Bigg Boss Telugu 7: శివాజీ ఈ లాజిక్ ఎలా మిస్సయ్యాడు? శోభా నిర్ణయం చెప్పకముందే అరుపులు - ఆ తర్వాత కవరింగ్‌లు
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ సమయంలో శోభాపై అరిచిన శివాజీ.. ఆ తర్వాత కవరింగ్‌లు మొదలుపెట్టాడు.
బిగ్ బాస్ సీజన్ 7లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం యుద్ధాలే జరిగాయి. ముందుగా అర్జున్ చేతికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ రాగానే అందరూ అంత ఈజీగా వచ్చిందేంటి అని ఆశ్చర్యపోయారు. కానీ వెంటనే ఆ పాస్‌ను ఇతర కంటెస్టెంట్స్‌తో డిఫెండ్ చేసుకోమనగానే బిగ్ బాస్ ట్విస్ట్ అందరికీ అర్థమయ్యింది. దీంతో అర్జున్.. ముందుగా యావర్‌తో పోటీపడి ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను చేజార్చుకున్నాడు. యావర్ చేతికి వెళ్లిన పాస్.. మరెవరి చేతికి వెళ్లలేదు. వరుసగా స్ట్రాటజీతో పోటీదారులను ఎంచుకుంటూ, వారితో పోటీపడుతూ, పాస్‌ను కాపాడుకుంటూ ఉన్నాడు యావర్. చివరిగా శివాజీ, ప్రియాంకతో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం తలపడినప్పుడు ఆ పాస్.. యావర్ చేతికి వస్తుందా లేదా అనే నిర్ణయం శోభా శెట్టి, ప్రశాంత్‌ల చేతిలో ఉంది. అప్పుడే శివాజీ ఒక స్ట్రాటజీని ప్లే చేశాడు. అందులో శోభా ఇరుక్కుపోయింది.
శోభాపై అరుపులు..
శివాజీ, ప్రియాంక, యావర్‌లకు బాల్స్ బ్యాలెన్స్ చేయమనే టాస్క్‌ను ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్కులో పాటించవలసిన నియమాలు ఏంటో కూడా వారికి తెలియజేశాడు. అయితే ముందుగా ఈ టాస్క్‌లో మూడో బాల్ పెట్టి బ్యాలెన్స్ కోల్పోయిన ప్రియాంక.. ఆట నుంచి తప్పుకుంది. ఆ తర్వాత శివాజీ కూడా చాలాసేపు బాల్స్‌ను బ్యాలెన్స్ చేయకుండా చేతిలోనే పట్టుకున్నాడు. అలా పట్టుకోవడం తప్పు అని బిగ్ బాస్ కూడా అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత సహనం కోల్పోయిన శివాజీ.. ప్రశాంత్ డిస్టర్బ్ చేయడం వల్లే ఓడిపోయినట్టుగా కవరింగ్ చేసి ఆట నుంచి తప్పుకున్నాడు. సంచాలకులుగా తను కరెక్ట్‌గా లేదని.. శోభాపై అరవడం మొదలుపెట్టాడు. తాను బాల్స్‌ను పట్టుకోవడం నిజమే అని, కానీ బిగ్ బాస్ చెప్పగానే వదిలేశానని, తన ఆట కరెక్టే అన్నట్టు వాదించాడు.
శివాజీ కవరింగ్‌లు..
ఇక శివాజీ నిన్న మాట్లాడిన మాటలకు, ఈరోజు మాట్లాడిన మాటలకు సంబంధమే లేదు. తన ఆట తప్పు కాదు అని డిఫెండ్ చేసుకున్న శివాజీ.. ఒక్కసారిగా మాట మార్చాడు. యావర్‌కు అన్యాయం జరుగుతుందేమో అన్న ఉద్దేశ్యంతో తాను అరిచానని మిగతా కంటెస్టెంట్స్‌కు చెప్పడం మొదలుపెట్టాడు. ఒకవేళ తనకే ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చినా ప్రశాంత్‌కు అయినా, యావర్‌కు అయినా ఉపయోగించేవాడిని అని అర్జున్‌తో చెప్పాడు. చివరికి శోభాను కూడా పిలిచి ‘‘నేను ఓడిపోయినందుకు అరిచినట్టు అనిపించిందా?’’ అని అడిగాడు. దానికి అవును అనే సమాధానం ఇచ్చింది శోభా. అయితే అలా కాదని సంచాలకురాలిగా తను ఎక్కడ తప్పుడు నిర్ణయం తీసుకుంటుందో అన్న భయంతో, యావర్‌కు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అని అరిచినట్టుగా తెలిపాడు. కానీ శివాజీ.. తాను గేమ్ ఓడిపోయిన అసహనంలోనే అరిచాడని ప్రేక్షకులకు కూడా అర్థమయ్యింది.
సంచాలకురాలిగా శోభా ఫెయిల్..
సంచాలకురాలిగా శోభా.. యావర్ విన్నర్‌గా ప్రకటించింది. కానీ ఈ నిర్ణయంతో మిగతా కంటెస్టెంట్స్ అంగీకరించలేదు. యావర్ చేసిన తప్పులేంటి అని శోభాకు కూర్చోబెట్టి చెప్పే ప్రయత్నం చేశారు. ఇదంతా అప్పుడే చెప్పొచ్చు కదా అని పక్కకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది శోభా. ఆ తర్వాత శివాజీ వచ్చి తనను డిఫెండ్ చేసుకోవడానికి అరవలేదని కవరింగ్ చేసిన విషయాన్ని తన ఫ్రెండ్స్‌తో చెప్పుకుంది. యావర్ విన్నర్ అని ప్రకటించగానే మంచి నిర్ణయం అంటూ శివాజీ చేసిన కామెంట్‌ను కూడా గుర్తుచేసుకుంది.
Also Read: ప్రియాంక చేతికి కెప్టెన్సీ - పాపం అమర్‌దీప్, అరుపులే మిగిలాయ్!