News
News
X

HIT 2: అమెజాన్ ప్రైమ్ నుంచి ‘HIT 2’ తొలగింపు, అసలు కారణం ఏంటంటే?

‘HIT 2’ సినిమా బుధవారం(జనవరి 4) నాడు అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. రెంట్ ప్రాతినదిక వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ఏం జరిగిందో తెలియదు కానీ, ఆ తర్వాత ఈ మూవీని తొలగించింది.

FOLLOW US: 
Share:

డవి శేష్ హీరోగా నటించిన ‘HIT 2’ మూవీ గత డిసెంబర్ 2న థియేటర్లలో విడుదల అయ్యింది. ‘హిట్: ది ఫస్ట్ కేస్’కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. శైలేష్ కొల‌ను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అడవి శేష్ పోలీసు అధికారిగా నటించి మెప్పించారు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ అందుకోవడంతో పాటు ఓవర్సీస్ లోనూ మంచి వసూళ్లు వచ్చాయి. ‘మేజర్’ సినిమా తర్వాత అడవి శేష్ ‘HIT 2’తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఈ సూపర్ హిట్ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ సినిమా రైట్స్ కోసం డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ కూడా పోటీ పడింది. అధిక మొత్తం చెల్లించి అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకుంది.

విడుదలైన కాసేపటికే తొలగింపు

‘HIT 2’ మూవీని బుధవారం (జనవరి 4) నాడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల చేసింది. రెంట్ ప్రాతిపదికన వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. కానీ, ఆ తర్వాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి దీన్ని తొలగించింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో కనిపించడం లేదు. నిజానికి ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ జనవరి 6, 2023 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది. కానీ, ముందుగానే స్ట్రీమింగ్ కు ఉంచింది. ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేకుండా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి తొలగించింది.  దీంతో యూజర్లు ఆశ్చర్యపోయారు. ఎందుకు ముందుగా విడుదల చేశారు? ఎందుకు మళ్లీ తొలగించారు? అనే విషయం తెలియక జుట్టు పీక్కుంటున్నారు. అటు ప్రైమ్ వీడియో కూడా తొలగింపుకు సంబంధించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ముందుగా ప్రకటించినట్లుగానే జనవరి 6 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

View this post on Instagram
 
A post shared by prime video IN (@primevideoin)

విశ్వక్ సేన్ స్థానంలో అడవి శేష్

మాస్ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘HIT’ సినిమాకు సీక్వెల్ గా ‘HIT 2’ వచ్చింది. ‘HIT’ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా, ‘HIT 2’ వచ్చే సరికి విశ్వక్ సేన్ స్థానంలో అడవి శేష్ హీరోగా వచ్చారు. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాకు సంబంధించి పెద్దగా డిస్కర్షన్ జరగకపోయినా, సినిమా మాత్రం బాగానే హిట్ అయ్యింది. వసూళ్లు కూడా బాగానే సాధించింది. ఈ సినిమాలో అడవి శేష్ కు జంటగా మీనాక్షి చౌదరి నటించింది. అడివి శేష్ ఇటీవలే ‘మేజర్’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. తన సినిమాలకు తనే కథలు రాసుకుంటూ సక్సెస్ అందుకుంటున్నారు.

Read Also: ప్రేమలో తమన్నా, విజయ్ - వీరి లవ్ స్టోరీ ఎప్పుడు ఎక్కడ మొదలైందో తెలుసా?

Published at : 05 Jan 2023 10:24 AM (IST) Tags: Adivi Sesh Amazon Prime Video HIT 2 Movie

సంబంధిత కథనాలు

Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?

Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?

PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి

PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి

Sasivadane Title Song : హరీష్ శంకర్ విడుదల చేసిన 'శశివదనే' పాట - కోమలితో రక్షిత్ ప్రేమంట!  

Sasivadane Title Song : హరీష్ శంకర్ విడుదల చేసిన 'శశివదనే' పాట - కోమలితో రక్షిత్ ప్రేమంట!  

HBD Brahmanandam: నవ్వుతూ, నవ్విస్తూ వుండాలి - బ్రహ్మానందానికి చిరంజీవి బర్త్‌డే సర్‌ప్రైజ్, ఇంటికెళ్లి మరి విసెష్!

HBD Brahmanandam: నవ్వుతూ, నవ్విస్తూ వుండాలి - బ్రహ్మానందానికి చిరంజీవి బర్త్‌డే సర్‌ప్రైజ్, ఇంటికెళ్లి మరి విసెష్!

Telusa Manasa First Look : నాగార్జున హిట్ సాంగ్ టైటిల్‌గా వస్తున్న 'కేరింత' ఫేమ్ పార్వతీశం కొత్త సినిమా

Telusa Manasa First Look : నాగార్జున హిట్ సాంగ్ టైటిల్‌గా వస్తున్న 'కేరింత' ఫేమ్ పార్వతీశం కొత్త సినిమా

టాప్ స్టోరీస్

Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా

Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?