By: ABP Desam | Updated at : 28 Aug 2021 06:10 PM (IST)
గాయపడిన ప్రియాంకా చోప్రా
షూటింగ్స్ లో హీరో-హీరోయిన్లు గాయపడడం అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. రిస్కీ స్టంట్స్ చేసేటప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకిఇదే పరిస్థితి ఎదురైంది. ఓ హాలీవుడ్ సిరీస్ కోసం సాహసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నుదురు చిట్లి రక్తం కారుతోంది. అలాగే బుగ్గపై గాటుపడింది. అదే సమయంలో మరో ఫొటోని దానికి యాడ్ చేసిన ప్రియాంక చోప్రా…ఏది నిజమైన గాయం..ఏది ఫేక్ గాయమో గుర్తించండని అడిగింది.
కొందరైతే చెంపపై ఉన్న గాయం నిజం..నుదిటిపై ఉన్నది కాదని చెప్పగానే ప్రియాంగా వెంటనే స్పందించింది. రాంగ్ ఆన్సర్ అంటూ ముఖం క్లోజప్ ఫొటో షేర్ చేసింది. ఫోటోలో ప్రియాంక కనుబొమ్మపై కోసుకుపోయినట్టు కనిపిస్తోంది. అయితే అస్సలు గాయం గురించి పట్టించుకోని పిగ్గీచాప్స్ షూటింగ్ కొనసాగించింది. ఈ యాక్షన్ సిరీస్ కి గతంలో `ఎవెంజర్స్ ఎండ్ గేమ్`కు దర్శకవిభాగంలో సాయపడిన రస్సో బ్రదర్స్ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.
Also Read: ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా చూసిన మహేశ్ బాబు.. సుధీర్ బాబు టెన్షన్!‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా చూసిన మహేశ్ బాబు.. సుధీర్ బాబు టెన్షన్!
Also Read:పుష్ప రాజ్‌ని ఢీ కొట్టబోతోన్న IPS భన్వర్ సింగ్ షెకావత్.. తగ్గేదే లే అన్నట్టున్న ఫహద్ ఫస్ట్ లుక్..
అందం, అభినయంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ప్రియాంక హాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకగుర్తింపును సంపాదించుకుంది. అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లిచేసుకున్నాక ఎక్కువగా అమెరికాలోనే ఉంటోంది. ‘సిటాడెల్’ తో పాటూ టామ్ క్రూయిస్ “మిషన్ ఇంపాజిబుల్ 7″లో కూడా నటిస్తోంది. కత్రినా కైఫ్, అలియా భట్ లతో కలిసి “జీ లే జారా” చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపార రంగంలోనూ సత్తాచాటుకుంటోంది. న్యూయార్క్‌లో సోనా పేరుతో రెస్టారెంట్‌ను స్టార్ట్ చేసింది. ఈ విలాసవంతమైన రెస్టారెంట్‌లో అనేక రకాల భారతీయ వంటకాలు రుచి చూపిస్తున్నారు.
Also Read:అఖిల్-పూజాహెగ్డే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వచ్చేస్తోంది.. విడుదల తేదీ ఖరారు
Also Read: పవర్ స్టార్‌తో బుట్టబొమ్మ.. ఆ దర్శకుడితో మూడోసారి.. పూజా హెగ్డేకు గోల్డెన్ ఛాన్స్!
Also Read: గాయకుడు-నటుడు యోయో సింగ్ పై ఢిల్లీ కోర్టులో గృహహింస కేసు
Bindu Madhavi: ‘నువ్వు టైటిల్‌కు అర్హురాలివి’ ఆడపులికి సపోర్ట్ చేస్తున్న పాయల్
F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్
Sanjanaa Galrani: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంజన గల్రానీ
Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?
NTR30: బన్నీ నో చెప్పిన కథలో ఎన్టీఆర్ నటిస్తున్నారా?
Disha Fake Encounter : దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకం, సిర్పూర్కర్ కమిషన్ నివేదికలో సంచలన విషయాలు
Konaseema Name Change: అట్టుడుకుతున్న కోనసీమ, జిల్లా పేరు మార్చవద్దని ఆందోళన ఉధృతం - పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మాహత్యాయత్నం
Afghan Taliban Rules : టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే - తాలిబన్ల కొత్త రూల్ !
Allegations On Jeevita : జీవిత ప్రమాదకరమైన లేడీ - డబ్బులు ఎగ్గొట్టి ఆరోపణలు చేస్తున్నారన్న గరుడవేగ నిర్మాతలు !