Samantha: బన్నీ భార్య ఫొటోలపై సమంత 'హాట్' కామెంట్..
తాజాగా స్నేహారెడ్డి కొన్ని ఫొటోలను షేర్ చేసింది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఓ చీరను కట్టుకున్న స్నేహారెడ్డి ఫొటోషూట్ లో పాల్గొంది.
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఒక్క ఇన్స్టాగ్రామ్ లో ఆమెకి 6.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. స్టార్ హీరో భార్యగానే కాకుండా.. తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకోగలిగింది. ఎప్పటికప్పుడు తన భర్తతో పాటు పిల్లలు అయాన్, అర్హలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది.
తాజాగా స్నేహారెడ్డి కొన్ని ఫొటోలను షేర్ చేసింది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఓ చీరను కట్టుకున్న స్నేహారెడ్డి ఫొటోషూట్ లో పాల్గొంది. ఈ ఫొటోలపై నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా రియాక్ట్ అవుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అయితే 'హాట్' అంటూ కామెంట్ పెట్టింది.
స్నేహారెడ్డితో సమంతకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. తరచూ పార్టీల్లో, ఫంక్షన్స్ లో ఇద్దరూ కలుస్తూ ఉంటారు. ఇక సమంత విషయానికొస్తే.. ఇటీవల 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించింది. 'ఊ అంటావా మామ ఊ ఊ అంటావా' అనే సాంగ్ లో కనిపించి సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'యశోద' అనే సినిమాలో నటిస్తోంది. అలానే ఓ బైలింగ్యువల్, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేతిలో ఉన్నాయి.
View this post on Instagram
Also Read: నాగార్జున వస్తే.. పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా..?
Also Read: 'ఆర్ఆర్ఆర్' ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్ట్ లుగా చిరంజీవి, బాలకృష్ణ..?
Also Read:సూపర్ స్టార్ రజినీకాంత్.. నానికి ఛాన్స్ ఇస్తారా..?
Also Read:శంకర్-చరణ్ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. అదే ఫార్ములా..
Also Read:సముద్రఖని డైరెక్షన్.. త్రివిక్రమ్ ప్రొడక్షన్.. హీరోగా పవన్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి