అన్వేషించండి
Advertisement
FIR Movie Review: 'ఎఫ్ఐఆర్' రివ్యూ: పోకిరి టైప్ టచ్ ఇచ్చారు కానీ!
FIR Movie Review Telugu: తమిళ హీరో విష్ణు విశాల్ నటించిన సినిమా 'ఎఫ్ఐఆర్'. తమిళంతో పాటు తెలుగులో నేడు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే...
ఎఫ్ఐఆర్
Action Thriller
Director
మను ఆనంద్
Starring
విష్ణు విశాల్, రెబా మోనికా జాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మంజిమా మోహన్, పార్వతి, రైజా విల్సన్ తదితరులు
సినిమా రివ్యూ: ఎఫ్ఐఆర్
రేటింగ్: 2/5
నటీనటులు: విష్ణు విశాల్, రెబా మోనికా జాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మంజిమా మోహన్, పార్వతి, రైజా విల్సన్ తదితరులు
ఎడిటర్: ప్రసన్న జీకే
సినిమాటోగ్రఫీ: అరుల్ విన్సెంట్
సంగీతం: అశ్వంత్
సమర్పణ: రవితేజ
తెలుగులో విడుదల: అభిషేక్ నామా
నిర్మాత: విష్ణు విశాల్
దర్శకత్వం: మను ఆనంద్
విడుదల తేదీ: ఫిబ్రవరి 11, 2022
విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించడంతో పాటు స్వయంగా నిర్మించిన సినిమా 'ఎఫ్ఐఆర్'. మను ఆనంద్ దర్శకత్వం వహించారు. "డిఫరెంట్ కంటెంట్ ఉన్న చిత్రమిది. ఆరు నెలల క్రితమే చూశా. 'ఎఫ్ఐఆర్' లాంటి సినిమా నాకూ చేయాలని ఉంది" అని రవితేజ చెప్పడంతో పాటు తన సమర్పణలో తెలుగులో విడుదల చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తి కలిగించింది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, 'సాహసమే శ్వాసగా సాగిపో' కథానాయిక మంజిమా మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఎఫ్ఐఆర్' ఎలా ఉంది?
కథ: ఇర్ఫాన్ అహ్మద్ (విష్ణు విశాల్) కెమికల్ ఇంజనీర్, ఐఐటీ గోల్డ్ మెడలిస్ట్ కూడా! అతడి తల్లి పోలీస్. ఇర్ఫాన్ ఉద్యోగ ప్రయత్నాలకు మతం అడ్డు వస్తుంది. దాంతో చివరకు తాను పార్ట్‌టైమ్ జాబ్ చేసే కంపెనీలో ఫుల్ టైమ్ ఎంప్లాయిగా చేరతాడు. కెమికల్స్ ద్వారా పర్‌ఫ్యూమ్స్ చేసే కంపెనీ అది. యజమాని చెప్పడంతో కొచ్చి వెళ్లి, ముస్లిం మత ప్రచారకుడు జాజిని కలుస్తాడు. కొచ్చిలో, కొచ్చి నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడ కొన్ని కెమికల్స్ తీసుకుంటాడు. విశాఖకు పంపడానికి ఏర్పాట్లు చేస్తాడు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్ళడానికి ఎయిర్‌పోర్ట్‌కు వస్తాడు. సెక్యూరిటీ చెక్ దగ్గర ఫోన్ పోతుంది. కంప్లయింట్ ఇవ్వడానికి వెళ్తాడు. అయితే... అంతలో బోర్డింగ్ అనౌన్స్‌మెంట్ రావడంతో ఫ్లైట్ దగ్గరకు పరుగులు తీస్తాడు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్ అధికారులతో గొడవ అవుతుంది. 'నా బ్యాగులో బాంబు ఏమైనా ఉందా?' అని అరుస్తాడు. దాంతో ప్రశ్నించి వదిలేస్తారు. ఇర్ఫాన్ విశాఖలో ల్యాండ్ అయ్యేసరికి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఇర్ఫాన్ ఫోన్ నుంచి ఆ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. దాంతో ఇర్ఫాన్ అహ్మద్‌ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) అధికారులు అరెస్ట్ చేస్తారు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అలీ బక్కర్ అబ్దుల్లాయే ఇర్ఫాన్ అహ్మద్ అని చెబుతారు. నిజంగానే ఇర్ఫాన్ అహ్మద్ బాంబ్ బ్లాస్ట్ చేశాడా? అతడే అలీ బక్కర్ అబ్దుల్లానా? ఒకవేళ ఇర్ఫాన్ అహ్మద్ ఏ తప్పూ చేయకపోతే అతడు ఎన్ఐఎ అధికారుల నుంచి ఎందుకు తప్పించుకున్నాడు? విశాఖ ప్రజల ప్రాణాలు తీయడానికి జాజి కుమారుడు రియాజ్ వేసిన పథకానికి ఎందుకు సహాయం చేశాడు? చివరకు, ఏమైంది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ: 'ఎఫ్ఐఆర్' బలం, బలహీనత కథా నేపథ్యమే! మనిషి పేరు, మతం ఆధారంగా తప్పు చేశాడా? ఒప్పు చేశాడా? అనే నిర్ణయానికి రాకూడదని మన సమాజంలో చాలా మంది కోరుతున్నారు. ముస్లిం అనే ఏకైక కారణంతో తీవ్రవాది ముద్ర పడటంతో ఇబ్బందులు ఎదుర్కొన్న వ్యక్తుల కథలు ఇప్పటికే తెరపైకి వచ్చాయి. ఇదీ అటువంటి కథే. అయితే... ఈ కథకు 'పోకిరి' టైప్ ఇచ్చారు. కానీ, అప్పటి వరకూ తీసిన చూస్తే... తీవ్రవాదం, ఎన్ఐఎ నేపథ్యంలో సినిమాలు వచ్చాయి. వెబ్ సిరీస్‌లూ వస్తున్నాయి. 'ఎఫ్ఐఆర్' చూస్తే... అవి గుర్తుకు వస్తాయి. కొన్ని సీన్లు 'స్పెషల్ ఆప్స్' వెబ్ సిరీస్‌ను, ప్రీ క్లైమాక్స్ అయితే సూపర్ హిట్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మాన్'ను గుర్తుకు తెస్తుంది. ఆ వెబ్ సిరీస్‌లు చూసినవాళ్లకు 'ఎఫ్ఐఆర్' కొత్తగా అనిపించపోవచ్చు. చూడని వాళ్లకు కొత్తగా అనిపించవచ్చు.
హీరో విష్ణు విశాల్ పాత్రలో జీవించాడు. ఎమోషనల్ సీన్స్ బాగా చేశాడు. మంజిమా మెహన్, రెబా మోనికా జాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మంజిమా మోహన్, పార్వతి, రైజా విల్సన్... సినిమాలో ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. అందరి పాత్రలు వచ్చి వెళుతూ ఉంటాయి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ పాత్రకు సరిగ్గా సరిపోయారు. రెబా మోనికా జాన్ ఓ పాటలో, రెండు సన్నివేశాల్లో అందంగా కనిపించారు. విష్ణు విశాల్ తల్లిగా నటించిన పార్వతి (టక్ జగదీశ్ సినిమాలోనూ హీరో తల్లి పాత్ర చేశారు) ఆకట్టుకుంటారు.
'ఎఫ్ఐఆర్' గురించి చెప్పాలంటే... ఓ యాక్షన్ థ్రిల్లర్‌కు కావాల్సిన హంగులు అన్నీ ఉన్నాయి. అయితే, రేసీ స్క్రీన్ ప్లే మిస్ అయ్యింది. రొటీన్ ట్రీట్మెంట్ ఎక్కువ అయ్యింది. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ను మాత్రమే 'ఎఫ్ఐఆర్' ఆకట్టుకుంటుంది. అయితే... ఎటువంటి చడీ చప్పుడూ లేకుండా పని చేసుకునే ఎన్ఐఎ, లోకానికి తెలిసేలా పని చేయాలనుకున్నట్టు చూపించడం... చివర్లో విష్ణు విశాల్‌ను అన్ సంగ్ హీరోగా చూపించడం కొంత ఇబ్బందిగా ఉంటుంది.
Also Read: 'ఖిలాడి' రివ్యూ: రవితేజ సినిమా ఎలా ఉందంటే?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion