By: ABP Desam | Updated at : 28 Aug 2021 01:04 PM (IST)
పుష్ప విలన్ ఫహద్ ఫస్ట్ లుక్
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప మూవీలో విలన్ గా మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ట్రాన్స్ , అనుకోని అతిథి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఫహద్ ఫాజిల్ పుష్పలో విలన్ అనగానే బన్నీ ఫ్యాన్స్ కి పూనకాలే వచ్చాయి. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద తగ్గేదే లే అన్నట్టుంటుంది. అలాంటింది బన్నీ-లెక్కల మాస్టారుతో పాటూ ఫహద్ ఫాజిల్ అనగానే సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి.
#Pushpa vs BHANWAR SINGH SHEKHAWAT (IPS) 🔥🔥🔥#PushpaTheRise #ThaggedheLe 🤙 pic.twitter.com/MIEGpMF2Sf
— Mythri Movie Makers (@MythriOfficial) August 28, 2021
తాజాగా పుష్పరాజ్ తో ఢీ కొట్టబోతున్న IPS భన్వర్ సింగ్ షెకావత్ అంటూ ఫహద్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్. గుండు మీద గాటుతో పోలీస్ స్టేషన్ లో టేబుల్ మీద చేతులు ఉంచి తీక్షణంగా చూస్తున్నాడు IPS భన్వర్ సింగ్. చూస్తుంటే తగ్గేదే లే అనే డైలాగ్ బన్నీతో పాటూ ఫహద్ కి కూడా వర్తిస్తుందేమో అన్నట్టుంది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ - టీజర్ తో పాటూ దాక్కో దాక్కో మేక సాంగ్ సినిమాపై అంచనాలు పెంచాయనే చెప్పాలి.
'పుష్ప' మూవీలో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, ధనుంజయ్, అజయ్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పుష్పకి సంగీత దర్శకుడు. పాన్ ఇండియా స్థాయిలో రెండు పార్టులుగా విడుదల చేయనున్నారు. ఫస్ట్ పార్ట్ ని ''పుష్ప: ది రైజ్'' పేరుతో ఈ ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే 'పుష్ప-1' కు సంబంధించిన మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి అయింది. ముత్యంశెట్టి మీడియా తో కలసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
అఖిల్-పూజాహెగ్డే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వచ్చేస్తోంది.. విడుదల తేదీ ఖరారు
పుష్ప రిలీజ్ కాకముందే ఫహద్ కి టాలీవుడ్ లో ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇప్పటికే స్టార్ హీరోలసినిమాలు వరుస ఆఫర్లొస్తున్నాయని సమాచారం. ఏదమైనా ఫుష్పలో IPS భన్వర్ సింగ్ షెకావత్ గా ఫహద్ విశ్వరూపం ఎలా ఉండబోతోందో చూడాలి.
Also Read: పవర్ స్టార్‌తో బుట్టబొమ్మ.. ఆ దర్శకుడితో మూడోసారి.. పూజా హెగ్డేకు గోల్డెన్ ఛాన్స్!
Also Read: గాయకుడు-నటుడు యోయో సింగ్ పై ఢిల్లీ కోర్టులో గృహహింస కేసు
Also Read: దసరాకి థియేటర్లలో మహాసముద్రం..గన్ తో ఒకర్నొకరు బెదిరించుకుంటున్న శర్వానంద్-సిద్దార్థ్
Bigg Boss 7 Telugu: అమర్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు - నాగార్జున ముందే నిజాన్ని బయటపెట్టిన ప్రియాంక
‘సలార్’పై కొత్త డౌట్స్, ‘యానిమల్’ వసూళ్ల వర్షం - నేటి టాప్ సినీ విశేషాలివే!
Shouryuv: ‘హాయ్ నాన్న’కు నాగార్జున సినిమాకు సంబంధం లేదు - దర్శకుడు శౌర్యువ్ ఇంటర్వ్యూ
Tripti Dimri: 'యానిమల్' బోల్డ్ సీన్తో పాపులారిటీ - ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?
Avika gor: ఇప్పటి 20 సార్లు పెళ్లి చేసుకున్నా అస్సలు బోర్ కొట్టలేదు - అవికా గోర్
తెలంగాణలో రేపే కౌంటింగ్-ఉదయం 10గంటల్లోగా తొలి ఫలితం
Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు
Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు
Alia Bhatt Rashmika: క్రష్మిక క్లబ్లో ఆలియా భట్ - భర్తను వదిలేసింది ఏంటి?
/body>