By: ABP Desam | Updated at : 15 May 2022 06:08 PM (IST)
కరాటే కళ్యాణి ఇంట్లో సోదాలు
నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య జరిగిన వాగ్వాదం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ గొడవ ఎంత పెద్ద రచ్చ అయిందో తెలిసిందే. ప్రాంక్ వీడియోల పేరుతో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసింది కరాటే కళ్యాణి. శ్రీకాంత్ కూడా ఆమెపై చేయి చేసుకున్నాడు. ఈ వివాదం ముదిరి ఇద్దరూ ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు.
తనపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇస్తే ఇరువురిపై ఒకేరకమైన కేసులు పెట్టి శ్రీకాంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారని ఎస్‌ఆర్ నగర్ సీఐ సైదులుపై కళ్యాణి ఫైర్ అయింది. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన కళ్యాణి సీఐపై తీవ్రంగా మండిపడింది. ఇదిలా ఉండగా.. తాజాగా మరోసారి కరాటే కళ్యాణి వార్తల్లో నిలిచింది.
ఆమె ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించి అధికారులు కరాటే కళ్యాణ్ ఇంట్లో ఒక చిన్నారిని గుర్తించారు. ఆ చిన్నారి ఎవరు..? ఎక్కడ నుంచి తీసుకొచ్చారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. కరాటే కళ్యాణి అక్రమంగా చిన్నారిని కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులు అందాయట. ఈ ఫిర్యాదుతోనే అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇటీవల శ్రీకాంత్ రెడ్డితో గొడవ జరిగినప్పుడు కరాటే కళ్యాణితో పాటు చిన్నారి కూడా ఉన్న సంగతి తెలిసిందే!
Also Read: హరీష్ శంకర్ లిస్ట్ లో క్రేజీ ఆఫర్ - సల్మాన్ తో సినిమా?
Also Read: ఆయన మాటలంటే నీ సంస్కారం ఏమైంది? బిందుని ప్రశ్నించిన నాగ్!
Pathaan First Look: షారుఖ్ ఖాన్ 'పఠాన్' - తెలుగులోనూ వచ్చెన్, విడుదల తేదీ కూడా
DJ Tillu 2 Launched: సూపర్ హిట్ 'డీజే టిల్లు'కు సీక్వెల్, క్రేజీ అప్డేట్ ట్వీట్ చేసిన ప్రొడ్యూసర్
Chinmayi Sripada: డాడీ డ్యూటీస్‌లో రాహుల్ రవీంద్రన్ - చిల్డ్రన్ ఫోటోలు షేర్ చేసిన చిమ్మాయి
Virata Parvam: విరాట పర్వానికి కమల్ హాసన్‌కు లింకేంటి? వెంకటేష్ ప్రభు కార్తీక్ రాజా పేరు ధనుష్‌గా ఎలా మారింది?
MS Raju On Ticket Rates: థియేటర్లలో పెద్ద చిత్రాలే విడుదల చేయాలా? - నిర్మాత ఎంఎస్ రాజు సంచలన వ్యాఖ్యలు
Bharat NCAP Crash Test Rating: వచ్చే ఏడాది నుంచి కార్లకు ఆ పరీక్ష తప్పనిసరి, స్టార్ రేటింగ్‌తో రోడ్డు భద్రత
Srivari Arjitha Seva Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త - రెండేళ్ల తరువాత లక్కీ డిప్, ఆర్జిత సేవల టికెట్లు విడుదల ఎప్పుడంటే
Janhvi Kapoor Photos: బ్రేక్ ఇవ్వకపోతే ఎలా జాన్వీ బోర్ కొట్టదూ!
Hindupur Ysrcp Politics : హిందూపురం వైసీపీలో లోకల్, నాన్ లోకల్ పాలిటిక్స్, ఎమ్మెల్సీ ఇక్బాల్ ఎదురీత