Photo@Manju Warrier/Instagram
మలయాళ నటి మంజు వారియర్ తాజాగా తన మంచి మనసును చాటుకున్నారు. తన వీరాభిమాని కోసం కారు ఆపి, ఆమె కోరికను నెరవేర్చారు. ఆమె గొప్ప మనసుకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
మంజు వారియర్ తాజాగా కేరళలోని ఎర్నాకులంలో ఓ ఈవెంట్ కు హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేశారు. ఆ తర్వాత అభిమానులతో కలిసి ముచ్చటించారు. అందిరికీ సెల్ఫీలు కూడా ఇచ్చేశారు. కార్యక్రమం అయిపోగానే, అక్కడి నుంచి కారులో బయల్దేరారు. ఇంతలో ఆమెకు ఓ ఆశ్చర్యకర పరిస్థితి ఎదురయ్యింది. తన కారు వెనుకాల ఓ యువతి పరిగెత్తుకుంటూ రావడాన్ని గమనించించారు. అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో అలాగే కారు ముందుకు వెళ్లింది. అయినా, ఆ యువతి అలాగే పరిగెత్తుకుంటూ వచ్చింది.
మంజు వారికి వెంటనే తన డ్రైవర్ కు చెప్పి కారు ఆపించింది. కారు దగ్గరికి చేరుకున్న అభిమానితో మంజు మాట్లాడింది. కారు డోరు దగ్గర నిల్చుని తన అభిమానితో ముచ్చటించింది. ఆ అమ్మాయి మంజుకు ఓ విషయం చెప్పింది. ఆమె చెప్పిన విషయం విని చాలా హ్యాపీగా ఫీలైంది. తనతో పాటు తన తల్లి కూడా మంజుకు వీరాభిమాని అని చెప్పింది. అంతేకాదు, తన తల్లి బర్త్ డే కావడంతో, ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు రెండు నిమిషాల సమయం కేటాయించాలని అడిగింది. బర్త్ డే సందర్భంగా అభిమాన నటి నుంచి శుభాకాంక్షలు అందితే తను చాలా గొప్పగా ఫీలవుతుందని చెప్పుకొచ్చింది. మీరు తనకు బర్త్ డే విషెస్ చెప్తే, నేను గొప్ప బహుమతి ఇచ్చినట్లుగా ఫీలవుతానని వెల్లడించింది.
సంతోషంలో మునిగిపోయిన యువతి
ఆ యువతి చెప్పిన మాటలకు మంజు వారియర్ సంతోషంగా ఫీలయ్యింది. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నందున ఇప్పుడు మాట్లాడలేనని చెప్పింది. మంజు తన నెంబర్ ఆ యువతికి ఇవ్వాలని తన సిబ్బందికి చెప్పింది. ఇంటికి వెళ్లాక కాల్ చేస్తే తప్పకుండా మీ అమ్మగారితో మాట్లాడతానని చెప్పుకొచ్చింది. అభిమాన నటి హామీతో ఆ యువతి చాలా హ్యాపీగా ఫీలయ్యింది. ఆమెకు థ్యాంక్స్ చెప్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఇక మంజు వారియర్ చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశంతోనే ఎక్కువ సినిమాలు చేయడం లేదని ఆమె తాజాగా వెల్లడించింది. చివరగా మంజు వారియర్ అజిత్ కుమార్ తో కలిసి ‘తునివు’ సినిమాలో కనిపించింది. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ‘తునివు’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అటు మంజు నటించిన మలయాళ చిత్రం ‘ఆయిషా’ ఇటీవలే ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. అటు మంజు వారియర్ బాలీవుడ్ లోనూ ఓ సినిమా చేస్తోంది.
Read Also: సమంతకు ‘శాకుంతలం’ కష్టాలు, ట్విట్టర్ వేదికగా షాకింగ్ విషయాలు వెల్లడి!
Buddy Movie First Look : తక్కువ అంచనా వేయకండి - 'బడ్డీ'తో బాక్సాఫీస్‌కు గురి పెట్టిన అల్లు శిరీష్!
Priyanka Chopra: చెత్త డైలాగులు, గంటల తరబడి ఎదురుచూపులు - ఆ సినిమా అంటే ఇప్పటికీ అసహ్యం: ప్రియాంక చోప్రా
BellamKonda Ganesh: మోక్షజ్ఞ నటన, డ్యాన్స్‌లతో తాత, తండ్రి పేరు నిలబెడతాడు - బాలయ్య ఫ్యాన్స్‌కు బెల్లంకొండ గణేష్ గుడ్ న్యూస్
బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్లీ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే
‘అఖండ’ నిర్మాతతో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కొత్త మూవీ
Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు - నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !
Telangana Congress : టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !
Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?