Nikhil on Joe Biden: ‘చెప్పు తెగుద్ది వె*వ’.. అమెరికా అధ్యక్షుడిపై హీరో నిఖిల్ ఆగ్రహం, ఎందుకంటే..
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నా ఎప్పుడు హద్దులు దాటని యంగ్ హీరో నిఖిల్.. అనూహ్యంగా చేసిన ట్వీట్ సంచలనమే కాదు.. హాట్ టాపిక్ అయింది.
హీరో నిఖిల్‌కు కోపం వచ్చింది. ఏకంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను తిట్టేంత ఆగ్రహం వచ్చేసింది. మళ్లీ మాట్లాడితే.. చెప్పు తెగుద్ది వె*వ అంటూ తిట్ల పురాణం అందుకున్నాడు. ఇంతకీ నిఖిల్‌కు అంత కోపం ఎందుకు వచ్చింది?
ఆఫ్గాన్లు ఎదుర్కొంటున్న నరకాన్ని చూసి విపరీతమైన వేదనకు గురైన నిఖిల్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘‘స్వేచ్ఛా ప్రపంచం అనే దానికి ఉదాహరణ అమెరికా. కానీ.. అదిప్పుడు పోయింది. 21 ఏళ్లుగా ఎన్నో కష్టాలు పెట్టారు. ఇప్పుడు ఇలా పారిపోయారు. నువ్వు ఇంకెప్పుడైనా స్వాతంత్య్రం గురించి మాట్లాడితే.. జో బిడెన్ చెప్పు తెగుద్ది వె*వ’’ అంటూ ఫైరయ్యాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నిఖిల్ ఇప్పటివరకు ఏ సినీ హీరో చేయని సాహసంతో తన మనసులోని మాటను సూటిగా చెప్పేశాడనే చెప్పాలి. అధ్యక్షుడి స్థానంలో ఉన్న వ్యక్తిని అలా తిట్టడం మంచిది కాదని కొందరు నిఖిల్‌కు హితవు పలుకుతున్నారు. ఇరవై ఏళ్ల క్రితం ఆఫ్గాన్లను తాలిబన్ల నుంచి విముక్తి కల్పిస్తామని చెబుతూ.. అడగకుండానే ఆ దేశంలో అడుగు పెట్టి.. సైన్యంతో తమ ప్రతాపాన్ని చూపించి.. ఇప్పుడు సమయం చూసుకొని ఆఫ్గాన్ నుంచి తమ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటామని చెప్పటం, ఆ వెంటనే తాలిబన్లు చెలరేగిపోతూ.. దేశాన్ని తమ ఏలుబడిలోకి తీసుకోవటం తెలిసిందే.తొలుత తాము ఎవరికి ఎలాంటి అపకారం చేయమని చెప్పిన వారు.. అందుకు భిన్నంగా హింసాత్మక చర్యలకు పాల్పడటమేకాదు.. తమ ప్రత్యర్థులని భావించిన వారిని.. తమ మాటల్ని వినని వారిని ఊచకోత కోసేస్తున్నారు. దీంతో ఆఫ్గాన్లు తీవ్ర భయాందోళనకు గురై.. వేర్వేరు దేశాలకు వెళ్లిపోతున్నారు. దీనికి సంబంధించిన వార్తలు, అక్కడి పరిస్థితులు కళ్లకు కట్టేలా వస్తున్న వేళ అమెరికా తీరుపై పలువురికి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Also Read: బుల్లెట్ బండి.. భలే దూసుకెళ్తోంది, ఇంతకీ ఎవరీ మోహన భోగరాజు?
సక్రమంగా ఉండే వ్యవస్థను ఎవరైనా పాడుచేస్తే మనకెవరికైనా చాలా కోపం వస్తుంది. కొందరు కోపాన్ని ప్రదర్శించరు. అయితే కొందరు తమ కోపాన్ని బహిరంగంగానే చూపిస్తారు. ఈ రెండు కోవకు చెందిన వ్యక్తి హీరో నిఖిల్. అందుకే తన కోపాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు నిఖిల్. ఈ ట్వీట్ పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ప్రీ-రివ్యూ: శ్రీదేవి సోడా సెంటర్ vs ఇచ్చట వాహనాలు నిలుపరాదు, ఏది బెస్ట్?
Also Read: వ్యాపారం మొదలుపెట్టిన కీర్తి సురేష్.. మహానటి ప్లానింగ్ అదుర్స్!
Also Read: హాస్పిటల్‌లో సంజన గల్రానీ.. దేవుడిపైనే భారమంటున్న రాగిణి ద్వివేది