అన్వేషించండి
Acharya Trailer Release date: 'ఆచార్య' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే?
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ నటించిన 'ఆచార్య' ట్రైలర్ విడుదల తేదీ ఖరారు అయ్యింది.

చిరంజీవి, రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం 'ఆచార్య' (Acharya Movie). కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 12న విడుదల (Chiranjeevi's Acharya Trailer On April 12th) చేయనున్నట్టు నేడు వెల్లడించారు. ఈ నెల 29న సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.
'నీలాంబరి...', 'లాహే లాహే లాహే...', 'సానా కష్టం...' పాటలు విడుదల అయ్యాయి. మణిశర్మ బాణీలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. చిరంజీవి టీజర్ కూడా ఆకట్టుకుంది. దేవాదాయ శాఖలో అవినీతి, ఆలయాల రక్షణ, నక్సలిజం మేళవించి కొరటాల శివ సినిమా తెరకెక్కించారని సమాచారం.
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించిన 'ఆచార్య' సినిమాకు మణిశర్మ సంగీత దర్శకుడు. ఈ సినిమాకు తిరుణ్ణావుక్కరుసు సినిమాటోగ్రాఫర్.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా
ఆంధ్రప్రదేశ్





















