Virgin Story: ‘వర్జిన్ స్టోరీ’, టైటిలే కాదు, విరహ గీతం కూడా ‘కొత్త’గా ఉంది!
‘వర్జిన్ స్టోరీ’ సినిమా నుంచి విడుదలైన ‘బ్రోకెన్ లవ్’ సాంగ్ యూత్‌ను ఆకట్టుకుంటోంది.

Virgin Story | ‘వర్జిన్ స్టోరీ’.. పేరేంటీ తేడాగా ఉందని అనుకుంటున్నారా? యూత్‌ను ఆకట్టుకోవడం ఇలాంటి టైటిల్సే పెడుతున్నారు. అన్నట్లుగా ఈ టైటిల్‌కు ‘కొత్తగా రెక్కలొచ్చానా..’ అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. నిర్మాత లగడపాటి శ్రీధర్ కొడుకు విక్రమ్ సహిదేవ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి ప్రదీప్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఫూల్ యూత్‌ఫుల్ లవ్ స్టోరీ అని నిర్మాతలు చెబుతున్నారు. ఇప్పటికీ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 18న విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.
వాలెంటైన్స్ డే నేపథ్యంలో శుక్రవారం ఈ చిత్రం నుంచి ‘బ్రోకెన్ లవ్’ పానే పాటను విడుదల చేశారు. ఈ పాట సంగీత పరంగానే కాదు.. చూసేందుకు కూడా కొత్తగా ఉంది. ఈ సినిమాకు అచ్చు రాజమణి సంగీతం అందించాగా.. హారిక నారాయణ్ ఆలపించారు. అనంత్ శ్రీరామ్ అందించిన సాహిత్యం బాగుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. ‘మనసా నిన్నలా’, ‘కొత్తగా రెక్కలొచ్చెనా’, ‘బేబీ ఐయామ్ ఇన్ లవ్’ పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో సౌమిక పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విక్రమ్ ఇప్పటికే ‘రౌడీ బాయ్స్’ సినిమాలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. మరి హీరోగా ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.
View this post on Instagram
Also Read: ‘ఖిలాడి’ రివ్యూ: ప్రేక్షకుడు ఊహించలేని ట్విస్టులెన్నో!
Also Read: ‘ఎఫ్ఐఆర్’ రివ్యూ: పోకిరి టైప్ టచ్ ఇచ్చారు కానీ!
Before You Go
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















