అన్వేషించండి

Celina Jaitly Twitter troll: అంతు చూస్తా - 3 వేల మందిపై నటి సెలీనా జైట్లీ పోలీస్ కంప్లైంట్!

సినీ క్రిటిక్ ఉమైర్ సంధు తనపై దారుణ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నటి సెలీనా జైట్లీ గట్టి చర్యలకు దిగుతోంది. తనపై సోషల్ మీడియాలో అడ్డగోలు రాతలు రాసేవారిపై చట్టపరమైన చర్యలకు రెడీ అవుతోంది.

బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు తన గురించి సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ సీరియస్ అయ్యింది. ఉమైర్ సంధు మాదిరిగానే పిచ్చి వ్యాఖ్యలు చేసే వారికి చట్ట ప్రకారం బుద్ది చెప్పేందుకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు ట్విట్టర్ లో తన గురించి అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. ఇప్పటికే సుమారు 3 వేల మందిపై కేసులు నమోదు అయినట్లు తెలిపింది. వారందరూ చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సి ఉంటుందని వెల్లడించింది.

సెలీనాపై ఉమైర్ సంధు దారుణ వ్యాఖ్యలు

తాజాగా బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు తాజాగా సెలీనా గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ లో తండ్రీ కొడుకు(ఫిరోజ్ ఖాన్, ఫర్దీన్ ఖాన్)లతో పడుకున్న ఏకైక హీరోయిన్ సెలీనా జైట్లీ అంటూ  ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ కాసేపట్లోనే బాగా వైరల్ అయ్యింది. ఉమైర్ సంధు ట్వీట్ పై సెలీనా తీవ్రంగా స్పందించింది. ఉమైర్ పై నిప్పులు చెరిగింది.  ‘‘మిస్టర్ సంధు.. కనీసం నువ్వు ఇప్పుడైనా మనిషిగా మారతావనే ఉద్దేశంతో ఈ పోస్ట్ పెడుతున్నాను. ముందు నువ్వు వెళ్లి మంచి డాక్టర్‌ని కలువు. తర్వాత నీ లైంగిక సమస్య నుంచి ఉపశమనం పొందుతావు’’ అంటూ చెంప చెల్లుమనిపించేలా ట్వీట్ చేసింది. ఇలాంటి ఫేక్ పోస్టులు పెడుతూ ప్రజలను పక్కదోవపట్టిస్తున్న ఉమైర్ సంధు లాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ  ట్విట్టర్ సేఫ్టీను ట్యాగ్ చేసింది.

తీవ్రంగా స్పందించిన సెలీనా

సోషల్ మీడియాలో సెలబ్రిటీలను కించపరుస్తూ రాతలు రాయడం కొంత మందికి ఫ్యాషన్ గా మారిందని సెలీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్కసారి కాదు, వందల సార్లు తమ గురించి, తమ వ్యక్తిగత జీవితం గురించి అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. చాలా సార్లు గాసిప్స్ ను పట్టించుకోకుండా వదిలి వేసినా, ఒక్కోసారి చాలా దారుణమైన రీతిలో వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని మండిపడింది. ఇకపై తన గురించి ఎలాంటి అడ్డగోలు వ్యాఖ్యలు చేసినా, సహించేది లేదని తేల్చి చెప్పింది.  అవాస్తవ గాసిప్స్ తో అమాయకుల బట్టలు విప్పి అవమానాలకు గురిచేసేలా కొంత మంది వ్యక్తులు తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసింది.  వారిని ఉపేక్షించడం సరికాదని తేల్చి చెప్పింది.

ఆయన నాకు తండ్రితో సమానం- సెలీనా

గతంలో ఫిరోజ్ ఖాన్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సెలీనా ఆయన గొప్ప స్నేహితుడిగా, తండ్రిగా భావించేదానినని చెప్పుకొచ్చింది. మిస్టర్ ఖాన్ నన్ను ఎప్పుడూ సెలిన్ అని పిలిచేవారని వెల్లడించింది. “ఆయన నా గురువు మాత్రమే కాదు, నా బెస్ట్ ఫ్రెండ్. నేను అతనితో చర్చించనిది ఏమీ లేదు. నా మొదటి షూటింగ్ షెడ్యూల్‌లో చక్కగా చూసుకున్నారు. అతడు, అతడి కుటుంబం మొత్తం నన్ను వారి సొంత మనిషిలా చూసుకున్నారు” అని తెలిపింది. ఫిరోజ్ ఖాన్, ఫర్దీన్ ఖాన్ నటించిన ‘జనషీన్’ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది సెలీనా. దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది.    

అటు నెటిజన్లు సైతం ఉమైర్ సంధు లాంటి చెత్త ట్వీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి గాసిప్స్ ను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. పలువురు సెలబ్రెటీలు కూడా ఈ సెలీనా ట్వీట్ కు మద్దతు తెలుపుతున్నారు.

Read Also: మంజు వారియర్ గొప్ప మనసు, తన కారు వెంట పరిగెత్తిన అభిమాని కోరిక తీర్చిందిలా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget