అన్వేషించండి

JD Chakravarthi: లైలా చేసిన పనికి చనిపోయేవాళ్లం - అందుకే ఆమెను కొట్టా: జేడీ చక్రవర్తి

ఒకప్పటి టాలీవుడ్ హీరో జేడీ చక్రవర్తి తాను నటించిన 'దయ' వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో హీరోయిన్ లైలా గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశారు.

టాలీవుడ్ ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి తాజాగా 'దయ' అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్తోనే జేడీ చక్రవర్తి ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సస్పెన్స్ అండ్ ట్విస్టులు ఎంతో ఆసక్తికరంగా ఉండడం.. దానికి తోడు జేడీ చక్రవర్తి తన పర్ఫామెన్స్ తో అదరగొట్టేశారు. ఈ వెబ్ సిరీస్ తో మళ్లీ చాలాకాలం తర్వాత జె.డి చక్రవర్తి నటనను ప్రేక్షకులతో పాటు విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా పలు మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు జెడి చక్రవర్తి. ఈ క్రమంలోనే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఒకప్పటి హీరోయిన్ లైలా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

ఈ మేరకు జె.డి చక్రవర్తి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.."నేను నటించిన హీరోయిన్స్ అందరిలో లైలా చాలా ధైర్యవంతురాలని చెబుతూ షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనని వివరించారు. ఓ ట్రైన్స్ సీన్ ని షూట్ చేస్తున్నాం. నేను ట్రాక్ పక్కన అలా నిలబడి ఉంటాను. లైలా పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వస్తుంది. ఇక ఆ సీన్ లో ట్రైన్ ఎక్కడో 100 ఫీట్ల దూరంలో ఉండగానే ఈ షాట్ చేసేసి మేమిద్దరం పక్కకు వచ్చేయాలి. ఇక షాట్ చేసేసి నేను పక్కకి వచ్చేశాను. లైలా పక్కకు రాబోయింది. కానీ ఆ టైంలో ఆమె లంగా వొనీ వేసుకోవడంతో అవి ట్రాక్ లో ఇరుక్కుపోయాయి. ట్రైన్ వచ్చేస్తుంది. లైలా కదలడం లేదు. నిజానికి లైలా చాలా సరదా మనిషి. ఎప్పుడూ ఆటపట్టిస్తూ ఉంటుంది. తనొక ప్రాంక్ స్టార్. 50 ఫీట్ దూరంలో ఉన్న ట్రైన్ వస్తుంటే ఆ అమ్మాయి మెంటల్ గా బ్లాక్ అయిపోయింది. ట్రాక్లో ఇరుక్కున్న లంగా వోని చింపుకొని వస్తే సరిపోద్ది. కానీ లైలా రావట్లేదు. ఇక ఆ టైంలో నాకు ఏమీ అర్థం కాలేదు. ఆ ఉద్రేకంలో ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్లి పట్టుకొని దూకి లాగాను. ఆ తర్వాత ఓ 20 నిమిషాలు లైలా కాకుండా నేను భయపడిపోయాను. తను బ్లాంక్ గా ఉంది. అప్పుడు లైలా నీ చెంప మీద కొట్టాల్సి వచ్చింది. చెంప మీద కొట్టిన కూడా తను అదే షాక్ లో ఉండిపోయింది. బయటికి రావట్లేదు. ఆ సమయంలో ట్రైన్ ఇంచు గ్యాప్ లో వెళ్ళినప్పుడు ఆ వైబ్రేషన్ కి చాలా భయమేసింది. అప్పుడు లైలా కంటే కూడా నేను ఎక్కువగా భయపడిపోయా" అని చెప్పుకొచ్చారు జేడీ చక్రవర్తి.

దీంతో జేడీ చక్రవర్తి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఇక 'దయ' వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. 'యూ టర్న్', 'కుడి ఎడమైతే', 'సేనాపతి' వంటి డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ని తెరకెక్కించిన పవన్ సాదినేని ఈ వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేశారు. ఇందులో జెడి చక్రవర్తి తో పాటు ఈషా రెబ్బ, జోష్ రవి, విష్ణు ప్రియ, కమల్ కామరాజు, రమ్య నంబిసన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు కలిగిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read : ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ రీ రిలీజ్‌కు రికార్డ్ కలెక్షన్స్ - 15 ఏళ్ళయినా అదే క్రేజ్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Embed widget