అన్వేషించండి

Bigg Boss 8 Telugu: వైల్డ్ కార్డు ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్, నలుగురు కొత్త కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ 2.0 గ్రాండ్ లాంచ్ 

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ 8 తెలుగులఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఈ కొత్త బ్యాచ్ ను ఎప్పుడు రంగంలోకి దింపబోతున్నారో తెలుసుకుందాం పదండి.

Bigg Boss 8 Telugu News: బుల్లితెరపై ప్రసారమయ్యే రియాల్టీ షోలలో అన్నింటికంటే ఎక్కువగా పాపులర్ అయిన షో బిగ్ బాస్. తాజాగా తెలుగులో సీజన్ 8 నడుస్తుండగా, 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ఎప్పటిలాగే నాగార్జున హోస్ట్ గా వ్యవహరించడంతో ఈ సరికొత్త సీజన్ ప్రారంభమైంది. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, అన్లిమిటెడ్ మనీ అంటూ మొదలైన బిగ్ బాస్ తెలుగు  లో ప్రస్తుతం 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇందులో ఇద్దరు ఇప్పటికే ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీకి తాజాగా ముహూర్తం ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. ఈసారి ఏకంగా నలుగురు కొత్త కంటెస్టెంట్స్ ను వైల్డ్ కార్డు పేరుతో హౌస్ లోకి పంపించబోతున్నారని టాక్ నడుస్తోంది. మరి హౌస్ లోకి అడుగు పెట్టబోతున్న ఆ నలుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్స్ ఎవరు? ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు? అనే విషయాలను తెలుసుకుందాం. 

వైల్డ్ కార్డు ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... 
గత సీజన్ తో పోల్చుకుంటే బిగ్ బాస్ సీజన్ 8 చాలా తక్కువ టిఆర్పి రేటింగ్ తో మొదలైంది. దీనికి కారణం హౌస్ లో అడుగు పెట్టిన కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. వాళ్ళ ముఖాలు పెద్దగా తెలియకపోవడం పట్ల బుల్లితెర ప్రేక్షకులు అసంతృప్తిని వ్యక్తం చేసి, దాన్ని టీఆర్పి రేటింగ్ తో బయటపెట్టారు. కానీ ఆ తరువాత వారం రోజులకే టిఆర్పి రేటింగ్ టాప్ లోకి దూసుకెళ్లింది. అన్ని భాషల్లోని బిగ్ బాస్ తో పోల్చుకుంటే తెలుగు బిగ్ బాస్ ఈ సీజన్లో టీఆర్పీ రేటింగ్ పరంగా రికార్డులను తిరగరాసింది. కాగా ఎప్పుడెప్పుడా అని ఈగర్ గా ఎదురు చూస్తున్న వైల్డ్ కార్డు ఎంట్రీని బిగ్ బాస్ 8 తెలుగు 2.0 అనే మరొక గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ద్వారా హౌస్ లోకి పంపబోతున్నారని తెలుస్తోంది. దసరా స్పెషల్ బోనంజా వీకెండ్ అక్టోబర్ 6న ఈ బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ 2.0 జరగనుందని అంటున్నారు. 

Read Also : Bigg Boss 8 Day 16 Promo 2: కొత్త లవ్ స్టోరీ, చిన్నోడికి యష్మి గౌడ - సీతతో నిఖిల్ పులిహోర... సోనియాతో ఇద్దరూ కటీఫ్ ?

వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న కంటెస్టెంట్స్... 
చాలా కాలంగా బిగ్ బాస్ 8 తెలుగులోకి అడుగు పెట్టబోతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ లో జ్యోతి రాయ్ పేరు వైరల్ అవుతుంది. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న జ్యోతి రాయ్ ఆ తరువాత సోషల్ మీడియాలోని బోల్డ్ యాంగిల్ బయట పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. అలా బుల్లితెర, సోషల్ మీడియాలలో తన అందం, అభినయంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న జ్యోతి రాయ్ తో పాటు రాకింగ్ రాజేష్, యాంకర్ శివ, హైపర్ ఆది కూడా బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా గత ఓటిటి సీజన్ తో సహా మునుపటి సీజన్లో నుంచి కొంత మంది మాజీ కంటెస్టెంట్స్ తో చర్చలు జరుపుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే దసరా ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే.

Read Also : Bigg Boss 8 Telugu Day 16 Promo: అతడి హగ్‌ కంఫర్టబుల్‌గా లేదు - యష్మి గౌడ ఎమోషనల్ - ఫోటో పెట్టు ఆగేటట్టు టాస్క్ లో పృథ్వీ, నబిల్ ఫైట్  

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Aishwarya Sindogi: బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు
బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు
Bigg Boss Sanjana Serial : బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
Actress Krishi Thapanda: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట్లో డెడ్ బాడీ... అసలు ఏం జరిగిందంటే?
బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట్లో డెడ్ బాడీ... అసలు ఏం జరిగిందంటే?

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Embed widget