Chiranjeevi: చిరంజీవి @ 'విశ్వంభర'... మెగా మాస్ ఫాంటసీ మొదలెట్టారోయ్!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమా చిత్రీకరణ ఇవాళ మొదలైంది.
Chiranjeevi 156th Movie Viswambhara regular shooting started today: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఇదొక ఫాంటసీ ఫిల్మ్. యువి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్లాక్ బస్టర్ ఫిల్మ్ నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార'తో దర్శకుడిగా పరిచయమైన వశిష్ఠ రెండో చిత్రమిది. ఆయన తొలి సినిమా టైమ్ ట్రావెల్, ఫాంటసీ జానర్ ఫిల్మ్. చిరుతో కూడా ఫాంటసీ సినిమా తీస్తున్నారు.
చిరు సినిమా షూటింగ్ మొదలు!
చిరంజీవి 156వ చిత్రమిది. యూనిట్ సభ్యులు అయితే Mega 156 వర్కింగ్ టైటిల్ (Chiranjeevi 156 Movie Title)తో పిలుస్తున్నారు. అయితే... ఈ చిత్రానికి 'విశ్వంభర' టైటిల్ ఖరారు చేశారని తెలిసింది. ప్రముఖ సాహితీవేత్త, స్వర్గీయ రచయిత సి. నారాయణ రెడ్డి ఆ పేరుతో ఓ పుస్తకం రాశారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ రోజు నుంచి కీలక తారాగణం మీద సన్నివేశాలు చిత్రీకరించాలని ప్లాన్ చేశారు.
Also Read : యోధుడిగా, అపర భక్తుడిగా విష్ణు మంచు - ఆయన బర్త్‌డే గిఫ్ట్, 'కన్నప్ప' ఫస్ట్ లుక్ చూశారా?
In the good old days, films used to begin with music compositions, and #Mega156 has brought the tradition back to Telugu Cinema 💫🔮
— UV Creations (@UV_Creations) October 24, 2023
Beginning the MEGA MASS BEYOND UNIVERSE with a celebratory song composition followed by an auspicious Pooja Ceremony ❤️
Wishing everyone a very… pic.twitter.com/CRuG2f7fot
'విశ్వంభర'లో రానా దగ్గుబాటి విలన్!?
'విశ్వంభర'లో ప్రతినాయకుడి పాత్రకు మెగా ఫ్యామిలీ సన్నిహితుడు, చిరు తనయుడు రామ్ చరణ్ క్లోజ్ ఫ్రెండ్ రానా దగ్గుబాటిని సంప్రదించారని టాక్. ఈ కథ, అందులో పాత్ర విన్న తర్వాత ఆయన కూడా ఓకే చెప్పారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'లో రానా నటించారు. ఇప్పుడు చిరు చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో రజనీకాంత్ సినిమాలో కీలక పాత్ర చేసే అవకాశం అందుకున్నారు.
Also Read: నాగ చైతన్య చేపల వేట - 'తండేల్' కోసం ఎలా మారిపోయాడో చూశారా?
ఆల్రెడీ మెగా 156 సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఆస్కార్ పురస్కార గ్రహీతలైన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్... దర్శకుడు వశిష్ఠ, చిరంజీవి మధ్య చర్చలు జరిగాయి. సెలబ్రేషన్ సాంగ్ రికార్డ్ చేస్తున్నామని వివరించారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్ : ఏఎస్ ప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్ : సుశ్మితా కొణిదెల, కూర్పు : కోటగిరి వెంకటేశ్వర రావు & సంతోష్ కామిరెడ్డి, మాటలు : సాయి మాధవ్ బుర్రా, పాటలు : శ్రీ శివ శక్తి దత్తా & చంద్రబోస్, స్క్రిప్ట్ అసోసియేట్స్ : శ్రీనివాస గవిరెడ్డి - గంటా శ్రీధర్ - నిమ్మగడ్డ శ్రీకాంత్ - మయూఖ్ ఆదిత్య, ఛాయాగ్రహణం : ఛోటా కె. నాయుడు, సంగీతం : ఎంఎం కీరవాణి.