అన్వేషించండి
Advertisement
Lucifer Remake : మెగాస్టార్ సినిమాలో గెస్ట్ రోల్.. సల్మాన్ ఖాన్ ఒప్పుకుంటారా..?
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోగా మారారు.
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోగా మారారు. ఇటీవలే కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాను పూర్తి చేశారు. ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో డీటాక్సినేషన్ తీట్మెంట్ కోసం వైజాగ్ కు వెళ్లారు. తిరిగిరాగానే 'లూసిఫర్' రీమేక్ షూటింగ్ లో పాల్గొనున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే తమన్ తో కలిసి మోహన్ రాజా కొన్ని మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన క్యాస్టింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నయనతారను కీలకపాత్ర కోసం ఎంపిక చేసుకున్నారని సమాచారం. అలానే యంగ్ హీరో సత్యదేవ్ ను కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. మలయాళంలో వివేక్ ఒబెరాయ్ పోషించిన పాత్రలో సత్యదేవ్ కనిపిస్తారని టాక్. సినిమాలో మరికొంతమంది టాలెంటెడ్ యాక్టర్స్ ను తీసుకోబోతున్నారు.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను ఈ సినిమా కోసం సంప్రదించినట్లు సమాచారం. మెగా ఫ్యామిలీకు, సల్మాన్ ఖాన్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. అప్పుడప్పుడు ఈ రెండు ఫ్యామిలీలు కలుసుకుంటూ ఉంటారు. రామ్ చరణ్ కి సల్మాన్ ఖాన్ మంచి ఫ్రెండ్. ఈ అనుబంధంతోనే ఇప్పుడు చిరు.. సల్మాన్ ఖాన్ ను తన సినిమాలో పాత్ర కోసం అడగాలనుకుంటున్నారు.
మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్ర కోసం సల్మాన్ ఖాన్ ను అడుగుతున్నారు. ఈ పాత్ర చిన్నదే అయినా.. కథకు కీలకం కావడంతో ఎవరైనా పాపులర్ లేదా టాప్ హీరో చేస్తే మంచి బజ్ వస్తుంది. అందుకే ఈ పాత్రను చేయమని సల్మాన్ ఖాన్ ను చిరు స్వయంగా అడగబోతున్నారట. ఈ నెల 13 లోపు సల్మాన్ ఖాన్ నటిస్తారా..? లేదా..? అనే విషయంలో క్లారిటీ వస్తుంది. సల్మాన్ ఖాన్ గనుక ఒప్పుకుంటే ఈ సినిమాకి పాన్ ఇండియా లుక్ రావడం ఖాయం.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తిరుపతి
అమరావతి
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion