Actress Jayalalitha: అందుకే బి-గ్రేడ్ మూవీస్‌లో నటించాల్సి వచ్చింది - జయలలిత షాకింగ్ కామెంట్స్!
Jayalalitha: సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలిత తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.. అందులో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం
Actress Jayalalitha: సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలిత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు బోరింగ్ పాపగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జయలలిత ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. తన జీవితంలో కష్టసుఖాల గురించి తన కోయాక్టర్స్ గురించి చెప్పుకొచ్చింది.
మీ కుటుంబ ఆచార వ్యవహారాలకి, ఈ సినిమా ఫీల్డ్‌కు అసలు సంబంధమే లేదు కదా అని హోస్ట్ అడిగిన ప్రశ్నకి జయలలిత ఇలా సమాధానం చెబుతూ.. ‘‘నాన్నగారు జర్నలిజం ఫీల్డ్‌లో ఉన్నప్పుడు సినీ ఫీల్డ్ లో అందరూ ఫ్రెండ్సే. నేను కొంచెం తెల్లగా పర్సనాలిటీ బాగుండటంతో నన్ను డాన్సర్ నైనా యాక్టర్ నైనా చేయాలని మైండ్ లో గట్టిగా ఫిక్స్ అయిపోయారు’’ అని తెలిపారు.
‘‘మాది చాలా మధ్యతరగతి కుటుంబం తల్లిదండ్రులు ఎలా చెప్తే అలాగే వినేవాళ్ళం. వాళ్ళు మాకు కోరిన బట్ట నచ్చిన తిండి ఇచ్చేవాళ్ళు. అంతే తప్పితే పెద్ద చదువులు కూడా చదివింది లేదు. మేము అందరమూ తెలుగు మీడియంలో డిగ్రీలు పూర్తి చేశాం. కానీ మా పెద్ద అక్క టెన్త్ ఫెయిల్ అయింది. కానీ భవనం వెంకట్రామిరెడ్డి మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆమెకి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం వేయించారు నాన్న. ఎందుకంటే నాన్న భవనం వెంకటరామిరెడ్డి గారు ఇద్దరూ ఫ్రెండ్స్’’ అని తెలిపారు.
మొదటి అవకాశం అలా వచ్చింది
‘‘ఆంధ్ర నాట్యం నేర్చుకోవడం కోసం హైదరాబాద్ వచ్చి నటరాజ్ రామకృష్ణ గారి దగ్గర నాట్యం నేర్చుకోవడం ప్రారంభించాను అప్పుడే నాన్న వచ్చి నా ఫ్రెండ్స్ సినిమా తీస్తున్నారు. అందులో డాన్సర్ క్యారెక్టర్ ఉంది పద అనటంతో షాక్ అయ్యాను. నాకు డాన్స్ నేర్చుకోవడం ఇష్టం సినిమా చేయను అనటంతో ఒక సినిమా చెయ్యు నచ్చకపోతే వెనక్కి వచ్చేద్దువు గాని రామకృష్ణ గారు నన్ను ఒప్పించారు’’ అని పేర్కొన్నారు.
‘‘ఆ సినిమా పేరు ‘ఈ పోరాటం మార్పు కోసం’. ఈ సినిమా సాంగ్ చెన్నై విజయ గార్డెన్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు ‘ఖైదీ’ ప్రొడ్యూసర్స్ అక్కడ నన్ను చూసి నాన్నగారితో అమ్మాయి బాగుంది ‘ఖైదీ’ సినిమాలో క్యారెక్టర్ ఉంది మీరు వెంటనే చెన్నై షిఫ్ట్ అయిపోండి అనటంతో ముందు వెనుక ఆలోచించకుండా ఎవరితోనూ సంప్రదించకుండా చెన్నై షిఫ్ట్ చేసేశారు’’ అని తెలిపారు.
‘ఖైదీ’లో పాత్ర రాలేదు
‘‘చెన్నై వెళ్లిన తర్వాత ‘ఖైదీ’లో పాత్ర మాత్రం రాలేదు. కానీ మలయాళంలో మాత్రం బాగా ఎస్టాబ్లిష్ అయ్యాను. మొదటి సినిమాతోనే బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకున్నాను. ఆ తర్వాత తెలుగులో ‘ఇంద్రుడు చంద్రుడు’ సినిమా కోసం కమల్ హాసన్ నన్ను రికమెండ్ చేశారు. ఈ అమ్మాయి నాతో మలయాళంలో నటించింది అని చెప్పటంతో తెలుగులో నా ప్రస్థానం ప్రారంభమైంది’’ అని తెలిపారు.
బి-గ్రేడ్ మూవీస్ కూడా చేశాను
‘‘నాకు గైడ్ చేసేవారు కానీ ఇది మంచి ఇది చెడు అని చెప్పేవారు కానీ ఎవరూ లేరు. వచ్చిన క్యారెక్టర్ ప్రతిదీ చేసుకుంటూ వెళ్లాను. కొన్ని బి గ్రేడ్ మూవీస్ కూడా చేశాను’’ అని చెప్పింది జయలలిత. బి గ్రేడ్ మూవీస్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు ‘‘నన్ను నమ్ముకొని కుటుంబం చెన్నై వచ్చేసింది. వాళ్ళని ఎలాగైనా పోషించాలి అనే ఒక తపన తప్ప నాకు మరి ఏ ఆలోచన లేదు’’ అని తెలిపారు.
‘‘మీరు బాబాకి భక్తులు కదా అని హోస్ట్ అడగగా.. నాకు బాబా గారిని మహాతల్లి రమాప్రభ పరిచయం చేశారు. నేను చిట్టి బాబు బావ, మరొకరు కలిసి నల్ల బాబా గుడిని స్థాపించాము అని చెప్పారు జయలలిత. మీకు అందరూ బావలేనా అని హోస్ట్ ప్రశ్నించగా.. అవును నాగబాబు, రాళ్లపల్లి, చిట్టిబాబు అందరూ బావలే నేను మహా జనానికి మరదలు పిల్లని అని సరదాగా నవ్వుతూ చెప్పారు జయలలిత.
శోభన్ బాబుతో తనకున్న పరిచయాన్ని గురించి కూడా చెప్పుకొచ్చింది. ఆయనతో అనుబంధం చాలా బాగుండేదని ఇద్దరం మెసేజ్లు చేసుకునే వాళ్ళమని ఆయనని మీ ఇంటికి వచ్చాను అంటూ సరదాగా ఆటపట్టించేదాన్ని చెప్పుకొచ్చారు జయలలిత.
Also Read: బెల్లంకొండ సినిమాకు పవన్ కళ్యాణ్ టైటిల్, అభిమానం చూపించిన దర్శకుడు?