అన్వేషించండి

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

మీకు ‘బిగ్ బాస్’ హౌస్‌లో సెలబ్రిటీలతో కలిసి సెలబ్రిటీగా మారిపోవాలని ఉందా? అయితే, నాగ్ చెప్పినట్లు చేసేయండి.

‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ ముగిసింది. ఇప్పుడు ‘బిగ్ బాస్’ సీజన్-6కు సన్నహాలు మొదలయ్యాయి. ఈ మేరకు ఈ షో హోస్ట్ అక్కినేని నాగార్జున ఊహించని ఆఫర్ ప్రకటించారు. ఈ సారి ‘స్టార్ మా’, ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’లో ప్రసారం కానున్న ‘బిగ్ బాస్’ సీజన్-6లో సామ్యానులకు కూడా అవకాశం ఇస్తున్నామని నాగ్ వెల్లడించారు. ఇది కేవలం ‘వన్ టైమ్ గోల్డెన్ ఆపర్చునిటీ’ అని ప్రకటించారు. ఈ సందర్భంగా బుధవారం ఓ ప్రమోను విడుదల చేశారు. 

‘‘ఇన్నాళ్లూ మీరు ఇంట్లో కూర్చొని ‘బిగ్ బాస్’ హౌస్‌ను చూశారు. అయితే, స్టార్ మా మీకు ఆకాశాన్ని అందుకొనే అవకాశాన్ని ఇస్తుంది’’ అని నాగార్జున వెల్లడించారు. ఇందులో పాల్గొనేందుకు మీరు ఏం చేయాలనే విషయాన్ని వీడియోలో వెల్లడించారు. ‘బిగ్ బాస్’లోకి వెళ్లేందుకు సామాన్యులను ఆహ్వానించడం ఇదే తొలిసారి కాదు. ‘బిగ్ బాస్’ సీజన్-2లో ఇద్దరు సామాన్యులకు అవకాశాన్ని ఇచ్చారు.

Also Read: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

నూతన్ నాయుడు, గణేష్‌లు సామాన్యులుగా ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. గణేష్ సుమారు 83 రోజులు హౌస్‌లో సెలబ్రిటీలతో కలిసి ఉండగలిగాడు. ఆ తర్వాత ఎలిమినేట్ అయ్యాడు. అయితే, నూతన్ నాయుడు 54వ రోజు బయటకు వెళ్లి, 75 రోజు మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. గణేష్ వెళ్లిన తర్వాతి రోజు.. అంటే 84వ రోజే ఎలిమినేట్ అయ్యాడు. ఆ షోకు హీరో నాని హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత వచ్చిన మిగతా మూడు సీజన్లలో సామాన్యులకు అవకాశం చిక్కలేదు. మరి, మీరు కూడా సెలబ్రిటీ కావాలని అనుకుంటే.. నాగ్ చెప్పినట్లు చేయండి.

Also Read: మూన్ నైట్ వెబ్ సిరీస్ రివ్యూ: హాలీవుడ్ అపరిచితుడు ఎలా ఉన్నాడు? 

డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రసారమైన ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ మొదటి సీజన్ ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఇందులో నటి బిందు మాధవి విజేతగా ట్రోపీని కైవశం చేసుకోగా.. అఖిల్ సార్ధక్ మాత్రం రన్నరప్‌తోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. అయితే, యాంకర్ శివ మూడో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక అరియానా ఓటీటీలో కూడా నాలుగో స్థానాన్నే సరిపెట్టుకోవలసి వచ్చింది. అసలు మొదటి వారంలోనే వెళ్లిపోతుందని భావించిన మిత్ర ఏకంగా ఐదో స్థానంలో నిలిచి ఆశ్చర్యపరిచింది. అయితే, ఆరో సీజన్‌లో యాంకర్ శివకు గానీ, మిత్రాకు గానీ మరో ఛాన్స్ లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి, ఏం జరుగుతుందో చూడాలి. 

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Bigg Boss Agnipariksha 2026: 'బిగ్ బాస్' అగ్నిపరీక్ష ఫైనల్ కంటెస్టెంట్లు వీళ్ళే... పదిహేను మందిలో ఎవరున్నారంటే?
'బిగ్ బాస్' అగ్నిపరీక్ష ఫైనల్ కంటెస్టెంట్లు వీళ్ళే... పదిహేను మందిలో ఎవరున్నారంటే?
Vindhya Vishaka: ఐపీఎల్ సుందరి వింధ్యా విశాఖ.. న్యూస్ రీడర్ నుంచి స్టార్ యాంకర్ వరకు.. బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ!
ఐపీఎల్ సుందరి వింధ్యా విశాఖ.. న్యూస్ రీడర్ నుంచి స్టార్ యాంకర్ వరకు.. బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ!
Nikhil Vijayendra Simha: డిజిటల్ స్టార్ నిఖిల్ విజయేంద్ర సింహ.. యూట్యూబ్ నుంచి బిగ్ బాస్ రేస్ వరకు.. కెరీర్, రియల్ లైఫ్ ముచ్చట్లు!
డిజిటల్ స్టార్ నిఖిల్ విజయేంద్ర సింహ.. యూట్యూబ్ నుంచి బిగ్ బాస్ రేస్ వరకు.. కెరీర్, రియల్ లైఫ్ ముచ్చట్లు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget