News
News
వీడియోలు ఆటలు
X

Samantha Helth: సమంతకు ‘శాకుంతలం’ కష్టాలు, ట్విట్టర్ వేదికగా షాకింగ్ విషయాలు వెల్లడి!

‘శాకుంతలం’ కారణంగా పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు నటి సమంత వెల్లడించారు. వరుస ప్రమోషన్ కార్యక్రమాలతో జ్వరంతో పాటు గొంతు సమస్యలు తలెత్తినట్లు వెల్లడించారు.

FOLLOW US: 
Share:

మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో పోరాడి ఇటీవలే కోలుకున్న స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదన్నట్టు తెలుస్తోంది. అందుకు తాజాగా చోటు చేసుకున్న పరిణామాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. సామ్  ప్రస్తుతం చూడడానికి బాగానే ఉంది అనిపించినా.. ఇంకా వ్యాధికి సంబంధించిన ఆనవాళ్లు ఆమె శరీరంలో ఉన్నాయని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆమె తాజాగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

సమంతకు ‘శాకుంతలం’ కష్టాలు!

సమంత నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ చిత్రం 'శాకుంతలం'  ఏప్రిల్ 14న విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా వరుస ప్రమోషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిత్యం తను ఒక్కో రాష్ట్రంలో పర్యటిస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.  అయితే, అసలే అరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెకు ఈ సినిమా ప్రమోషన్ సైతం ఇబ్బందికరంగా మారింది.  జ్వరంతో తో పాటు గొంతు సమస్యలను తలెత్తాయని తెలిపారు. “ఈ వారం అంతా నా సినిమాని ప్రమోట్ చేస్తూ, మీ ప్రేమలో మునిగితేలుతున్నందుకు  చాలా ఉత్సాహంగా ఉన్నాను. దురదృష్టవశాత్తూ బిజీ షెడ్యూల్స్, ప్రమోషన్స్ వల్ల నేను జ్వరంతో బాధపడుతున్నాను. నా గొంతు  సమస్యలు కూడా తలెత్తాయి” అని తెలిపారు.  అంతేకాదు, ఆరోగ్య సమస్యల కారణంగా పలు కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. అనారోగ్యం కారణంగా MLRIT వార్షికోత్సవానికి హాజరు కావడం లేదని వెల్లడించారు.  

సమంత ఆరోగ్యంపై అభిమానుల ఆందోళన

ప్రస్తుతం సమంత చేసిన ట్వీట్లు సోసల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "ముందు మీ గురించి, మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోండి. మీరు బాగా విశ్రాంతి తీసుకోండి. అంతా బాగానే ఉంటుంది" అని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. ఆమెకు కోలుకునే శక్తిని ఇవ్వాలని భగవంతుడిని  కోరుతున్నారు. “శాకుంతలం సినిమా మంచి సక్సెస్ అందుకుంటుంది. మీ ఎపిక్ బ్లాక్ బస్టర్లలో ఇది ఒకటిగా నిలుస్తుంది. సో, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి” అంటూ మరో అభిమాని ట్వీట్ చేశారు.      

ఇక సమంత నటించిన 'శాకుంతలం' చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దేవ్ మోహన్ రాజు.. దుష్యంత్ పాత్రను పోషిస్తుండగా, అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ.. ప్రిన్స్ భరత్‌గా నటించింది. అదితి బాలన్, ప్రకాష్ రాజ్, గౌతమి, మధు, సచిన్ ఖేడేకర్, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఏప్రిల్ 14న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

అటు సమంత రూత్ ప్రభు తన తదుపరి వెబ్ సిరీస్ ‘సిటాడెల్‌’లో నటిస్తోంది. రాజ్‌-డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న రస్సో బ్రదర్స్ ప్రాజెక్ట్ ‘సిటాడెల్‌’ లో వరుణ్‌ ధావన్‌ హీరోగా చేస్తున్నారు. ఈ సిరీస్ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.   హాలీవుడ్‌ షో ‘సిటాడెల్‌’కు రీమేక్‌గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఇందులో వరుణ్‌ ధావన్‌, సమంత గూఢచారి పాత్రలు పోషిస్తున్నారు.

Read Also: సినిమాల్లోకి రాకముందు ఈ తారల అసలు పేర్లు ఏంటో తెలుసా?

Published at : 13 Apr 2023 11:52 AM (IST) Tags: Samantha Shaakuntalam Promotions Samantha Helth

సంబంధిత కథనాలు

హీరో, హీరోయిన్లను కొట్టడం పై తేజకి ప్రశ్న - దర్శకుడి ఆన్సర్‌కి పారిపోయిన ‘జబర్దస్త్’ కమెడియన్!

హీరో, హీరోయిన్లను కొట్టడం పై తేజకి ప్రశ్న - దర్శకుడి ఆన్సర్‌కి పారిపోయిన ‘జబర్దస్త్’ కమెడియన్!

Tamanna: చేతిలో మందు గ్లాస్, బీచ్‌లో డ్యాన్స్ - బాల్యాన్ని గుర్తు తెచ్చుకున్న తమన్నా, వీడియో వైరల్

Tamanna: చేతిలో మందు గ్లాస్, బీచ్‌లో డ్యాన్స్ - బాల్యాన్ని గుర్తు తెచ్చుకున్న తమన్నా, వీడియో వైరల్

Filmfare Awards: ఆ అవార్డులను వాష్ రూమ్ హ్యాండిల్‌గా వాడతా - ‘ఫిల్మ్‌ఫేర్’పై నటుడు నసీరుద్దీన్ షా వ్యాఖ్యలు

Filmfare Awards: ఆ అవార్డులను వాష్ రూమ్ హ్యాండిల్‌గా వాడతా - ‘ఫిల్మ్‌ఫేర్’పై నటుడు నసీరుద్దీన్ షా వ్యాఖ్యలు

Jr NTR - McDonald's AD : చికెన్ కోసం రాత్రిని పగలు చేసిన ఎన్టీఆర్ - కొత్త యాడ్ చూశారా?

Jr NTR - McDonald's AD : చికెన్ కోసం రాత్రిని పగలు చేసిన ఎన్టీఆర్ - కొత్త యాడ్ చూశారా?

Adipurush Censor Report : 'ఆదిపురుష్' సెన్సార్ కంప్లీటెడ్ - రిపోర్ట్ ఎలా ఉందంటే?

Adipurush Censor Report : 'ఆదిపురుష్' సెన్సార్ కంప్లీటెడ్ - రిపోర్ట్ ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?

Janasena News : జనసేనలోకి ఆమంచి  కృష్ణమోహన్ సోదరుడు -  చీరాలపై గురి పెట్టారా ?

Realme 11 Pro: 100 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో - సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా - ధర రూ.20 వేలలోనే!

Realme 11 Pro: 100 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో - సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా - ధర రూ.20 వేలలోనే!

నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్ స్థలాలు

నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి  ప్రత్యేక పార్కింగ్ స్థలాలు