Brahmamudi April 17th: అపర్ణతో రానని తెగేసి చెప్పిన రాజ్- స్వప్న రాకతో కావ్య కష్టాలు మరింత పెరగనున్నాయా?
కావ్య, రాజ్ పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
స్వప్న రోడ్డు మీద నడుస్తూ ఉండగా అపర్ణ వాళ్ళు వచ్చి కృష్ణమూర్తి ఇంటి అడ్రెస్ అడుగుతారు. అదే ఇల్లని చూపిస్తుంది. రాజ్ నేల పడుకుని నొప్పి అంటూ అల్లాడిపోతూ ఉంటాడు. నా పెళ్ళాం లాగే ఇది కూడా అల్లాడించేస్తుందని తిట్టుకుంటాడు. బామ్ రాయమంటారా అంటే వద్దని అంటాడు. కావ్య బనియన్ తీయమంటే ఆహా తీయనని చెప్తాడు. కావ్య బలవంతంగా బామ్ రాస్తుంది. ఇప్పుడే ఇంత టార్చర్ పెడుతుంది ఇక పెళ్ళాంగా ఒప్పుకుంటే ఇంకెంత టార్చర్ పెడుతుందోనని మనసులో అనుకుంటాడు. మళ్ళీ ఇద్దరి మధ్య ఫస్ట్ నైట్ రోజు జరిగిన విషయం గుర్తు చేసుకుంటారు. తాగిన మైకంలో వచ్చి ఈ అని నవ్వి లైట్ ఆన్ చేశారని చెప్తుంది. ఓ వర్షం కురవని రాత్రి అంటూ విషయం చెప్పకుండా కావాలని ఉడికిస్తుంది.
అపర్ణ వాళ్ళు కనకం ఇంటికి వస్తారు. ఆ ఇల్లు చూసి రుద్రాణి మనసులో సంబరపడుతుంది. అపర్ణ ఇంట్లోకి అడుగుపెట్టగానే రాజ్ నేల మీద ఉండటం చూసి షాక్ అవుతుంది. చక్కలి గిలిగా ఉందని నవ్వుతూ ఉంటాడు. అయిపోయింది నా కొడుకుని బుట్టలో వేసుకుందని అపర్ణ అంటే ఇక నీ మాట ఏం వింటాడని రుద్రాణి రెచ్చగొడుతుంది. రాజ్ అని గట్టిగా అరిచేసరికి అందరూ అపర్ణని చూస్తారు.
Also Read: రామాని షూట్ చేసిన మనోహర్ - జానకి మీద ద్వేషం పెంచుకున్న జ్ఞానంబ
అపర్ణ: రాజ్ ఏంటి ఇది వాడికి ఏమైనా అయితే మేమంతా ఏమైపోవాలి. నేను నా కొడుకుని తీసుకెళ్లడానికి వచ్చాను. ఈ అగ్గిపెట్టె కొంపలో వాడు ఉండలేడు. రాజ్ పడి దెబ్బ తగిలించుకుని మాతో మాట కూడ చెప్పవా. ఇక్కడికి వచ్చి వీళ్ళు పెట్టె అడ్డమైన గడ్డి తిని ఉంటున్నావా?
రాజ్: మమ్మీ నేను పడినట్టు ఎవరు చెప్పారు
కావ్య; నేనే చెప్పాను మీరు ఇక్కడ ఉంటే ఇబ్బంది పడుతున్నారని చెప్పాను
రాజ్: నేను వెళ్లిపోతే స్వప్నని పిలిపించవచ్చని అనుకుంటుంది. ఈ రాత్రికి స్వప్నని ఎలాగైనా పట్టుకోవాలని మనసులో అనుకుని సోరి మమ్మీ రేపు మార్నింగ్ వస్తానని అనేసరికి అపర్ణ మొహం మాడిపోతుంది.
అపర్ణ: అక్కడ అవమానించి ఇక్కడికి వచ్చావ్ మళ్ళీ ఇక్కడ అవమానిస్తున్నావ్. వీళ్ళు నిన్ను బుట్టలో పడేస్తారని అనుకున్నా. కన్నతల్లి కంటే వీళ్ళే ఎక్కువ అయిపోయారు కదా అని బాధగా వెళ్ళిపోతుంది.
స్వప్న రోడ్డు పక్కన చాటుగా నిలబడి వాళ్ళు వెళ్ళిపోవడం చూస్తుంది. అక్కడే ఉన్న అమ్మలక్కలు అంతా కావ్య అదృష్టం మనసున్న మనిషి భర్తగా వచ్చాడని మాట్లాడుకోవడం స్వప్న విని రగిలిపోతుంది. ఎవడిని నమ్మి మోసపోయిందో ముష్టిదానిలా ఎక్కడెక్కడ తిరుగుతుందోనని తిట్టుకుంటారు. ఇదంతా కావ్య వల్లే అమ్మని దారిలోకి తెచ్చుకుని నీ మోసాన్ని తిప్పి కొడతానని అనుకుంటుంది.
Also Read: తప్పించుకున్న ప్రియ, నిజం తెలుసుకున్న నందు- కూతురి పెళ్లి ఆపగలుగుతాడా?
ఇంత బాగా ఎలా అబద్దం ఆడావని కృష్ణమూర్తి కూతుర్ని అడుగుతాడు. అమ్మలాగా అబద్ధం చెప్పాలని అనుకుంది కానీ కుదరలేదు నిజమే బతికిందని కనకం ఎమోషనల్ అవుతుంది. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ధైర్యంగా నిలబడ్డాను. నా తప్పు ఏమి లేదని నేను నిరూపించుకుంటాను. వాళ్ళందరినీ మార్చుకుంటానని కావ్య చెప్తుంది. ఆ మాటలు విని కనకం కుమిలి కుమిలి ఏడుస్తుంది.