అన్వేషించండి

Bigg Boss Telugu 8 Day 15 Promo 2: నీది ఎమోషన్ అయితే నాది మోషనా అంటున్న పృథ్వీ, సోనియా క్లాన్ పై ఇంట్రెస్ట్ పెట్టలేదా?

బిగ్ బాస్ సీజన్ 8 డే 15కు సంబంధించిన రెండవ ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. అందులో సోనియా, యష్మి గౌడ.. నబిల్, ప్రేరణ.. సీత, పృథ్వీల సాగిన నామినేషన్ డిస్కషన్ హీటు పెంచేసింది.

బిగ్ బాస్ హౌస్ ఈరోజు నామినేషన్లతో ఎంతగా హీట్ ఎక్కబోతుంది అనే విషయాన్ని ప్రోమోల ద్వారా తెలియజేసి, ఈరోజటి ఎపిసోడ్ పై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఒక్కో ప్రోమోలో కంటెస్టెంట్స్ ఏ రకంగా వాదించుకున్నారు అనే విషయాన్ని చూపించి క్యూరియాసిటీని పెంచేశారు. నిజానికి ఈ సీజన్ ఎక్కువగా గొడవలతోనే నడుస్తోంది. ఇక మూడవ వారం నామినేషన్లలో అయితే కంటెస్టెంట్స్ ఒకరికొకరు యాటిట్యూడ్ తో సమాధానం చెబుతూ రెచ్చిపోయారు. చీఫ్ పదవి పోయిన తర్వాత కూడా యష్మి యాటిట్యూడ్ రవ్వంత కూడా మార్చుకోకపోవడంతో ఆమెని అందరూ టార్గెట్ చేశారు. 

చెత్త నామినేషన్లు... పృథ్వీ, నిఖిల్ పైనే సోనియా ఇంట్రెస్ట్ 

ఈ వారం నామినేషన్లలో ట్రాష్ బిన్ థీమ్ ను తీసుకున్న బిగ్ బాస్ ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ల నెత్తిన చెత్త పోసి రీజన్ చెప్పాలని చెప్పారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో "కొత్త పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా" అని నైనిక ప్రశ్నించగా, "సేమ్ పాయింట్స్" అంటూ పృథ్వీ సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత నైనిక, యష్మి గౌడ.. సోనియాను టార్గెట్ చేశారు. ముందుగా నైనిక "మీరు అసలు నాకు ఇప్పుడు పోటీగానే అనిపించట్లేదు" అని చెప్పగా, యష్మి మాట్లాడుతూ "నిఖిల్, పృథ్వీ, అభయ్ మీద నువ్వు చూపించిన ఇంట్రెస్ట్ లో క్లాన్ పై చూపించలేదు" అంటూ సోనియాకు ఇచ్చి పడేసింది. ఆ తర్వాత విష్ణు ప్రియ "నీకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం కూడా వేస్ట్" అని అన్నట్టుగా చూపించారు. కానీ ఆమె ఎవరిని అన్నది అనే విషయాన్ని చూపించలేదు. ఇక నైనిక.. సోనియాను నామినేట్ చేయగా, పృథ్వి.. నైనికాను నామినేట్ చేసినట్టుగా ప్రోమోలో చూపించారు. ఆ తర్వాత "ఎవ్వరూ సపోర్ట్ చేయని టైంలో నేను నీకు సపోర్ట్ చేశాను" అని ఆదిత్య ఓం మణికంఠతో చెప్పారు. "నేనెప్పుడూ నేనెప్పుడూ మీ దగ్గరికి వచ్చి నన్ను పొగడండి అని అడగలేదు" అని మణికంఠ సమాధానం చెప్పాడు. ఆ తర్వాత యష్మి "నాకు పర్సనల్ గా నువ్వు ఈ హౌస్ కి చాలా డేంజర్ అనిపిస్తోంది" అంటూ మణికంఠ మొహం మీద చెప్పింది. 

Read Also :Sekhar Basha: ఎలిమినేషన్ వెనకున్న కారణం ఇదే - సీక్రెట్ బయట పెట్టేసిన శేఖర్ బాషా

కిరాక్ సీత వర్సెస్ ప్రేరణ..  సీతకు పృథ్వీ కిరాక్ రిప్లై 

ఆ తర్వాత ప్రేరణ "నీ ఎమోషన్ లెవెల్ ఎక్కడికో పోతుంది" అని స్టార్ట్ చేయగానే, సీత అందుకుని "ఆ ఎమోషన్స్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాయి. ఆ ఎమోషన్స్ తోనే గెలిచాను" అని చెప్పింది. ఆ తర్వాత పృథ్వీ వచ్చి "నీ టియర్ ఎమోషన్, మరి నా ఎమోషన్ మోషనా?" అంటూ వెరైటీ లాజిక్ తీశాడు. నెక్స్ట్ సీన్లో కిరాక్ సీత "100 సార్లు నీతోనే గేమ్ ఆడతాను" అని స్ట్రాంగ్ గా చెప్పగా, యష్మి మాత్రం "నువ్వు గేమ్ ఆడట్లేదు. అందుకే నామినేట్ చేస్తున్నావ్ రా" అని చెప్పింది. ఇక ఆ తర్వాత నైనిక "స్టార్టింగ్ నుంచి సంచాలక్ గా నీకు క్లారిటీ ఉంటే గేమ్ వేరేగా ఉండేది" అని యష్మి గౌడను నామినేట్ చేసింది. కానీ ఆమె మాత్రం ఒప్పుకోకుండా "నీ కంఫర్ట్ కోసం ఆడడానికి నేను ఇక్కడికి రాలేదు" అంటూ ఇచ్చి పడేసింది. అయితే ప్రేరణ.. విష్ణు ప్రియను నామినేట్ చేయగా, చెత్త పోసాక "బ్రెయిన్ లెస్ పీపుల్" అంటూ విష్ణుప్రియ కామెంట్ చేసింది. దానికి ప్రేరణ "యూస్ లెస్ పీపుల్" అని సమాధానం ఇచ్చింది. ఇక ఆ తర్వాత సోనియాకు "అవును నాకు బుర్ర లేదని అనుకోండి" అంటూ సమాధానం చెప్పింది యష్మి. "ఎమోషన్స్ ఉంది అన్నానా" అంటూ ప్రేరణ అనగానే, "గెలుస్తాం అంటే నేను కూడా ఎక్కువగా ఆరవగలను" అని అరిచి చూపిస్తూ రెచ్చిపోయాడు నబిల్. 

Read Also : Bigg Boss 8 Telugu Episode 15 Day 14 : ఇదేం ఎలిమినేషన్ రా బాబు! వెళ్లిపోతూ వారి రంగు బయటపెట్టిన శేఖర్ బాషా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget