X

Prabhas New Look: ప్రభాస్ లుక్‌ చూసి అంతా షాక్.. ‘అంకుల్’ అంటూ నెటిజనులు ట్రోలింగ్

వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్...మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఈ డైలాగ్ చెప్పడమే కాదు..రియల్ గా కూడా ప్రభాస్ ఇలాగే ఉంటాడట. ఇలాంటి హీరోపై నార్త్ ఆడియన్స్ నెగిటివ్ ట్రోల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

FOLLOW US: 

బాహుబలి మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ తర్వాతి నుంచి వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ చాలా బిజీ అయిపోయాడు. ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఒక్కో మూవీలో ఒక్కో గెటప్ తో కనిపించనున్నాడు.  'ఆదిపురుష్' షూటింగ్ కోసం ప్రస్తుతం ప్రభాస్ ముంబైలో ఉన్నాడు. అయితే డ్యాన్స్ రిహార్సల్స్ కోసం స్టూడియోకి వెళ్తున్న ప్రభాస్ కెమెరాలకు చిక్కాడు. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో మేకప్ లేకుండా  ఉన్న ప్రభాస్ లుక్స్ చూసి రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇదే అవకాశంగా చేసుకున్న కొందరు బాలీవుడ్ ప్రేక్షకులు పనిగట్టుకుని ప్రభాస్ లుక్స్‌పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: ‘చెప్పు తెగుద్ది వె*వ’.. అమెరికా అధ్యక్షుడిపై హీరో నిఖిల్ ఆగ్రహం, ఎందుకంటే..

ప్రభాస్ దాదాపు 50 ఏళ్ల మేనమామలా కనిపిస్తాడని.. మేకప్ లేకుండా చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ప్రభాస్ అంకుల్‌లా కనిపిస్తున్నాడని మరొకరు, మిల్క్ మ్యాన్‌లా ఉండాల్సిన వ్యక్తి ముసలాడిలా అయ్యాడని మరొకడు ట్రోల్ చేశారు. ఈ ట్వీట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

Also Read: బుల్లెట్ బండి.. భలే దూసుకెళ్తోంది, ఇంతకీ ఎవరీ మోహన భోగరాజు?

సాధారణంగా  ఉత్తరాది ప్రేక్షకులు సౌత్ హీరోల లుక్స్, ఫిజిక్ ని ట్రోల్ చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా చాలాసార్లు ఇలా వ్యవహరించారు. ఆ కామెంట్స్‌ని సవాలుగా తీసుకుని అల్లు అర్జున్, నితిన్ లాంటి హీరోలు టాలీవుడ్‌లో తొలిసారిగా సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ చేసి ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత ఈ ట్రెండ్ చాలామంది ఫాలో అయ్యారు.. ఇప్పటికీ ఆ ట్రెండ్ కొనసాగుతోంది కూడా.

Also Read: వ్యాపారం మొదలుపెట్టిన కీర్తి సురేష్.. మహానటి ప్లానింగ్ అదుర్స్!

అయితే తాజాగా ప్రభాస్‌ను ట్రోల్ చేస్తున్న ఉత్తరాది ప్రేక్షకులకు దక్షిణాది అభిమానులు ధీటుగా కౌంటర్లు వేస్తున్నారు. ఒకేసారి రెండు సినిమాలు చేస్తేనే లుక్‌లో  మార్పులుంటాయి.. అలాంటిది ఒకేసారి నాలుగు ప్రాజెక్టులంటే రెస్ట్ లేకుండా పనిచేయడమే కదా. అలాంటప్పుడు లుక్ లో కొంత మార్పు వచ్చినంత మాత్రాన ఇంత ట్రోల్స్ అవసరమా? అని దక్షిణాది అభిమానులు అంటున్నారు. ప్రభాస్ స్టామినా ఏంటో ఇండియన్ బాక్సాఫీస్‌కు ఇప్పటికే చూపించాడని, తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన తనకేం నష్టం లేదంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ‘‘వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు’’ అని మిర్చిలో ప్రభాస్ డైలాగుతో కౌంటర్ ఇస్తున్నారు. ప్రస్తుతానికి ప్రభాస్ ఆదిపురుష్, సలార్, రాథేశ్యామ్ తో పాటూ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్టుకు కమిటయ్యాడు. 

Also Read: హాస్పిటల్‌లో సంజన గల్రానీ.. దేవుడిపైనే భారమంటున్న రాగిణి ద్వివేది

Also Read: జాన్వీ కపూర్.. ఈమె అందాలు చూస్తే ‘అమ్మ బ్రహ్మదేవుడో..’ అనాల్సిందే!

Tags: Prabhas Salar Bollywood Audience Negative Comments On Young Rebal Star Prabhas New Look Aadhipurush Radhe Syam

సంబంధిత కథనాలు

Dwayne Bravo Pushpa Dance: గ్రౌండ్‌లో శ్రీవల్లి అంటూ అలరించిన బ్రేవో.. పుష్ప ఫీవర్ ఇప్పట్లో ‘తగ్గేదే లే’!

Dwayne Bravo Pushpa Dance: గ్రౌండ్‌లో శ్రీవల్లి అంటూ అలరించిన బ్రేవో.. పుష్ప ఫీవర్ ఇప్పట్లో ‘తగ్గేదే లే’!

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Nagarjuna: అవన్నీ పుకార్లే... నేను అలా అనలేదు! - నాగార్జున క్లారిటీ

Nagarjuna: అవన్నీ పుకార్లే... నేను అలా అనలేదు! - నాగార్జున క్లారిటీ

Stars Social Talk: దుబాయ్‌లో బన్నీ... స్విస్‌లో స‌మంత‌... బికినీలో దిశా, మాళవిక... రష్యాలో రాశీ ఖన్నా!

Stars Social Talk: దుబాయ్‌లో బన్నీ... స్విస్‌లో స‌మంత‌... బికినీలో దిశా, మాళవిక... రష్యాలో రాశీ ఖన్నా!

Samantha Naga Chaitanya Divorce సమంత-చైతూ విడాకులపై నాగార్జున వ్యాఖ్యలు.. ఇందులో నిజమెంత?

Samantha Naga Chaitanya Divorce సమంత-చైతూ విడాకులపై నాగార్జున వ్యాఖ్యలు.. ఇందులో నిజమెంత?
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Covid Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌పై సర్కార్ కీలక ప్రకటన.. ఇక వారు కూడా అర్హులే

Covid Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌పై సర్కార్ కీలక ప్రకటన.. ఇక వారు కూడా అర్హులే

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Snake Vs Hen: గుడ్ల కోసం వచ్చిన పాముతో కోడి ఫైటింగ్.. చివరికి ఏమైందో చూడండి

Snake Vs Hen: గుడ్ల కోసం వచ్చిన పాముతో కోడి ఫైటింగ్.. చివరికి ఏమైందో చూడండి

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ