Poonam Kaur : 'ఉస్తాద్ భగత్ సింగ్' బ్లేజ్ పై పూనమ్ కౌర్ కామెంట్స్ - పవన్‌ను పక్కన పెట్టి అతనిపై పొగడ్తలు!
Poonam Kaur : 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా నుంచి 'భగత్స్ బ్లేజ్' పేరుతో రిలీజ్ అయిన తాజా వీడియోపై వివాదాస్పద నటి పూనమ్ కౌర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
Poonam Kaur Comments On Ustaad BhagathSingh Video: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా నుంచి మంగళవారం 'భగత్స్ బ్లేజ్' పేరుతో ఓ వీడియోని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ఈ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేసింది. హరీష్ శంకర్ ఈసారి పవన్ కళ్యాణ్‌కు 'గబ్బర్ సింగ్'కు మించి బ్లాక్ బస్టర్ అందించడం గ్యారెంటీ అంటూ ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' వీడియోపై వివాదాస్పద నటి పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేసింది.
'భగత్స్ బ్లేజ్' వీడియో పై పూనమ్ కౌర్ కామెంట్స్
ప్రస్తుతం వివాదాలతోనే సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్న నటి పూనమ్ కౌర్ ఈ మధ్య ఎక్కువగా త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేస్తోంది. అయితే ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుండి రిలీజ్ అయిన లేటెస్ట్ వీడియోపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకురాకుండా దేవిశ్రీప్రసాద్ ని ఉద్దేశిస్తూ ట్వీట్స్ చేసింది. " గుడ్ వన్ రాక్ స్టార్.. నువ్వు లేకుండా ఒక కమర్షియల్ సినిమా అనేది అసంపూర్ణం. మరోసారి నీ మ్యూజిక్ తో రాక్ చెయ్" అంటూ తాజాగా విడుదలైన వీడియోలో మ్యూజిక్ బాగుందంటూ దేవి శ్రీ ప్రసాద్ ని పొగిడింది. దీంతో పూనమ్ కౌర్ చేసిన ఈ ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Good one rockstar @ThisIsDSP 🔥- a commercial film is absolutely incomplete without you - rock it again 😎
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) March 19, 2024
పొలిటికల్ హీట్ పెంచేలా 'భగత్స్ బ్లేజ్'
'భగత్ బ్లేజ్' పేరుతో రిలీజ్ అయిన వీడియోలో పవన్ కళ్యాణ్ అని చెప్పిన డైలాగ్స్ పొలిటికల్ హీట్ పెంచే విధంగా ఉన్నాయి. వీడియోలో విలన్ పవన్ కళ్యాణ్ ని ని రేంజ్ ఇది అని అనగా.." గ్లాస్ పగిలేకొద్ది పదునెక్కుతుంది" అని పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చెప్పినట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు వీడియో చివర్లో.." ఖచ్చితంగా గుర్తు పెట్టుకో గ్లాస్ అంటే సైజ్ కాదు, సైన్యం" అన్ని పవన్ చెప్పిన డైలాగ్ అయితే జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ కావడంతో జనసేన అనేది ఒక సైన్యం అని అర్థం వచ్చేలా పవన్ డైలాగ్స్ ఉన్నాయి. దీంతో ఈ డైలాగ్స్ అన్నీ పరోక్షంగా తన ప్రత్యర్థులకు పవన్ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉన్నాయంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రిలీజ్ పై నో క్లారిటీ
'గబ్బర్ సింగ్' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్' పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. మరోసారి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే కొన్ని షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఏపీ ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని పవన్ షూటింగ్స్ ని పక్కన పెట్టి రాజకీయాలతో బిజీ అయిపోయారు. ఎలక్షన్స్ పూర్తయిన తర్వాతే మళ్లీ షూటింగ్స్ లో జాయిన్ అవుతారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. దీంతో రిలీజ్ పై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు.
Also Read : కంగువ టీజర్ - సూర్య, బాబీ డియోల్‌లా హోరాహోరీ పోరు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న సిజిల్