KRR WORKS YouTube : మొన్న రాజమౌళి, ఇప్పుడు చిరంజీవి - రాఘవేంద్రుడి కోసం...
దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు కోసం ఇప్పుడు చిరంజీవి వచ్చారు. మరోసారి ఆయన యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేశారు.
చిత్రసీమలో కొత్త వారికి అవకాశాలు ఇవ్వడమే లక్ష్యంగా లెజండరీ ఫిల్మ్ మేకర్, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు (K Raghavendra Rao) యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం ఆ ఛానల్ లోగోను దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli) లాంచ్ చేశారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ని లైనులోకి తీసుకు వచ్చారు.
కేఆర్కే ఛానల్...
లాంచ్ చేసిన మెగాస్టార్!
కేఆర్కే పేరుతో రాఘవేంద్ర రావు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. చిరు చేతుల మీదుగా ఆ ఛానల్ లాంచ్ అయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో రాఘవేంద్రుడు తెలియజేశారు.
Also Read : ప్రేమికుల రోజున స్టార్ హీరోయిన్లు ఎక్కడ ఉన్నారు? ఎవరితో ఉన్నారంటే?
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రాఘవేంద్ర రావు ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులను పరిచయం చేశారు. ఇక్కడి నుంచి కొంత మందిని హిందీకి కూడా తీసుకు వెళ్ళారు. ఇప్పుడీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్తవాళ్ళను వినోద పరిశ్రమకు పరిచయం చేయాలని సంకల్పించారు.
View this post on Instagram
ఇంటర్నెట్ వాడకం పెరిగాక, సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబ్ ద్వారా కొంత మంది నటీనటులు వెలుగులోకి వస్తున్నాయి. తమ తమ టాలెంట్స్ ప్రూవ్ చేసుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీకి రావాలనే ఆశ ఉండి, తమ టాలెంట్ నిరూపించుకోవడానికి ఎదురు చూసే యువత కోసం రాఘవేంద్ర రావు 'కేఆర్ఆర్ వర్క్స్' పేరిట ఓ కొత్త యూట్యూబ్ ఛానెల్ ను ఏర్పాటు చేశారు.
Also Read : రాజకీయాల్లోకి కిచ్చా సుదీప్ - పార్టీల నుంచి పిలుపు నిజమే
చిత్రసీమలో శతాధిక చిత్ర దర్శకులలో రాఘవేంద్ర రావు ఒకరు. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సినిమాలు తీయడంలోనూ ఆయనది ప్రత్యేక శైలి. రొమాంటిక్ పాటలకు ఆయన ఎంత పేరో.. అలాగే భక్తిరస చిత్రాలు తీయడంలోనూ దిట్ట. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ వంటి సినిమాలతో తెలుగుసినిమా చరిత్రలో ఆయనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు రాఘవేంద్రరావు. ప్రస్తుతం ఆయన సినిమాలు బాగా తగ్గించేశారు. ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ తో ‘పెళ్లి సందD’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆయన ఏ సినిమా తీయలేదు. అయితే ఇప్పుడాయన మరో ప్రయోగాన్ని మొదలుపెట్టారు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూసే యువత కోసం వారధి కావడానికి ఆయనే స్వయంగా ఓ యూట్యూబ్ ఛానల్ ను క్రియేట్ చేశారు.
View this post on Instagram
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ''రాఘవేంద్ర రావు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో మంది నటీనటులను పరిచయం చేశారని, ఇంకా కొత్త వారిని ఇండస్ట్రీలోకి పరిచయం చేయాలనే తపన తనకు ఇంకాపోలేదని, అందుకే ‘కేఆర్ఆర్ వర్క్స్’ పేరుతో ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభిస్తున్నారు'' అని అన్నారు. ఈ ఛానల్ ను తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. 80 ఏళ్ల యంగ్ దర్శకుడికి ఆల్ ది బెస్ట్ అంటూ ఛానెల్ ను ప్రారంభించారు. ఇక తర్వాత యాంకర్ సుమ మాట్లాడుతూ.. ఎంతో మంది టాలెంట్ ఉండి ముందుకు రాలేని ఎంతో మంది సామాన్యులకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వరించే విధంగా ఈ ఛానెల్ ను ప్రారంభించారని చెప్పారు. క్రియేటివ్ షార్ట్ ఫిల్మ్ స్క్రిప్టులు, యాక్టింగ్ రీల్స్, మ్యూజిక్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్ కథలను తమతో పంచుకోవాలని తెలిపారు. అందుకోసం ‘కేఆర్ఆర్ వర్క్స్’ ఛానల్ ఓ మైయిల్ అడ్రస్ ను కూడా అందుబాటులో ఉంచారు.