Priyanka Mohan: 'సువ్వి సువ్వి'తో ప్రియాంక రోల్ ఏమిటో తెలిసిందిగా... 'ఓజీ'లో పవన్ గ్యాంగ్‌స్టర్ అయితే హీరోయిన్?
Priyanka Mohan Role In OG: 'ఓజీ' సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ రోల్ చేస్తున్నారు. మరి హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్? 'సువ్వి సువ్వి'తో ఆవిడ రోల్ ఏమిటనేది రివీల్ అయ్యింది.

Pawan Kalyan Role In They Call Him OG: 'పదేళ్ళ క్రితం బాంబేలో వచ్చిన తూఫాన్ గుర్తుందా? అది మట్టి, చెట్లతో పాటు సగం ఊరిని ఊడ్చేసింది. కానీ, వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తూఫాన్ కడగలేకపోయింది' - 'ఓజీ' గ్లింప్స్‌లో డైలాగ్ ఇది. ఈ ఒక్కటీ చాలు... సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రోల్ ఏమిటి? ఆయన ఎటువంటి క్యారెక్టర్ చేస్తున్నారు? అనేది చెప్పడానికి. 'ఓజీ'లో పవన్ గ్యాంగ్‌స్టర్. మరి, ఆయనకు జంటగా నటిస్తున్న హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ రోల్ ఏమిటి? ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? రెండో పాట 'సువ్వి సువ్వి...' చూస్తే అర్థం అవుతుంది.
డాక్టర్ కన్మణిగా ప్రియాంక మోహన్!
Priyanka Mohan Role In OG Movie: అవును... 'ఓజీ'లో డాక్టర్ పాత్రలో హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నారు. ఇటీవల ఆవిడ ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర బృందం. అప్పుడు కన్మణి పాత్రలో ప్రియాంక మోహన్ నటిస్తున్నట్టు తెలిపింది.
OG Second Song Video: 'ఓజీ' సినిమాలో రెండో పాట 'సువ్వి సువ్వి...'ని వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు. అందులో పవన్, ప్రియాంక మధ్య బాండింగ్ చూపించే విజువల్స్ ఉన్నాయి. వాటిని గమనిస్తే... ప్రియాంక మోహన్ మెడలో స్టెతస్కోప్ ఉంటుంది. ఆవిడ చేతిలో వైట్ కోట్ ఉంటుంది. సో... ఆవిడ డాక్టర్ రోల్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. గ్యాంగ్‌స్టర్ & డాక్టర్ మధ్య ప్రేమ ఎలా పుట్టింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Also Read: సుందరకాండ రివ్యూ: పెళ్లి కాని యూత్ రిలేటయ్యే సీన్స్, మరి పాయింట్? నారా రోహిత్ సినిమా ఎలా ఉందంటే?

సెప్టెంబర్ 25న పాన్ ఇండియా రిలీజ్!
OG Movie Release Date: పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటిస్తున్న 'ఓజీ' సినిమాకు సుజీత్ దర్శకుడు. 'సాహో' తర్వాత ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకం మీద డీవీవీ దానయ్య, ఆయన కుమారుడు కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో భారీ ఎత్తున పాన్ ఇండియా రిలీజ్ కానుందీ సినిమా. అమెరికాలో సెప్టెంబర్ 24న ప్రీమియర్ షోలు వేయనున్నారు.
Also Read: మొఘల్ vs హోయసాల... 'ద్రౌపతి 2'లో వీరసింహ కడవరాయులుగా రిచర్డ్ రిషి... ఫస్ట్ లుక్ చూశారా?





















