అన్వేషించండి

Naga Chaitanya First Look : నాగ చైతన్య చేపల వేట - 'తండేల్' కోసం ఎలా మారిపోయాడో చూశారా?

Thandel Movie First Look: అక్కినేని నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్2 సంస్థ నిర్మిస్తున్న సినిమాకు 'తండేల్' టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.  

Thandel movie first look released on the occasion of Akkineni Naga Chaitanya birthday: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో జీఏ 2 పిక్చర్స్ సంస్థ ఓ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మత్యకారుల జీవితాల నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఇందులో చైతన్య ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 

'తండేల్'గా అక్కినేని నాగ చైతన్య
నాగ చైతన్య, చందూ మొండేటి సినిమాకు 'తండేల్' టైటిల్ ఖరారు చేశారు. రేపు (నవంబర్ 23న) చైతూ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అంతే కాదు... తండేల్ పాత్రలో ఆయన నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది.

హీరోగా నాగ చైతన్య 23వ చిత్రమిది. ఫస్ట్ లుక్ చూస్తుంటే... సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్లే జాలరి పాత్రలో ఆయన నటిస్తున్నట్లు అర్థం అవుతోంది. పడవలో ఆయన ఉన్నారు. ఓ నాయకుడు జన్మించాడంటూ ఆయన లుక్ విడుదల చేసిన సినిమా యూనిట్ పేర్కొంది. ఆయన లుక్ కూడా కొత్తగా ఉంది. ఈ సినిమా కోసం జుట్టు ఎక్కువ పెంచారు. ఇంకా బాడీ పరంగా కొత్తదనం చూపించడం కోసం ఫిజికల్ ట్రాన్‌ఫర్మేషన్ మీద కాన్సంట్రేట్ చేశారట. 

'తండేల్' రీసెర్చ్ కోసం శ్రీకాకుళంతో పాటు కొన్ని ప్రాంతాలకు దర్శకుడు చందూ మొండేటితో పాటు స్వయంగా నాగ చైతన్య కొన్ని ప్రాంతాలకు వెళ్లారు. 

Also Read: విచిత్రకు టార్చర్ - హీరో పిలిస్తే గదికి వెళ్ళలేదని, నోరు విప్పిన 'బిగ్ బాస్' నటి!

నాగ చైతన్య జోడిగా సాయి పల్లవి!
Naga Chaitanya 23 Movieలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి కథానాయికగా నటించనున్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన వర్క్ షాప్స్ కు ఆమె కూడా హాజరు అయ్యారు. ఇక్కడ గమనించదగ్గ అంశం ఏమిటంటే... చందూ మొండేటి దర్శకత్వంలో ఆమెకు తొలి చిత్రమిది. గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థలో కూడా! అయితే, మలయాళంలో ఆమె నటించిన 'ప్రేమమ్' తెలుగు రీమేక్ చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందింది. అందులో నాగ చైతన్య హీరో. తెలుగు 'ప్రేమమ్' తర్వాత చందూ మొండేటి, 'లవ్ స్టోరీ' తర్వాత సాయి పల్లవి, '100 పర్సెంట్ లవ్' తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థలో నాగ చైతన్య చేస్తున్న చిత్రమిది. 

Also Read: 'రానా నాయుడు 2' అప్డేట్ ఇచ్చిన వెంకీ - ఈసారి ఆ సీన్లు, బూతులు తగ్గుతాయా?

చైతూతో అందరిదీ హిట్ రికార్డ్!
అక్కినేని నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ '100 పర్సెంట్ లవ్' నిర్మించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇటు దర్శకుడు కూడా చైతూతో హిట్ సినిమా తీశారు. 'కార్తికేయ'తో దర్శకుడిగా పరిచయమైన చందూ మొండేటికి ఆ వెంటనే అక్కినేని హీరో నాగ చైతన్యతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. మలయాళ క్లాసిక్ 'ప్రేమమ్'ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు. 'కార్తికేయ 2' తర్వాత ఆయన చేస్తున్న సినిమా కావడంతో జాతీయ స్థాయిలో ఈ సినిమాపై చూపు పడింది. 

టాప్ హెడ్ లైన్స్

Romantic Drama OTT : ఓటీటీలోకి వచ్చేసిన క్యూట్ లవ్ స్టోరీ - అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కొత్త మూవీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన క్యూట్ లవ్ స్టోరీ - అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కొత్త మూవీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Comedy Drama OTT : ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ బ్లాక్ బస్టర్ - నాలుగు క్యారెక్టర్లలో కనిపించే హీరో... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ బ్లాక్ బస్టర్ - నాలుగు క్యారెక్టర్లలో కనిపించే హీరో... తెలుగులోనూ స్ట్రీమింగ్
Godavari Serial Today November 5th: 'గోదావరి' సీరియల్: గౌతమి ఫీజు కట్టిన సూర్య! మురళీకి మంచి ఆఫర్! నందుని ఆకర్ష్ లవ్ చేస్తున్నాడా?
'గోదావరి' సీరియల్: గౌతమి ఫీజు కట్టిన సూర్య! మురళీకి మంచి ఆఫర్! నందుని ఆకర్ష్ లవ్ చేస్తున్నాడా?
Jailer 2 OTT Release Date : జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ - అఫీషియల్ అనౌన్స్‌మెంట్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ - అఫీషియల్ అనౌన్స్‌మెంట్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virat Kohli Birthday : 38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
Prakasam Boat Capsized Dead Bodies: కొత్తపట్నం తీరంలో విషాదం - కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం, 15 మంది గల్లంతు?
కొత్తపట్నం తీరంలో విషాదం - కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం, 15 మంది గల్లంతు?
Hiccups : ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?
ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?
Ramayana Collection : రామాయణ అడ్వాన్స్ బుకింగ్స్ - 100 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్
రామాయణ అడ్వాన్స్ బుకింగ్స్ - 100 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ప్రారంభం - వర్షాల అంతరాయం.. పలుచోట్ల ఓటింగ్ వాయిదా!
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ప్రారంభం - వర్షాల అంతరాయం.. పలుచోట్ల ఓటింగ్ వాయిదా!
Congress High Command: కాంగ్రెస్ సీఎంలను హైకమాండ్ కించ పరుస్తుందా? కనీస గౌరవం కూడా ఇవ్వదా?
కాంగ్రెస్ సీఎంలను హైకమాండ్ కించ పరుస్తుందా? కనీస గౌరవం కూడా ఇవ్వదా?
AP Municipal Elections 2026: ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
Shaving Tips for Men : మగవారు షేవింగ్ చేసుకునేటప్పుడు చేయకూడని తప్పులు ఇవే.. మంట, దురద రాకుండా ఇవి ఫాలో అవ్వండి
మగవారు షేవింగ్ చేసుకునేటప్పుడు చేయకూడని తప్పులు ఇవే.. మంట, దురద రాకుండా ఇవి ఫాలో అవ్వండి
Embed widget