అన్వేషించండి

Aditi Rao Hydari: లండన్‌లో సిద్ధార్థ్ గర్ల్ ఫ్రెండ్‌కు చేదు అనుభవం, 6 గంటలు ఎయిర్‌పోర్టులోనే..

హీరోయిన్ అదితి రావు హైదరీకి యుకెలో చేదు అనుభవం ఎదురైంది. తన లగేజీ కోసం ఎయిర్ పోర్టులో గంటల తరబడి వేచి ఉన్నట్లు వెల్లడించింది. సిబ్బంది వ్యవహార శైలి కూడా అత్యంత చెత్తగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Aditi Rao Hydari Slams Heathrow Airport: విమాన సిబ్బందితో పాటు ఎయిర్ పోర్ట్ సిబ్బంది వ్యవహార శైలి అప్పుడప్పుడు ప్రయాణీకులకు చిరాకు తెప్పిస్తుంది. విమాన ప్రయాణంలో సరిగా సేవలు అందించకపోవడం, లగేజీని అనుకున్న టైమ్ లో ఇవ్వకుండా అలసత్వం ప్రదర్శించడం లాంటి విషయాలు తరచుగా చర్చనీయాంశం అవుతుంటాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరీకి ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. లండన్ కు వెళ్లిన ఆమె హీత్రో ఎయిర్‌ పోర్ట్‌ లో లగేజీ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని వెల్లడించింది. ఇదో అత్యంత చెత్త ఎయిర్ పోర్ట్ అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

ఇంతకీ అసలు ఏం జరిగింది అంటే?

తాజాగా వెకేషన్ కోసం అదితి లండన్ కు వెళ్లింది. హీత్రో ఎయిర్‌ పోర్ట్‌ లో దిగింది. అయితే, లగేజీ విషయంలో చాలా ఇబ్బందులు ఎదురైనట్లు వెల్లడించింది. తన లగేజీని తీసుకునేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సిప దుస్థితి తలెత్తిందని చెప్పుకొచ్చింది. తన సమస్యను ఎయిర్ పోర్టు అధికారులకు చెప్పినా, తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ప్రయాణించిన ఎయిర్ లైన్స్ సిబ్బందిని అడగాలంటూ ఓ సలహా పడేశారని చెప్పింది. ఇంత చెత్త ఎయిర్ పోర్టు తన జీవితంలో చూడలేదంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు తన ఇన్ స్టాలో ఓ స్టోరీని పోస్టు చేసింది. “నా లగేజీ కోసం ఎయిర్ పోర్టులో ఏకంగా ఆరు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది.  ఎయిర్ పోర్టు అధికారులకు ఈ విషయాన్ని చెప్తే, సాయం చేయకుండా సంబంధిత ఎయిర్ లైన్స్ సంస్థను సంప్రదించాలని చెప్పారు. నా లైఫ్ లో ఇంత చెత్త ఎయిర్ పోర్టును ఎప్పుడూ చూడలేదు” అని రాసుకొచ్చింది.

వరుస సినిమాలతో ఫుల్ బిజీ

ఇక రీసెంట్ గా అదితి రావు హైదరీ ‘హీరామండి’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో ఆమె బిబోజాన్ అనే పాత్ర చేసింది. ఈ సిరీస్ లో ఆమె నటన పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం రెండో సీజన్ కు రెడీ అవుతోంది. ‘ఢిల్లీ 6’ మూవీతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ‘లండన్’, ‘పారిస్’, ‘న్యూయార్క్’, ‘మర్డర్ 3’, ‘వజీర్’, ‘పద్మావత్’ లాంటి చిత్రాలు చేసింది. ప్రస్తుతం ‘లయనెస్’, ‘గాంధీ టాక్స్’ చిత్రాల్లో నటిస్తోంది. అటు హీరో సిద్దార్థ్ తో రీసెంట్ గా ఆమె ఎంగేజ్ మెంట్ చేసుకుంది. త్వరలోనే  వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

Also Read'కల్కి 2898 ఏడీ' రివ్యూ: సినిమా విజువల్ వండరే! మరి, 'బాహుబలి' బీట్ చేసే సత్తా ఉందా? ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి?

Read Also: 'కల్కి 2898 ఏడీ' హిందీ డిజిటల్ రైట్స్‌లో ట్విస్ట్ - రెండు ఓటీటీల్లో Prabhas సినిమా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

T20 World Cup 2024: టీమిండియాకు తెలుగు రాష్ట్రాల సీఎంలు శుభాకాంక్షలు - ఆటతీరు అద్భుతం: పవన్ కల్యాణ్
టీమిండియాకు తెలుగు రాష్ట్రాల సీఎంలు శుభాకాంక్షలు - ఆటతీరు అద్భుతం: పవన్ కల్యాణ్
Rohit Sharma Retirement : టీ 20లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ గుడ్‌బై- వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత ప్రకటన  
టీ 20లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ గుడ్‌బై- వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత ప్రకటన  
Andhra Special Status Politics :  జగన్‌కు ఎదురొస్తున్న ప్రత్యేకహోదా అస్త్రం -  ఎన్డీఏపై యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తారా ?
జగన్‌కు ఎదురొస్తున్న ప్రత్యేకహోదా అస్త్రం - ఎన్డీఏపై యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తారా ?
T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్‌ ప్రైజ్ మనీ వందకోట్లు- ఆడిన ప్రతీ జట్టుపై కోట్ల వర్షం
టీ 20 ప్రపంచకప్‌ ప్రైజ్ మనీ వందకోట్లు- ఆడిన ప్రతీ జట్టుపై కోట్ల వర్షం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

South Africa vs India T20 World Cup Final Weather | T20WC ఫైనల్ లో వరుణుడు అడ్డుపడితే పరిస్థితి ఏంటీRohit Sharma only Player 1St T20 World Cup and Now | చరిత్రలో ఆ ఒక్కడిగా నిలిచిన రోహిత్ శర్మ | ABPSouth Africa vs India T20 World Cup Final | ప్రపంచకప్ తుది సమరానికి భారత్, దక్షిణాఫ్రికా సిద్ధం |ABPRohit Sharma T20 World Cup 2024 Final | వరల్డ్ కప్ లో ఫైనల్ రోహిత్ రెచ్చిపోవాలంటున్న ఫ్యాన్స్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2024: టీమిండియాకు తెలుగు రాష్ట్రాల సీఎంలు శుభాకాంక్షలు - ఆటతీరు అద్భుతం: పవన్ కల్యాణ్
టీమిండియాకు తెలుగు రాష్ట్రాల సీఎంలు శుభాకాంక్షలు - ఆటతీరు అద్భుతం: పవన్ కల్యాణ్
Rohit Sharma Retirement : టీ 20లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ గుడ్‌బై- వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత ప్రకటన  
టీ 20లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ గుడ్‌బై- వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత ప్రకటన  
Andhra Special Status Politics :  జగన్‌కు ఎదురొస్తున్న ప్రత్యేకహోదా అస్త్రం -  ఎన్డీఏపై యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తారా ?
జగన్‌కు ఎదురొస్తున్న ప్రత్యేకహోదా అస్త్రం - ఎన్డీఏపై యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తారా ?
T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్‌ ప్రైజ్ మనీ వందకోట్లు- ఆడిన ప్రతీ జట్టుపై కోట్ల వర్షం
టీ 20 ప్రపంచకప్‌ ప్రైజ్ మనీ వందకోట్లు- ఆడిన ప్రతీ జట్టుపై కోట్ల వర్షం
CM Chandrababu : పెన్షన్ పంపిణీలో చంద్రబాబు సంచలనం - ఒకటో తేదీన స్వయంగా పంపిణీకి శ్రీకారం
పెన్షన్ పంపిణీలో చంద్రబాబు సంచలనం - ఒకటో తేదీన స్వయంగా పంపిణీకి శ్రీకారం
Darmapuri Srinivas: డీఎస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం - అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
డీఎస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం - అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
Viral Video: కుటుంబ కలహాలతో గోదావరిలో దూకిన మహిళ - సినిమా స్టైల్లో రక్షించిన జాలర్లు, వైరల్ వీడియో
కుటుంబ కలహాలతో గోదావరిలో దూకిన మహిళ - సినిమా స్టైల్లో రక్షించిన జాలర్లు, వైరల్ వీడియో
Tax On UPI Transactions: యూపీఐ ద్వారా డబ్బు స్వీకరిస్తున్నారా? ఈ లిమిట్‌ దాటితే ఇన్‌కమ్‌ టాక్స్‌ కట్టాలి
యూపీఐ ద్వారా డబ్బు స్వీకరిస్తున్నారా? ఈ లిమిట్‌ దాటితే ఇన్‌కమ్‌ టాక్స్‌ కట్టాలి
Embed widget