అన్వేషించండి

Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?

బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 15లో మూడవ వారం నామినేషన్ ప్రాసెస్ జరిగింది. ఇందులో కొత్త చీఫ్ అయిన అభయ్ సెల్ఫ్ నామినేషన్ వేసుకున్నాడు. ఇంకా ఎవరెవరు ఈ వారం నామినేషన్ లిస్ట్ లో ఉన్నారో తెలుసుకుందాం.

బిగ్ బాస్ సీజన్ 8 రోజులు గడుస్తున్న కొద్ది ఆసక్తికరంగా మారుతోంది. అందరూ ఊహించినట్టుగానే మొదటి వారం ఎలిమినేషన్లలో బెజవాడ బేబక్క హౌస్ నుంచి ఎవిక్ట్ అయ్యింది. ఆమెకు వంటింటి సెంటిమెంట్ దెబ్బ పడింది. ఇక సెకండ్ వీక్ మాత్రం ఊహించని విధంగా శేఖర్ బాషాను స్వయంగా హౌస్ హౌస్ మేట్స్ బయటకు పంపారు. బయటకు వచ్చాక తానే బిగ్ బాస్ ను రిక్వెస్ట్ చేసి వచ్చాను అని ఆయన బాంబ్ పేల్చిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన బిగ్ బాస్ 8 మూడవ వారం నామినేషన్స్ హౌస్ లో హీట్ పుట్టించాయి. మరి ఈ వీక్ నామినేషన్ లిస్ట్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరో, ఎవరికి ఎక్కువ రిస్క్ ఉందో ఓ లుక్కేద్దాం పదండి. 

నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే...
ఎప్పటిలా కాకుండా బిగ్ బాస్ ఈ మూడవ వారం నామినేషన్ల కోసం చెత్తను ఉపయోగించి షాక్ ఇచ్చారు. మొదటి వారం ప్రేరణ చెత్త బుట్టలో నుంచి బాటిల్ తీసి పక్కన పెట్టింది అనేది ఎంత పెద్ద ఇష్యూ అయిందో తెలిసిందే. కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఏకంగా చెత్త బుట్టలో ఉన్న చెత్తను తలపై పోసి నామినేట్ చేయాలని చెప్పారు. ఇక ఆయన చెప్పినట్టుగానే హౌస్ మేట్స్ తాము నామినేట్ చేస్తున్న కంటెస్టెంట్స్ తలపై చెత్తను పోస్తూ రీజన్స్ చెప్పారు. తాజా ఎపిసోడ్ ప్రకారం పృథ్వీని సీత, యష్మి గౌడ.. విష్ణు ప్రియ ప్రేరణను  నామినేట్ చేయగా... సోనియా నైనికను, యష్మిని నామినేట్ చేసింది. యష్మి.. నాగ మణికంఠను, నైనికను నామినేట్ చేయగా, ప్రేరణ విష్ణు ప్రియను నామినేట్ చేసింది. అయితే చీఫ్ గా ఉన్న నిఖిల్ లలో ఎవరు నామినేట్ కావాలో తేల్చుకోమన్నారు బిగ్ బాస్. నిఖిల్ అప్పటికే మూడు సార్లు చీఫ్ అయ్యాడనే రీజన్ తో, తాను నామినేషన్ నుంచి బయట పడగలననే నమ్మకంతో పాటు తన స్ట్రెంత్ ఎంతో తెలుసుకోవడానికి అభయ్ సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. మొత్తానికి మూడవ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన సభ్యుల లిస్టులో యష్మి గౌడ, ప్రేరణ కంబం, కిరాక్ సీత, పృథ్వీ రాజ్, విష్ణు ప్రియ, నైనిక, అభయ్ నవీన్, నాగ మణికంఠ ఉన్నారు. 

Read Also : Yashmi Gowda Vs Naga Manikanta: శ్రీముఖి, రాహుల్ బాటలో మణికంఠ, యష్మి గౌడ... బిగ్ బాస్ చరిత్రను రిపీట్ చేయబోతున్నారా?

ఎవరు రిస్క్ లో ఉన్నట్టు? 
బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్స్ అందరికీ ఓటింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఓటింగ్ మాత్రమే కాదు హౌస్ లో కో కంటెస్టెంట్స్ తో ఎలా ఉంటున్నారు అనేది కూడా చాలా ముఖ్యం అనే విషయాన్ని బిగ్ బాస్ వీకెండ్ లో ప్రూవ్ చేశారు. ఏకంగా కంటెస్టెంట్స్ చేతికే హౌస్ లో నుంచి ఒకరిని బయటకు పంపించే అధికారాన్ని ఇచ్చి శేఖర్ బాషాను బయటకు పంపారు. అయితే ఈ వారం నామినేషన్ల లిస్ట్ చూసుకుంటే రిస్క్ లో ఉండేది నైనిక, పృథ్వీ అని చెప్పొచ్చు. నిజానికి పృథ్వీకి గత వారమే అతి తక్కువగా ఓట్లు వచ్చాయి. ఇక ఇప్పుడున్న నామినేషన్ల లిస్టు చూసుకుంటే అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్సే ఉన్నారు. అందరితో పోలిస్తే పృథ్వీరాజ్, నైనిక రిస్క్ లో పడ్డట్టే. మరి ఈ వారం ఎలిమినేషన్లలో నాగార్జున ఎలాంటి ట్విస్ట్ ఇస్తారు? వీరిలో హౌస్ నుంచి బయటకు వెళ్ళేది ఎవరు? అనే విషయం తెలియాలంటే ఓటింగ్ రిజల్ట్స్ తో పాటు వీకెండ్ ఎపిసోడ్ వచ్చేదాకా వెయిట్ అండ్ సీ.

Read Also : Bigg Boss Telugu 8 Day 15 Promo 2: నీది ఎమోషన్ అయితే నాది మోషనా అంటున్న పృథ్వీ, సోనియా క్లాన్ పై ఇంట్రెస్ట్ పెట్టలేదా?

టాప్ హెడ్ లైన్స్

Kadali Satyanarayana: బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!
బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Rocking Rakesh: మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
Patas Hari: పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Embed widget