అన్వేషించండి

Actress Hema: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు ఊరట - బెయిల్ మంజూరు చేసిన స్పెషల్ కోర్టు

Bengaluru Rave Party Case: బెంగుళూరు రేవ్ పార్టీలో తాను కూడా పాల్గొంది అనే ఆరోపణలతో జైలుకు వెళ్లిన హేమకు ఊరట లభించింది. తాజాగా బెంగుళూరు స్పెషల్ కోర్టు తనకు బెయిల్ మంజూరు చేసింది.

Bengaluru Rave Party Case: బెంగుళూరు రేవ్ పార్టీ విషయం కొన్నిరోజుల పాటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అందులో టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా పాల్గొన్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెపై కేసు కూడా నమోదు అయ్యింది. తాజాగా ఆ కేసులో హేమకు భారీగా ఊరట లభించింది. ప్రస్తుతం ఆమె.. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా పరప్ప అగ్రహార జైలులో ఉన్నారు. ఇక జూన్ 12న హేమకు బెయిల్ మంజూరు అయినట్టు తెలుస్తోంది. బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు హేమకు బెయిల్ ఇచ్చింది. కానీ దాంతో పాటు పలు షరతులు కూడా పెట్టింది.

వాదనలు విన్న తర్వాత..

బెంగుళూరు రేవ్ పార్టీలో కేసుపై ఇటీవల బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టులో వాదనలు వినిపించాయి. హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్ లభించలేదని, చాలారోజుల తర్వాత పోలీసులు ఆమె బ్లడ్‌లో డ్రగ్స్ కంటెంట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరపున న్యాయవాది మహేశ్ కిరణ్ శెట్టి వాదించారు. ఆయన వాదనలు విన్న తర్వాత కోర్టు.. హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని ఆదేశించింది. దీంతో బెయిల్‌పై బయటికొచ్చిన హేమ.. ఈ కేసుపై ఏమైనా స్పందిస్తారేమో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పోలీసులు తనను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో కూడా తాను ఏ తప్పు చేయలేదనే చెప్తూ ఉన్నారు హేమ.

ఎక్కడికి వెళ్లలేదు..

బెంగళూరులో రేవ్ పార్టీ జరుగుతుందని, అక్కడ కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారనే వార్త ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. ఇక అక్కడ ఉన్న టాలీవుడ్ సెలబ్రిటీలలో హేమ కూడా ఒకరని వార్త వైరల్ అయ్యింది. దీంతో ఈ విషయం వైరల్ అయిన కొన్ని గంటల్లోనే దీనిపై స్పందించారు హేమ. తాను ఎక్కడికి వెళ్లలేదని, ఏ రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదని, హైదరాబాద్ ఫార్మ్ హౌజ్‌లో ఉన్నానని వీడియోను విడుదల చేశారు. కానీ ఆ వీడియో కూడా బెంగుళూరులో ఉండే రికార్డ్ చేశారని, తాను కూడా రేవ్ పార్టీలో పాల్గొన్నట్టుగా ఆధారాలు ఉన్నాయని తనపై ఆరోపణలు వినిపించాయి. దీంతో హేమకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

కెరీర్‌పై ఎఫెక్ట్..

వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత హేమ డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలిందని వార్తలు వచ్చాయి. దీంతో పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారు. హేమను విచారణకు తీసుకెళ్తున్న సమయంలో కూడా తనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. అప్పుడు కూడా తాను బెంగుళూరులో పార్టీకి వెళ్లానని, కానీ పార్టీ అవ్వకముందే అక్కడి నుంచి వచ్చేశానని అన్నారు. పైగా తనకు అసలు ఏ వైద్య పరీక్షలు చేయలేదని ఆరోపించారు. అయినా కూడా పోలీసులు తనను కస్టడీలోకి తీసుకున్నారు. బెంగుళూరు రేవ్ పార్టీ రచ్చ హేమ కెరీర్‌పై కూడా ఎఫెక్ట్ చూపించింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో నుంచి హేమను తొలగిస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు.

Also Read: శివాజీకి వాళ్లు వార్నింగ్ ఇచ్చారా? ఎన్నికల ఫలితాలకు ముందే వైసీపీ ఓటమిపై వ్యాఖ్యలు, అవే నిజమయ్యాయిగా!

టాప్ హెడ్ లైన్స్

Samantha Son : మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత - బాబు క్యూట్ నేమ్ ఏంటో తెలుసా?
మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత - బాబు క్యూట్ నేమ్ ఏంటో తెలుసా?
Crime Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - మర్డర్ మిస్టరీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - మర్డర్ మిస్టరీ ఎందులో చూడొచ్చంటే?
OM Movie OTT : ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ ఎంటర్టైనర్ O.M - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ ఎంటర్టైనర్ O.M - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
O.M Public Review : ధనుష్ 'ఓం' ట్విట్టర్ రివ్యూ : యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉంది?... పబ్లిక్ టాక్ ఏంటంటే?
ధనుష్ 'ఓం' ట్విట్టర్ రివ్యూ : యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉంది?... పబ్లిక్ టాక్ ఏంటంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
Embed widget