The Warrior: రామ్ సినిమాలో శింబు పాడిన 'బులెట్' సాంగ్ విన్నారా?
రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న 'ది వారియర్' సినిమాలో తమిళ స్టార్ శింబు ఓ సాంగ్ పాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సాంగ్ ను విడుదల చేశారు.
యంగ్ హీరో రామ్ పోతినేని నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'ది వారియర్'. లింగు స్వామి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున సినిమాను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాలో 'బుల్లెట్..' అంటూ సాగే సాంగ్‌ను విడుదల చేశారు.
ఈ సాంగ్ స్పెషాలిటీ ఏంటంటే.. దీన్ని తమిళ హీరో శింబు పాడారు. 'కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెట్.. ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయెట్' అంటూ సాగే ఆ పాటను శుక్రవారం నాడు విడుదల చేశారు. డీఎస్పీ మ్యూజిక్, శింబు వాయిస్ లో గ్రేస్ ఈ పాటకు హైలైట్ గా నిలిచింది. ఈ ట్యూన్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. తెలుగులో ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో రామ్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడని టాక్. ఒకటి పోలీస్ ఆఫీసర్ కాగా.. మరొక గెటప్ ను సస్పెన్స్ గా ఉంచారు. ఈ సినిమా పూర్తయ్యాక బోయపాటి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు రామ్.
Also Read: 'ఆచార్య' సెన్సార్ రివ్యూ - హైలైట్ ఎపిసోడ్స్ ఇవే
so Read: హీరో కార్తికేయ కొత్త సినిమాలో సిరివెన్నెల ఆఖరి పాట - షూటింగ్ షురూ
View this post on Instagram