Bigg Boss 8 Day 16 Promo 2: కొత్త లవ్ స్టోరీ, చిన్నోడికి యష్మి గౌడ - సీతతో నిఖిల్ పులిహోర... సోనియాతో ఇద్దరూ కటీఫ్ ?
Bigg Boss 8 Telugu : ఈరోజు హౌస్ లో ఎవరు ఎవరితో పులిహోర కలుపుతున్నారు? అనే విషయాన్ని బిగ్ బాస్ తెలుగు డే 16 ప్రోమో 2లో చూపించారు మేకర్స్. మరి ఎవరెవరి మధ్య కొత్తగా లవ్ స్టోరీ నడుస్తుందో చూద్దాం పదండి.
Bigg Boss Telugu Season 8 | బిగ్ బాస్ తెలుగు డే 16 ఎపిసోడ్ కు సంబంధించిన రెండవ ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఇందులో కంప్లీట్ గా ఎవరు ఎవరిని ఫ్లర్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని చూపించారు. ముఖ్యంగా నిఖిల్ సీతతో పులిహోర కలపగా, యష్మి గౌడ, నిఖిల్, పృథ్విల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోందా ? అన్పించే విధంగా చూపించారు ప్రోమోను. ప్రోమో లో ఉన్న మరిన్ని విశేషాలపై ఓ లుక్కేద్దాం పదండి.
చిన్నోడికి యష్మి గౌడ, పెద్దోడికి సీత
తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో ప్రారంభంలోనే "యష్మి గౌడ ఎందుకు హర్ట్ అయిందో నిజంగా చెప్పురా?" అంటూ నాగ మణికంఠను ప్రశ్నించాడు నిఖిల్. అయితే "ఫ్లర్ట్ అని చెప్తుంది ఎవరో ముందు అది ఆలోచించు" అని చెప్పింది సీత. "నీతో కాకుండా ఎవరితో మాట్లాడానో చెప్పు" అని నిఖిల్ ప్రశ్నించగా, "యష్మితో ఫ్లర్ట్ చేస్తావు" అని చెప్పింది సీత. "యష్మితో నేను అసలు సరిగ్గా మాట్లాడనే మాట్లాడట్లేదు. ఇంక ఫ్లర్ట్ ఎప్పుడు చేశాను?" అని నిఖిల్ ప్రశ్నించగా, విష్ణు ప్రియ ఆమెనే అడుగుదాం అని యష్మిని పిలిచింది. యష్మి గౌడ రాగానే "ఇతను నిన్ను ఎప్పుడైనా ఫ్లర్ట్ చేశాడా ?" అని యష్మిని, నిఖిల్ ని పక్కపక్కనే కూర్చోబెట్టి అడిగింది సీత. ఆమె వెంటనే "నేను చేశాను అతను కూడా చేశాడు" అని చెప్పింది. "నా పరంగా చూస్తే ఇది కూడా ఫ్లర్టింగ్" అని చెప్పింది విష్ణు ప్రియ. వెంటనే నిఖిల్ "నేను సీతకి తప్ప ఎవరికీ అలా పడలేదు" అని చెప్పాడు. ఇక ఆ తర్వాత యష్మి "అయితే నువ్వు హ్యాపీ కదా" అని సీతను ప్రశ్నించింది. ఆమె "అవును" అని చెప్పేసరికి, "చేసుకోండి మీరూ మీరూ" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ఆ తర్వాత బెడ్రూంలో ఇద్దరే ఉన్నప్పుడు "యష్మికి, నీకు మధ్య ఏం జరుగుతోందిరా" అని పృథ్వీని సోనియా ప్రశ్నించింది. "ఎందుకు అలా అడుగుతున్నావు" అని అతను నవ్వుతూ అడగ్గానే, "యష్మి అంటే నీకు ఇష్టం అంట కదా" అని అడిగింది. ఆ తర్వాత నిఖిల్, విష్ణు ప్రియ, అభయ్, సీత ఓ గదిలో కూర్చుని ఉండగా, "నీ ఆటలో ఏముందో నాకు తెలీదు, తెలుసుకోవాలని కూడా లేదు, నువ్వు చెప్పలేదు" అని మొదలుపెట్టింది సీత. వెంటనే నిఖిల్ "నువ్వు అడగలేదు" అని సమాధానం చెప్పడంతో, "ఇలాగే మిస్ కమ్యూనికేషన్ మొదలవుతుంది" అని అభయ్ అనగా , అందరూ నవ్వారు. అయితే ఇదంతా టాస్క్ లో భాగంగా జరుగుతోందా? లేదంటే హౌస్ మేట్స్ అందరూ కలిసి ఫన్ కోసం ఇలా చేస్తున్నారా అనేది ఈరోజు ఎపిసోడ్ చూస్తేనే తెలుస్తుంది.
తొక్కలో సంచాలక్ అంటూ ప్రేరణ ఫైర్
ఆ తర్వాత ప్రోమోలో నత్తలా సాగకు ఒక్కటీ వదలకు అంటూ తలతో క్యాబేజీని దొర్లించే టాస్క్ ను రెండు క్లాన్స్ సభ్యులకు ఇచ్చారు బిగ్ బాస్. దీనికి సంచాలక్ గా మణికంఠ వ్యవహరించగా, ఒకానొక టైంలో ప్రేరణ తొక్కలో సంచాలక్ అంటూ ఫైర్ అవ్వడంతో ప్రోమో ముగిసింది.
Read Also : Prerana Kambam: ప్రేరణ ఇంట్లో విషాదం, బిగ్ బాస్ షాకింగ్ డెసిషన్ తీసుకోబోతున్నారా?