Bigg Boss 8 Telugu Day 16 Promo: అతడి హగ్ కంఫర్టబుల్‌గా లేదు - యష్మి గౌడ ఎమోషనల్ - ఫోటో పెట్టు ఆగేటట్టు టాస్క్ లో పృథ్వీ, నబిల్ ఫైట్
Bigg Boss 8 Latest Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 డే 16కు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. అందులో యష్మి గౌడ ఎమోషనల్ అవ్వగా, కొత్త టాస్క్ లో భాగంగా నబిల్, యష్మి గౌడ మధ్య టఫ్ ఫైట్ నడిచింది.
బుల్లితెర పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు 16వ రోజుకు చేరుకుంది. ఈ తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో నిన్నటి నామినేషన్ ఎపిసోడ్లో కనిపించిన గొడవలు సద్దుమణిగినట్టుగా అనిపించింది. అలాగే యష్మి గౌడ వద్దంటున్నా హగ్ చేసుకుంటున్నాడు అంటూ నాగ మణికంఠ గురించి పృథ్వీ దగ్గర చెప్పి బాధపడింది. ఆ తర్వాత ప్రోమోలో ఫోటో పెట్టు ఆగేటట్టు అనే టాస్క్ ను బిగ్ బాస్ ఇవ్వగా, నబిల్, పృథ్వి మధ్య టఫ్ ఫైట్ నడిచింది.
అన్ కంఫర్టబుల్ అని చెప్పినా వదలట్లేదు
మూడో వారం నామినేషన్లలో భాగంగా యష్మి గౌడ, నాగ మణికంఠ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఈ సీజన్ లో తాను ఉన్నంత వరకూ నాగ మణికంఠనే నామినేట్ చేస్తానని శపథం చేసింది యష్మి గౌడ. అయితే 15వ ఎపిసోడ్లో ఈ నామినేషన్ల ప్రక్రియ ముగియగా, తాజా ఎపిసోడ్లో యష్మి గౌడను నాగ మణికంఠ బుజ్జగించే ప్రయత్నం చేశాడు. "అక్కడ ఏం జరిగిందో అదంతా నామినేషన్లలో భాగంగా జరిగింది. కాబట్టి ఇంకేం ఆలోచించకు ప్లీజ్" అంటూ యష్మిని హగ్ చేసుకుని చెప్పాడు. కానీ యష్మి "సరే వదిలేయ్" అంటూ ముక్తసరిగా సమాధానం చెప్పడంతో, "ఎంత సీరియస్ గా చెప్తుందో చూడు" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నాగ మణికంఠ.
వెంటనే యష్మి గౌడ "నాకు చాలా అన్ కంఫర్టబుల్ గా ఉంది బిగ్ బాస్.. చాలా కోపం వస్తుంది" అంటూ ఏడ్చేసింది. తరువాత కూడా పృథ్వీ దగ్గరకు వెళ్లి "నిజంగా నాకు మెంటల్ టార్చర్ లా ఉంది. అతను వచ్చి హగ్ చేయడం అనేది నాకు అస్సలు కంఫర్టబుల్ గా లేదు. అతను ఫేక్ అని నాకు నిజంగానే అనిపిస్తోంది. నేను హౌస్ లో ఉన్నంత వరకు ప్రతి నామినేషన్ లో వాడి పేరునే తీసుకుంటాను" అంటూ మళ్ళీ నిన్న నామినేషన్ లో వాడిన డైలాగ్ నే రిపీట్ చేసింది యష్మి గౌడ.
ఫోటో పెట్టు ఆగేటట్టు టాస్క్ లో టఫ్ ఫైట్
ఇక ఆ తర్వాత ప్రోమోలో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఫోటో పెట్టు ఆగేటట్టు అనే టాస్క్ ని ఇచ్చినట్టుగా చూపించారు. ప్రస్తుతం హౌస్ లో రెండు క్లాన్స్ ఉన్నాయి. నిఖిల్ క్లాన్ నుంచి పృథ్వి, అభయ్ క్లాన్ నుంచి నబిల్ ఈ టాస్క్ లో పాల్గొన్నారు. అయితే ఇద్దరి మధ్య ఈ టాస్క్ లో భాగంగా టఫ్ ఫైట్ నడిచింది. ముందుగా ఇద్దరూ బిగ్ బాస్ ఇచ్చిన బోర్డ్ పై ఫోటోలను పెట్టడానికి ట్రై చేశారు. ఆ తర్వాత ఒకరివి ఒకరు లాగేసుకుంటూ ఫిజికల్ అయ్యారు. ఆ తర్వాత సంచాలక్ గా ఉన్న సీత పాజ్ అని చెప్పినా ఇద్దరూ వినలేదు. ఇక ప్రోమో చివర్లో "బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చాక ముట్టుకోవద్దు" అని ఉండే అని సీత.. విష్ణు ప్రియ, ఆదిత్య ఓం, నబిల్ ల దగ్గర చెప్పింది. ఆ వెంటనే నబిల్, విష్ణు ప్రియ "పృథ్వి మైనస్ పాయింట్ అది. అతను పట్టుకోవడం, నూకడం చేస్తాడు" అని చెప్పడంతో ప్రోమో ముగిసింది.