News
News
X

Panchathantram Release Date : డిసెంబర్‌లో థియేటర్లలోకి 'పంచతంత్రం' - బ్రహ్మానందం చెప్పే కథ వింటారా?

వేద వ్యాస్‌గా ప్రముఖ నటుడు బ్రహ్మానందం చెప్పే కథ వినడానికి మీరు రెడీనా? ఆయనతో పాటు సముద్రఖని, స్వాతి, శివాత్మికా రాజశేఖర్ తదితరులు నటించిన 'పంచతంత్రం' డిసెంబర్‌లో థియేటర్లలో విడుదల కానుంది.

FOLLOW US: 
Share:

బ్రహ్మానందం (Brahmanandam) అంటే వినోదం... వినోదం అంటే బ్రహ్మానందం! కొన్ని సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను తనదైన శైలిలో ఆయన నవ్విస్తూ ఉన్నారు. ఆయన తెరపై కనిపిస్తే ప్రేక్షకుల ముఖం మీద చిరునవ్వు ఆటోమేటిక్‌గా వస్తుంది. మెరుస్తుంది. ఆయన వినోదాత్మక పాత్రలో కాకుండా... అభినయానికి ఆస్కారం ఉన్న పాత్ర చేసిన సినిమా 'పంచతంత్రం' (Panchathantram Movie).

డిసెంబర్‌లో 'పంచతంత్రం' విడుదల!
బ్రహ్మానందంతో పాటు సముద్రఖని, శివాత్మికా రాజశేఖర్ (Shivatmika Rajasekhar), రాహుల్‌ విజయ్‌, నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య, ఆదర్శ్ బాలకృష్ణ ఈ 'పంచ తంత్రం'లో ప్రధాన పాత్రలు పోషించారు. హర్ష పులిపాకను దర్శకుడిగా పరిచయం చేస్తూ అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్‌లో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. 'పంచతంత్రం' చిత్రాన్ని డిసెంబర్ 9న విడుదల చేయనున్నట్లు ఈ రోజు చిత్ర బృందం వెల్లడించింది.  

Panchathantram Release Date Announcment Video : సినిమా విడుదల తేదీని వెల్లడిస్తూ చిత్ర బృందం ఒక వీడియో విడుదల చేసింది. అది చూస్తే... 'పంచ తంత్రం' అని రాసి ఉన్న ఒక క్యాసెట్‌ను బ్రహ్మానందం చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ప్రధాన పాత్రధారులు ఒక్కొక్కరినీ చూపించారు. 

చిత్ర నిర్మాతలు సృజన్‌ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ ''ఆల్రెడీ విడుదల చేసిన ప్రచార చిత్రాలు... విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదలైన పాట 'అరెరే... అరెరే... మాటే రాదే... మనసే పలికే క్షణములో', మరో పాట 'ఏ రాగమో... నన్నే... రమ్మని పిలుస్తున్నదే...'కు మంచి స్పందన లభించింది. సినిమా కూడా అందరినీ ఆకట్టుకుంటుంది'' అని చెప్పారు. దర్శకుడు హర్ష పులిపాక మాట్లాడుతూ ''వేదవ్యాస్ పాత్రలో బ్రహ్మానందం గారు జీవించారు. ఆయనకు, స్వాతి రెడ్డి మధ్య సన్నివేశాలు ఎంతో హృద్యంగా ఉంటాయి. ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేస్తాయి. ఇంకా మిగతా తారలు అందరూ ఎంతో అద్భుతంగా నటించారు. ప్రతి ఒక్కరి పాత్ర బావుంటుంది'' అని అన్నారు. 

Also Read : Balakrishna - Unstoppable 2 Update : వేటకు సిద్ధమైన సింహం - ఈ నెల 14 నుంచి దెబ్బకు థింకింగ్ మారిపోవాలా!

బ్రహ్మానందం కుమార్తెగా స్వాతి!
బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా 'జర్నీ ఆఫ్ వ్యాస్' (Journey Of Vyas - Panchathantram Teaser) పేరుతో ఆయన పాత్రకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. అది చూస్తే... ఆలిండియా రేడియోలో పని చేసి రిటైర్ అయిన వేదవ్యాస్  అనే వ్యక్తి పాత్రలో బ్రహ్మానందం నటించినట్టు అర్థం అవుతోంది. ఆయన కుమార్తెగా స్వాతి రెడ్డి (Colors Swathi Reddy) నటించారు. 

కథల పోటీల నుంచి వేదవ్యాస్ ఎలిమినేట్ అయితే... 'ఎలిమినేట్ అయ్యావా? నేను ముందే చెప్పాను. పార్టిసిపెంట్స్ అందరూ 30 ఏళ్ల కుర్రాళ్ళు అయ్యి ఉంటారు. నీ పాత చింతకాయ కథలు వాళ్ళకు ఏం ఆనతాయి నాన్నా!' అని కుమార్తె (స్వాతి) అంటుంది. 'ఏమ్మా! కెరీర్ అంటే ఇరవైల్లోనే మొదలు పెట్టాలా? అరవైల్లో మొదలు పెట్టకూడదా?' అని బ్రహ్మానందం ప్రశ్నించడం లేటు వయసులో కొత్త కెరీర్ స్టార్ట్ చేయాలని అనుకునే వ్యక్తులు మనోభావాలను ప్రతిబింబించేలా ఉంది. ఈ చిత్రానికి ఎడిటర్‌: గ్యారీ బీహెచ్‌, సినిమాటోగ్రఫీ: రాజ్‌ కె. నల్లి, మాటలు: హర్ష పులిపాక, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి, సహ నిర్మాతలు: రమేష్ వీరగంధం, రవళి కలంగి. 

Also Read : Exposed Web Series Review - ఎక్స్‌పోజ్డ్‌ వెబ్ సిరీస్ రివ్యూ : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పించు... న్యూస్ ప్రజెంటర్ డెత్ మిస్టరీ

Published at : 09 Oct 2022 11:50 AM (IST) Tags: Swathi Reddy Brahmanandam Panchathantram movie Samuthirakani Shivathmika Rajasekhar Panchathantram Release Date Divya Sripada Srividya Panchathantram on December 9

సంబంధిత కథనాలు

Saindhav: గన్నులు, బుల్లెట్లు, బాంబులతో వస్తున్న వెంకటేష్ ‘సైంధవ్’ - రిలీజ్ డేట్ ఫిక్స్!

Saindhav: గన్నులు, బుల్లెట్లు, బాంబులతో వస్తున్న వెంకటేష్ ‘సైంధవ్’ - రిలీజ్ డేట్ ఫిక్స్!

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

Dasara' movie: ‘దసరా’ సినిమా వెనుక 5 ఆసక్తికర విషయాలు, తెలిస్తే మిస్ చేయకుండా చూస్తారు!

Dasara' movie: ‘దసరా’ సినిమా వెనుక 5 ఆసక్తికర విషయాలు, తెలిస్తే మిస్ చేయకుండా చూస్తారు!

Priyanka Chopra: పెళ్లికి ముందే అండాలను దాచిపెట్టాను, అమ్మే అలా చేయమంది: ప్రియాంక చోప్రా

Priyanka Chopra: పెళ్లికి ముందే అండాలను దాచిపెట్టాను, అమ్మే అలా చేయమంది: ప్రియాంక చోప్రా

Shaakuntalam in 3D: 3Dలో ‘శాకుంతలం’ - ఐమ్యాక్స్‌లో ట్రైలర్ చూసి, ప్రేక్షకులు ఫిదా

Shaakuntalam in 3D: 3Dలో ‘శాకుంతలం’ - ఐమ్యాక్స్‌లో ట్రైలర్ చూసి, ప్రేక్షకులు ఫిదా

టాప్ స్టోరీస్

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం  - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి