వెబ్ ఫిలిం రిలీజ్ కానుందంటూ వెల్లడించారు. థియేటర్లో కాకుండా డైరెక్ట్ ఓటీటీ లోనే ఈ వెబ్ ఫిల్మ్ ని రిలీజ్ చేస్తున్నారు. 'మిక్స్ అప్' మూవీతో అక్షర గౌడ, పూజా జవేరి టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. అక్షర గౌడ ఆహాలోని 'మస్తీస్' అనే వెబ్ సిరీస్‌తోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ సిరీస్‌లో బోల్డ్‌గా నటించడంతో మరిన్ని తెలుగు చిత్రాల్లో తనకు సెకండ్ హీరోయిన్‌గా, కీ రోల్ ప్లే చేసే అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు 'మిక్స్ అప్' అంటూ ఆహాలోనే మరో బోల్డ్ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది.
పూజా జవేరీ విషయానికొస్తే.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'ద్వారక'తో గుర్తింపు తెచ్చుకుంది. తను నటించిన తెలుగు సినిమాలు అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఇప్పుడు మళ్లీ ఈ 'మిక్స్ అప్' అనే బోల్డ్ ఫిల్మ్‌తో రీ ఎంట్రీ ఇస్తోంది. కాగా ఈ వెబ్ ఫిల్మ్ కి డైరెక్టర్ ఎవరనే విషయాన్ని టీజర్ లో రివీల్ చేయలేదు మేకర్స్.
Also Read : నవ్విస్తూ భయపెట్టిన అంజలి - అంచనాలు పెంచేసిన 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' టీజర్