Dacoit: అడివి శేష్ 'డకాయిట్' నుంచి బిగ్ అప్‌డేట్ - ఫైర్ గ్లింప్స్ రేంజ్ దాటి..
Adivi Sesh: అడివి శేష్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా థ్రిల్లర్ 'డకాయిట్'. ఇటీవలే ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ కాగా ఆకట్టుకుంటోంది. కొత్త షెడ్యూల్‌పై తాజాగా మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు.

Adivi Sesh's Dacoit Movie Update: అడివి శేష్, మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ మోస్ట్ అవెయిటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'డకాయిట్'. ఇటీవల రిలీజ్ అయిన ఫైర్ గ్లింప్స్ ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్‌తో అదిరిపోయింది. నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది.
డబ్బింగ్ టెస్ట్ కంప్లీట్
ఈ మూవీ కోసం తాజాగా హీరో అడివి శేష్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేశారు. దీనికి సంబంధించి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం మూవీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 8 (ఆదివారం) నుంచి క్రూషియల్ షూటింగ్ షెడ్యూల్‌ని టీం ప్రారంభించనుంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు.
Dubbing Test #DACOIT
— Adivi Sesh (@AdiviSesh) June 6, 2025
Back to shoot from day after tomorrow. Lots to do! 🔥 pic.twitter.com/9gW36h98r5
గ్లింప్స్ వేరే లెవల్ అంతే..
ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ జూలియట్ పాత్రలో కనిపించారు. 'హే జూలియట్.. నీకు జరిగింది మామూలు విషయం కాదు.' అంటూ అడివి శేష్ డైలాగ్‌తో ప్రారంభం కాగా.. 'అందరూ నిన్ను మోసం చేశారు. కానీ నేను నిన్ను మోసం చేయడానికి రాలేదు.' అంటూ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో అడివి శేష్ ఖైదీగా కనిపించగా.. మాస్ యాక్షన్, ఎలివేషన్ డైలాగ్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. భీమ్స్ సిసిరోలియో బీజీఎం వేరే లెవల్‌లో ఉంది.
ఇద్దరు మాజీ లవర్స్ కథే 'డకాయిట్' గ్లింప్స్‌ను బట్టి అర్థమవుతోంది. తమ జీవితాలను మార్చుకునేందుకు వరుస చోరీలకు ప్లాన్ చేయగా.. ఆ తర్వాత ఏం జరిగిందనేదే స్టోరీ. ఇద్దరు లవర్స్ బద్ధ శత్రువుల్లా ఎలా మారారు?, ఒకరినొకరు చంపుకొనేందుకు సైతం ఎందుకు వెనుకాడలేదు? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
Also Read: ఓటీటీలోకి ప్రేమలు హీరో సూపర్ హిట్ మూవీ 'జింఖానా' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
క్రిస్మస్‌కు గ్రాండ్ రిలీజ్
ఈ మూవీకి షానియల్ డియో దర్శకత్వం వహించారు. ఈయన అడివి శేష్ నటించిన 'క్షణం', 'గూఢచారి'తో పాటు పలు తెలుగు సినిమాలకు కెమెరా మ్యాన్‌గా పని చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ సంస్థలపై కింగ్ నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అడివి శేష్ (Adivi Sesh), మృణాల్ ఠాకూర్‌తో పాటు ప్రకాష్ రాజ్, జైన్ మేరీ ఖాన్, సునీల్, అతుల్ కుల్‌కర్ణి, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. శేష్‌కు ఇది తొలి హాలిడే రిలీజ్ కావడం విశేషం.
శేష్ కెరీర్‌లోనే రికార్డు
ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. ఫైర్ గ్లింప్స్‌లో బీజీఎం గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ సినిమా ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ప్రముఖ సంస్థ 'సోనీ'.. రూ.8 కోట్లకు రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అడివి శేష్ కెరీర్‌లోనే ఇది భారీ రికార్డుగా చెబుతున్నారు.





















