Bhola Shankar: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మెగాస్టార్ కొత్త లుక్ రెడీ..
రేపు మొదలుకానున్న 'భోళాశంకర్' కోసం కూడా ప్రీలుక్ రెడీ అయినట్లు తెలుస్తోంది. చిరు తన కొత్త లుక్ తో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వనున్నారు.
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు ఒప్పుకుంటున్నారు. ఒక సినిమాను పూర్తి చేసిన వెంటనే మరో సినిమా సెట్స్ పైకి వెళ్లిపోతున్నారు. 'ఆచార్య' సినిమాను పూర్తి చేసిన చిరు ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్'సినిమాలో నటిస్తున్నారు. కేవలం ఒక సినిమా తర్వాత మరొకటి అని కాకుండా.. సినిమా లాంఛింగ్ సమయంలో ప్రీలుక్ విడుదల చేస్తున్నారు. అలా తన కొత్త సినిమాలో గెటప్ ఎలా వుండబోతుందనే విషయంపై ఆడియన్స్ కు క్లారిటీ ఇస్తున్నారు చిరు. రేపు మొదలుకానున్న 'భోళాశంకర్' కోసం కూడా ప్రీలుక్ రెడీ అయినట్లు తెలుస్తోంది.
Also Read: షన్నుని ఆడుకున్న సిరి.. రవికి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్..
రేపు ఉదయం 7 గంటల 45 నిమిషాలకు ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సినిమా కోసం రెండు రోజుల క్రితమే లుక్ టెస్ట్ ను పూర్తి చేశారు చిరంజీవి. ఓ స్పెషల్ లుక్ లో చిరంజీవిపై ఫోటోషూట్ ను నిర్వహించారు. ఆ స్టిల్ ను రేపు విడుదల చేయబోతున్నారు. తన ప్రతి సినిమా విషయంలో చిరు ఈ పద్దతిని ఫాలో అవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై దర్శకుడు బాబీతో చేయాల్సిన సినిమా కోసం మాస్ లుక్ లోకి మారారు చిరు.
ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో చేయబోతున్న 'భోళాశంకర్' కోసం కూడా ప్రీలుక్ ఫోటోషూట్ నిర్వహించారు. పూజాకార్యక్రమాలతో పాటు ఆ లుక్ ను రేపు విడుదల చేయబోతున్నారు. కొన్నిరోజుల క్రితం 'భోళాశంకర్' సినిమా నుంచి ఓ పోస్టర్ వచ్చింది. అందులో చిరు తన చెల్లెలి పాత్ర పోషిస్తున్న కీర్తి సురేష్ తో కలిసి కనిపించారు. అయితే అందులో చిరు లుక్ కి, 'భోళాశంకర్' సినిమాలో ఆయన లుక్ కి సంబంధం లేదని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటించనుంది. రీసెంట్ గానే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే తమన్నా ఈ సినిమా సెట్స్ పై జాయిన్ కానుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: 'నందమూరి నాయక.. ఏం ఎనర్జీ నాయక'..
Also Read: 'ఆర్ఆర్ఆర్' ఊరనాటు సాంగ్ వచ్చేసింది.. ఫ్యాన్స్ రచ్చ మాములుగా ఉండదేమో..
Also Read:'ఊరనాటు' సాంగ్ పై సెలబ్రిటీల రియాక్షన్.. 'మెంటల్' అంటూ సమంత కామెంట్..
Also Read: అల్లు అర్జున్ కి షాక్.. లీగల్ నోటీసులు పంపించిన సజ్జనార్..
Also Read: రంగమ్మత్తను మించి ద్రాక్షాయణి.. వామ్మో అందమైన అనసూయ ఇలా అయిపోయిందే...
Also Read: పెళ్లైందని మర్చిపోయారా… ఆమెతో రొమాన్స్ ఏంటి..
Also Read: సీక్రెట్ రూమ్ లో జెస్సీ.. రవికి వార్నింగ్ ఇచ్చిన షణ్ముఖ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి