అన్వేషించండి

Suriya Kanguva Teaser: కంగువ టీజర్‌ - సూర్య, బాబీ డియోల్‌లా హోరాహోరీ పోరు.. గూస్‌ బంప్స్ తెప్పిస్తున్న సిజిల్‌

Kanguva Teaser: తమిళ స్టార్‌ హీరో సూర్య లేటెస్ట్‌ మూవీ 'కంగువ'టీజర్‌ను విడుదల చేసింది మూవీ టీం. తాజాగా విడులైన ఈ సిజిల్‌ టీజర్‌ గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉంది. ఇందులో సూర్య లుక్‌ బాగా ఆకట్టుకుంటుంది.

Kanguva Sizzle Teaser Out: కోలీవుడ్ స్టార్‌ హీరో సూర్య 'కంగువ' మూవీ టీజర్ మంగళవారం విడుదలైంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సూర్య ప్రకటించాడు. అంతేకాదు డబ్బింగ్‌ వర్క్‌  కూడా మొదలుపెట్టినట్టు అప్‌డేట్‌ ఇచ్చి ఫ్యాన్స్‌ని ఖుషి చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కంగువ నుంచి రిలీజ్‌ అయిన సూర్య ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ మూవీ రిలీజ్‌పై ఇంకా క్లారిటీ లేదు. కానీ అప్పుడప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూ మూవీపై క్యూరియాసిటీ పెంచతుంది కంగువ టీం.

టీజర్ ఎలా ఉందంటే..

కంగువ సిజిల్‌ అప్‌డేట్‌ అంటూ వదిలిన ఈ టీజర్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. ఇందులో సూర్య సరికొత్త లుక్‌లో కనిపించాడు. టీజర్‌ మొత్తం యాక్షన్‌ సీన్స్‌తో నిండిపోయింది. ఇందులో సూర్య సిజిల్‌ లుక్‌ మూవీపై అంచనాలు పెంచెస్తోంది. ఇక విలన్‌ బాబీ డియోల్‌ ఇంటన్స్‌ లుక్‌లో కనిపించారు. ఇద్దరి మధ్య హోరాహోరా పోరును ఈ సిజిల్‌లో చూపించి మూవీ బజ్‌ క్రియేట్‌ చేశారు. భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో వచ్చిన ఈ టీజర్‌ ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉంది. చివర్లో ‘బాహుబలి 2’ తరహాలో ఎలిమినేషన్ ఇచ్చారు. మొత్తానికి టీజర్‌ మూవీ భారీ అంచనాలు పెంచేస్తుంది. అయితే, ఈ మూవీ స్టోరీ బయటకు రివీల్ కాకుండా జాగ్రత్తపడ్డారు. మొత్తం పోరాట సన్నివేశాలనే హైలెట్ చేశారు.

Also Read: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన చిరంజీవి మూవీ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ - ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

కాగా ప్రముఖ నిర్మాణసంస్థలు యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో కేఈ జ్ఞానవేల్ రాజా భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు టాలీవుడ్‌ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో పాన్ వరల్డ్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. వరల్డ్‌ వైడ్‌గా పది భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో సూర్య ఐదు విభిన్న పాత్రల్లో అలరించబోతున్నాడు. తమిళ హీరో అయినా తెలుగు రాష్ట్రాల్లోనూ సూర్యకు విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఇక్కడ ఆయనకు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. గజిని, 24.. లాంటి ఎన్నో విభిన్న కథాంశాలతో సూర్య ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ‘కంగువ’ చిత్రం ఇంగ్లీష్‌లో కూడా విడుదల కానుంది. ఈ సినిమాతో సూర్య పాన్‌ వరల్డ్‌ హీరో కాబోతున్నాడు. 'కంగువ' అంటే అగ్ని శక్తి ఉన్న మనిషి.. అంటే సాటిలేని పరాక్రమవంతుడు అని అర్థం. 14వ శతాబ్దం నేపథ్యంలో కంగువా అనే యుద్ధవీరుడి కల్పిత కథను రెండు భాగాలుగా ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam: వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2: 'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అగ్నిపమాదంలో  ప్రాణాలు తీసిన తలుపులుపోసానికి తీవ్ర అస్వస్దత   ఇలా అయిపోయాడేంటి..?మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్-  అయినా సంతకం పెట్టను..Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam: వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2: 'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
Anganwadi notification: మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్, 14 వేల ఖాళీల భర్తీకి 'ఉమెన్స్ డే' రోజు నోటిఫికేషన్‌
మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్, 14 వేల ఖాళీల భర్తీకి 'ఉమెన్స్ డే' రోజు నోటిఫికేషన్‌
SA Vs Eng Result Update: సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
Embed widget