అన్వేషించండి

Bigg Boss 7 Telugu Winner: రవితేజ కోసం ట్రోఫీ త్యాగం - అమర్‌దీప్‌ను చూసి మాస్ మహారాజ్ భావోద్వేగం

Bigg Boss Grand Finale Celebrations: బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్‌కు సంబంధించిన ప్రోమో విడుదల అవ్వగా.. అందులో రవితేజ కోసం అమర్ టైటిల్‌ను కూడా త్యాగం చేసినట్టుగా చూపించారు.

Bigg Boss 7 Telugu Winner: బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్‌కు చేరుకుంది. టాప్ 6 కంటెస్టెంట్స్ అయిన పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్, శివాజీ, ప్రియాంక, అర్జున్, యావర్.. ఫినాలేలోకి అడుగుపెట్టారు. వీరిలో విన్నర్ ఎవరు అధికారికంగా తెలుసుకోవడానికి ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ కోసం ఎంతోమంది సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చారు. అందులో రవితేజ కూడా ఒకరు. ఇప్పటికే పలుమార్లు బిగ్ బాస్ సీజన్స్‌కు గెస్ట్‌లుగా వచ్చాడు రవితేజ. తాజాగా మరోసారి వచ్చి టాప్ 6 కంటెస్టెంట్స్‌తో ముచ్చటించారు. ఇంతలోనే రవితేజకు వీరాభిమాని అయిన అమర్‌దీప్‌కు నాగార్జున ఒక ఆఫర్ ఇచ్చారు. ఆ ఆఫర్ కోసం బిగ్ బాస్ టైటిల్‌ను కూడా అమర్ వదులుకోవడానికి సిద్ధమయ్యాడా అని ప్రోమో చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

రవితేజతో సినిమా ఆఫర్..
బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా వచ్చిన అమర్‌దీప్‌కు మాస్ మహారాజ్ రవితేజ అంటే అభిమానమని ఇప్పటికీ చాలా సందర్భాల్లో బయటపెట్టాడు. అంతే కాకుండా తను రవితేజ వీరాభిమానిని అని చెప్తూ.. ఒకటే హెయిర్ స్టైల్‌ను కూడా మెయింటేయిన్ చేస్తుంటాడు అమర్. ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్‌కు రవితేజ ఒక గెస్ట్‌గా వచ్చాడు. తనను చూసి అమర్ చాలా ఎగ్జైట్ అయ్యాడు. అది చూసిన నాగార్జున.. ‘‘నీకొక అద్భుతమైన ఆఫర్ ఇస్తున్నాను. గేట్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు నువ్వు బయటికి వచ్చేస్తే రవితేజ తరువాతి సినిమాలో తనతో పాటు యాక్ట్ చేస్తావు. నేను నీకు 7 సెకండ్లు టైమ్ ఇస్తున్నాను’’ అని అమర్‌కు ఆఫర్ ఇచ్చారు.

ఏం అనాలో తెలియడం లేదు..
నాగార్జున ఇచ్చిన ఆఫర్ విన్న అమర్.. ఒక క్షణం ఆలోచించి వెంటనే తెరిచిన గేట్లవైపు పరిగెత్తాడు. అది చూసి అమర్ తల్లి, భార్యతో పాటు రవితేజ, నాగార్జున కూడా షాక్ అయ్యారు. ‘‘ఏం అనాలో తెలియడం లేదు’’ అంటూ భావోద్వాగానికి లోనయ్యాడు మాస్ మహారాజ్. ‘‘105 రోజులు తను అక్కడ కష్టపడ్డాడు’’ అని అమర్ గురించి చెప్పుకొచ్చారు నాగార్జున. ఇదంతా చూసిన అమర్ భార్య తేజస్విని కూడా ఎమోషనల్ అయ్యింది. మరి ప్రోమోలో చూపించినట్టుగా అమర్ నిజంగానే రవితేజతో నటించే అవకాశం కోసం బిగ్ బాస్ టైటిల్‌ను వదిలేసుకుంటాడా లేదా ఇందులో కూడా ఏమైనా ఉల్టా పుల్టా ఉందా అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel)

సూట్‌కేస్ కూడా వద్దన్నాడు..
ఇప్పటికే రూ.10 లక్షలు ఉన్న సూట్‌కేస్‌ను హౌజ్‌లోకి పంపించి.. ఎవరైనా కంటెస్టెంట్ కావాలనుకుంటే ఆ సూట్‌కేసును తీసుకొని అప్పటికప్పుడు హౌజ్ నుండి వెళ్లిపోవచ్చు అని ఆఫర్ ఇచ్చారు. అయినా కూడా ఏ కంటెస్టెంట్ కూడా టైటిల్‌ను వదులుకొని ఆ సూట్‌కేస్‌ను తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఇదే విషయంపై శివాజీ.. అమర్‌ను అడగగా.. ఎంత డబ్బు ఇచ్చినా టైటిల్‌ను మాత్రం త్యాగం చేయను అని, రాసిస్తాను అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అలాంటిది తన అభిమాన హీరోతో నటించే ఛాన్స్ వస్తుంది అనగానే టైటిల్‌ను కూడా త్యాగం చేయడానికి అమర్ సిద్ధమయ్యాడు అంటే గ్రేట్ అని తన అభిమానులంతా.. సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: టేస్టీ తేజాకు లక్కీగా మారిన 'బిగ్ బాస్' హౌస్ - అన్ని సినిమాల్లో ఆఫర్స్ ఏంటి బాసూ?

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Neha Fathima : బిగ్ బాస్ హౌస్‌లో క్యూట్ లవ్ స్టోరీ - పేరెంట్స్ ఎంట్రీతో బిగ్ ట్విస్ట్... అసలేం జరిగిందంటే?
బిగ్ బాస్ హౌస్‌లో క్యూట్ లవ్ స్టోరీ - పేరెంట్స్ ఎంట్రీతో బిగ్ ట్విస్ట్... అసలేం జరిగిందంటే?
Bigg Boss Season 10 Today November 1st: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్ ఎలిమినేట్! ఏవీ కూడా లేదు.. టాప్ కంటెస్ట్ంట్‌కి అన్యాయం జరిగిందా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్ ఎలిమినేట్! ఏవీ కూడా లేదు.. టాప్ కంటెస్ట్ంట్‌కి అన్యాయం జరిగిందా!
Thrigun Jangaa First Look: 'బిగ్ బాస్' త్రిగుణ్ హీరోగా 'జంగా'... హౌస్‌లో హీరో - కానీ ఫస్ట్ లుక్ వచ్చేసింది
'బిగ్ బాస్' త్రిగుణ్ హీరోగా 'జంగా'... హౌస్‌లో హీరో - కానీ ఫస్ట్ లుక్ వచ్చేసింది
Bigg Boss Season 10 Today October 31st: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఝాన్సీ ఎలిమినేట్! డేంజర్ జోన్‌లో రోహిత్.. దారుణాలు బయట పెట్టిన నాగ్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఝాన్సీ ఎలిమినేట్! డేంజర్ జోన్‌లో రోహిత్.. దారుణాలు బయట పెట్టిన నాగ్!

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Urban Local Bodies Polling: ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో ముగిసిన రీపోలింగ్.. ఈ 3న ఓట్ల లెక్కింపు
ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో ముగిసిన రీపోలింగ్.. ఈ 3న ఓట్ల లెక్కింపు
Cyclone Musuru Helpline Numbers: ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
Hyderabad Baby Dies: ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
Congress Politics: జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
Raptadu Girl Attack Case: రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
Upcoming Cars: ఈ నెలలో రాబోతున్న 4 కార్లు.. లగ్జరీ EVల నుంచి తొలి 'ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్' వరకు!
ఈ నెలలో లాంచ్‌ కానున్న 4 కొత్త కార్లు.. ఒక్కో కారుది ఒక్కో ప్రత్యేకత
Viral News: అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం
అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం
Diwali Home Decoration : దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
Embed widget