అన్వేషించండి

Yashmi Gowda Vs Naga Manikanta: శ్రీముఖి, రాహుల్ బాటలో మణికంఠ, యష్మి గౌడ... బిగ్ బాస్ చరిత్రను రిపీట్ చేయబోతున్నారా?

Bigg Boss 8 Telugu: ఇప్పటి నుంచి ప్రతీ వారం నిన్ను నామినేట్ చేస్తాను అని యష్మి గౌడ నాగ మణికంఠతో చెప్పిన డైలాగ్ గత సీజన్లలో శ్రీముఖి, రాహుల్ సింప్లిగంజ్ మధ్య జరిగిన డిస్కషన్ ను గుర్తు చేసింది.

బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టేవారు ముందుగానే గత సీజన్లు అన్నీ చూసి బాగా ప్రిపేరవుతారు. అయితే కొన్ని సీన్లు మాత్రం అనుకోకుండా రిపీట్ అవుతూ ఉంటాయి. తాజాగా నాగ మణికంఠ, యష్మి గౌడ మధ్య జరిగిన గొడవను చూస్తే బిగ్ బాస్ చరిత్ర రిపీట్ కాబోతోందా అనే అనుమానం కలుగుతుంది. అయితే ఒకవేళ అదే జరిగితే ఇందులో యష్మి కంటే నాగ మణికంఠకే ఎక్కువ లాభం ఉంటుంది. నాగ మణికంఠ, యస్మి మధ్య జరిగిన గొడవ ఏంటి ? రిపీట్ కాబోతున్న ఆ చరిత్ర ఏంటి? అనే వివరాల్లోకి వెళితే... 

శ్రీముఖి, రాహుల్ బాటలో యష్మి గౌడ, మణికంఠ 
బిగ్ బాస్ మూడో వారం నామినేషన్లలో భాగంగా యష్మి గౌడ, నాగ మణికంఠ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తాజాగా మూడవ వారం నామినేషన్లు లాన్ ఏరియాలో జరగగా, అక్కడ షో మేకర్స్ ట్రాష్ ఏరియాను ఏర్పాటు చేశారు. ఈసారి నామినేషన్ల కోసం ట్రాష్ బిన్ థీమ్ ను తీసుకున్న బిగ్ బాస్ చెత్త వేసి తాము నామినేట్ చేయాలనుకున్న వారిని నామినేట్ చేయాలని సూచించారు. ఈ నామినేషన్ల సమయంలోనే నాగ మణికంఠ వర్సెస్ యష్మి గౌడ అన్నట్టుగా మారింది పరిస్థితి. యష్మి గౌడ, నాగ మణికంఠల మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా, యష్మి గౌడ ఆవేశంలో తను ఇంట్లో ఉన్నంత వరకు నాగ మణికంఠనే నామినేట్ చేస్తానని శపథం చేసింది. అయితే సీజన్ 3 లో ఇలాగే శ్రీముఖి, రాహుల్ సింప్లిగంజ్ ను వరుసగా నామినేట్ చేసింది. ఆ తర్వాత కూడా పలు సీజన్లలో ఇదే జరిగింది. అయితే ఇప్పుడు యష్మి గౌడ, నాగ మణికంఠ మధ్య ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? లేక స్ట్రాటజీనా ? అనే అనుమానం కలుగుతోంది. 

Read Also : Bigg Boss Telugu 8 Day 15 Promo 2: నీది ఎమోషన్ అయితే నాది మోషనా అంటున్న పృథ్వీ, సోనియా క్లాన్ పై ఇంట్రెస్ట్ పెట్టలేదా?

ఇప్పుడు యష్మి గౌడ, మణికంఠని సీజన్ మొత్తం నామినేషన్ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగానే సీజన్ 2లో గీతా మాధురి, కౌశల్ ని నామినేట్ చేసింది. సీజన్ 3 లో శ్రీముఖి, రాహుల్ సింప్లిగంజ్ ను నామినేట్ చేసింది. సీజన్ 5లో ప్రియా.. వీజే సన్నీని నామినేట్ చేసింది. అయితే ఈ 2, 3, 5 సీజన్లలో కంటిన్యూగా నామినేట్ అయిన ముగ్గురు కంటెస్టెంట్స్ కౌశల్, రాహుల్ సింప్లిగంజ్, వీజే సన్నీ బిగ్ బాస్ విజేతలుగా నిలిచారు. ఒకవేళ ఇప్పుడు కూడా ఇదే సెంటిమెంట్ రిపీట్ అయ్యి ఈ యష్మి గౌడ కారణంగా నాగ మణికంఠ విన్నర్ అయితే గనక బిగ్ బాస్ చరిత్ర రిపీట్ అయినట్టే. మరి గతంలో ఆ ముగ్గురు విషయంలో పని చేసిన సింపతి కార్డు నాగమణి కంఠకు వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి. ఎందుకంటే నాగ మణికంఠ మొదటి వారం మొత్తం ఏడుపుతోనే లాక్కొచ్చాడు. ఇప్పుడిప్పుడే తనలో ఉన్న ఫైర్ ని బయట పెడుతున్నాడు. ఇలాంటి టైంలో మళ్లీ యష్మి గౌడ అతన్ని టార్గెట్ చేస్తూ సీజన్ మొత్తం నామినేట్ చేస్తాను అని చెప్పడంతో జనాలకు అతనిపై సింపతీ పెరిగే అవకాశం లేకపోలేదు. అయితే ప్రస్తుతం ఆయనకు గట్టి సపోర్ట్ లభిస్తుంది కాబట్టి ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయినా అవ్వచ్చేమో.

Read Also :Sekhar Basha: ఎలిమినేషన్ వెనకున్న కారణం ఇదే - సీక్రెట్ బయట పెట్టేసిన శేఖర్ బాషా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Rohini: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగంఅడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Rohini: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Telugu TV Movies Today: ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
Crime News: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం- బీటెక్ స్టూడెంట్, వివాహిత అఫైర్-  భార్య ఎదుటే ప్రియుడ్ని చితక్కొట్టారు!
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం- బీటెక్ స్టూడెంట్, వివాహిత అఫైర్- భార్య ఎదుటే ప్రియుడ్ని చితక్కొట్టారు!
Embed widget