Faria Abdullah : యంగ్ కొరియోగ్రాఫర్‌తో లవ్ - హీరోయిన్ ఫరియా అబ్దుల్లా రియాక్షన్
Faria Abdullah Lover : తన బాయ్ ఫ్రెండ్ గురించి ఓపెన్ అయ్యారు యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. తాను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే అంటూ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.

Actress Faria Abdullah About Her Boy Friend : 'జాతిరత్నాలు' మూవీలో చిట్టిగా తన అద్భుత నటనతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. ఆ తర్వాత పలు మూవీస్‌లో నటించినా అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. రీసెంట్‌గా గుర్రం పాపిరెడ్డి, అనగనగా ఒక రాజు మూవీల్లో మెరిశారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన బాయ్ ఫ్రెండ్, డేటింగ్, రిలేషన్ షిప్, పర్సనల్ లైఫ్‌పై ఓపెన్ అయ్యారు.
'నా బాయ్ ఫ్రెండ్ హిందూ'...
ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్నానని తెలిపిన ఫరియా... తన బాయ్ ఫ్రెండ్ హిందూ కుటుంబానికి చెందిన యువకుడని తెలిపారు. 'అతను సినీ రంగానికి చెందిన యువకుడే. కొరియోగ్రఫీలో తన టాలెెంట్‌తో ముందుకెళ్తున్నాడు. మేమిద్దరం కలిసి వర్క్ చేస్తూ ఓ టీంగా వెళ్తున్నాం. కొంతకాలంగా నాలో డ్యాన్స్, ర్యాప్‌లో మార్పులకు నా బాయ్ ఫ్రెండే కారణం.
మా మధ్య ఉండే బంధం లవ్ ఎఫైర్ మాత్రమే కాదు. లైఫ్ పార్ట్నర్‌కు సంబంధించిన ఓ బలమైన అనుబంధం. అతను నా బాల్య స్నేహితుడు కాదు. ఇండస్ట్రీలో ఉంటూనే తన పర్సనల్ లైఫ్, వర్కింగ్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం వెనుక నా ప్రియుడి ప్రోత్సాహం ఎంతో ఉంది.' అంటూ చెప్పారు. అయితే, అతను ఎవరు అనే వివరాలు ఏవీ వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతుండగా... ఆమె లవర్ ఎవరై ఉంటారా? అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆమె వర్క్ చేసిన సినిమాలకు సంబంధించి కొరియోగ్రాఫర్ ఎవరైనా అయి ఉంటారా? థియేటర్ నటుడా? అంటూ ఆరా తీస్తున్నారు.
Also Read : రెమ్యునరేషన్ పెంచేసిన 'జాతిరత్నం'? - నవీన్ పోలిశెట్టి ఆ కండిషన్లలో నిజమెంత?
'జాతిరత్నాలు' మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫరియా... ఆ తర్వాత కొన్ని మూవీస్‌లో అతిథి పాత్రలతో పాటు స్పెషల్ సాంగ్స్ సైతం చేశారు. లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటీ అడక్కు, మత్తు వదలరా, గుర్రం పాపిరెడ్డి మూవీస్‌తో అలరించారు. ప్రస్తుతం 'వల్లి మెయిల్' అనే తమిళ మూవీ చేస్తున్నారు.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
ట్రెండింగ్ వార్తలు























