అన్వేషించండి

Prerana Kambam: ప్రేరణ ఇంట్లో విషాదం, బిగ్ బాస్ షాకింగ్ డెసిషన్ తీసుకోబోతున్నారా?

Bigg Boss Telugu Season 8 | బిగ్ బాస్ సీజన్ 8లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరైన ప్రేరణ కంబం ఇంట్లో విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆమెతో పాటు బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు ? అనేది తెలియాల్సి ఉంది.

Bigg Boss 8 Telugu | బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రస్తుతం 12 మంది హౌస్ మేట్స్ ఉన్నారు. గత రెండు వీకెండ్స్ లో బెజవాడ బేబక్క, శేఖర్ బాషా హౌస్ నుంచి ఎవిక్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన 12 మందిలో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ప్రేరణ కంబం కూడా ఒకరు. అయితే తాజాగా ప్రేరణ ఇంట్లో విషాదం నెలకొన్నట్టుగా సమాచారం. మరి ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా ? అనే చర్చ మొదలైంది. 

ప్రేరణ ఇంట్లో విషాదం 
ఈరోజు రాత్రి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 డే 16 ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే ఇప్పటికే ఒక ప్రోమో రిలీజ్ చేసి ఆసక్తిని పెంచేశారు మేకర్స్. ఆ ప్రోమోలో యష్మి గౌడ, మణికంఠ మధ్య ఏర్పడిన గ్యాప్ ను చూపించారు. అతను నామినేషన్ల విషయాన్ని పక్కకి పెట్టి నార్మల్ గా ఉండాలని కోరగా, యష్మి గౌడ అతను హగ్ చేసుకుంటే కంఫర్ట్ గా లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఫేక్ అంటూ చాలా బాధపడింది. ఈ నేపథ్యంలోనే హౌస్ మేట్స్ లో ఒకరైన ప్రేరణకు మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్లో బ్యాడ్ న్యూస్ అందబోతోందని సమాచారం. ప్రేరణ భర్త వాళ్ళ అమ్మమ్మ తాజాగా కన్నుమూసినట్టు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లో ఉంది కాబట్టి ఆమెకు ఈ వార్త గురించి తెలిసే అవకాశం లేదు. అది ఈరోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ ద్వారా తెలియబోతుందని అంటున్నారు.

ఒకవేళ ఈ విషయం తెలిస్తే ప్రేరణ దాన్ని ఎలా తీసుకుంటుంది? బిగ్ బాస్ ఆమెను ఇంటికి పంపించే నిర్ణయం ఏమన్నా తీసుకుంటారా? లేదా అలాగే హౌస్ లో ఉండి ప్రేరణ తన ఆటను కొనసాగిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న ప్రేరణ ఈ కారణంతో అర్ధాంతరంగా ఆటను ఆపేసి ఇంటికి వెళ్ళిపోతే అది ఆమెతో పాటు ఆమె అభిమానులకు కూడా నిరాశను కలిగించే విషయం అవుతుంది. కానీ అంతకంటే ఇంపార్టెంట్ ఫ్యామిలీ. మరి ప్రేరణ, బిగ్ బాస్ నిర్ణయం ఏంటో తెలియాలంటే డే 16 ఎపిసోడ్ చూడాల్సిందే. 

Read Also : Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?

కంటెస్టెంట్స్ ఆటకు అడ్డుగా మారిన ఎమోషన్స్ 
ఇప్పటికే హౌస్ మేట్స్ అందరూ ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అవుతున్నారు. అయితే ప్రేరణకు తన భర్త అమ్మమ్మ చనిపోవడం అనేది హార్ట్ బ్రేకింగ్ వార్త కాబట్టి ఆమె గేమ్ పై ఫోకస్ చేయగలుగుతుందా ? అనే ప్రశ్నలు  తలెత్తుతున్నాయి. గతవారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న శేఖర్ బాషా తన కొడుకుని చూడాలనే నెపంతో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా శేఖర్ బాషా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తన భార్యను, కొడుకును చూడడానికే బిగ్ బాస్ ను కోరి, హౌస్ మేట్స్ అందరినీ రిక్వెస్ట్ చేసి మరీ తానే స్వయంగా బయటకు వచ్చాను అని ఒప్పుకున్నాడు.

Read Also : Yashmi Gowda Vs Naga Manikanta: శ్రీముఖి, రాహుల్ బాటలో మణికంఠ, యష్మి గౌడ... బిగ్ బాస్ చరిత్రను రిపీట్ చేయబోతున్నారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget